Justice LAVU Nageshwara Rao
-
సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. -
సమాజ హితం కోరేవారే నిజమైన సెలబ్రిటీలు
మద్దిలపాలెం (విశాఖపట్నం): సమాజహితం కోసం ఆలోచన చేసేవారు, తమ కృషి ద్వారా ప్రజలకు మేలు చేకూరే రీతిలో పాటుపడేవారే నిజమైన సెలబ్రిటీలని, డబ్బులిచ్చుకుని సత్కారాలు చేయించుకునే వారు కాదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ పురస్కార ప్రదానోత్సవం శనివారం రాత్రి విశాఖపట్నంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చలమేశ్వర్ చేతుల మీదుగా లోక్‌నాయక్ పురస్కారాన్ని, రూ.1.50 లక్షల నగదును ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు అందజేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్యపురస్కారాన్ని, రూ. 50 వేల నగదును బాలల వికాసానికి కృషిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఎన్.మంగాదేవికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అందించారు. అలాగే దివ్యాంగుల కళా సాహిత్య సాంస్కృతిక రంగానికి సేవలందిస్తున్న వంశీ రామరాజుకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.50 వేల నగదును కేరళ మాజీ న్యాయమూర్తి, హ్యూమన్‌రైట్స్ కమిషనర్ ఆంథోని డోమానే అందజేశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ రచనలు, సేవల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపే వారే సెలబ్రిటీలుగా నిలుస్తారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు ముగ్గురికి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. డబ్బుపై యావ తగ్గించుకుని మంచి పనులు చేసేవారికి కీర్తిప్రతిష్టలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ పురస్కారాలందించడం అంటే వారిలోని సేవాసంస్కారాన్ని గుర్తించడమేనని చెప్పారు. కేరళ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు, మాజీ న్యాయమూర్తి ఆం«థోని డోమానే మాట్లాడుతూ సేవ చేసేవారిని సత్కరించి వారిలో సేవాతత్వాన్ని నింపేందుకు లోక్‌నాయక్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సాహిత్యంతోనే సమాజహితం సమాజహితానికి సాహిత్యం ఎంతో దోహదపడుతుందని, అంతటి శక్తి యుక్తి సాహిత్యానికి ఉందని లోక్‌నాయక్ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. తాను ఇప్పటివరకు 32 నవలలు, వంద పైచిలుకు కథలు రాశానన్నారు. తాను రాసిన తొలి నవల అంపశయ్యనే తన ఇంటి పేరుగా పిలుస్తున్నారన్నారు. విశాఖ అన్నా, ఇక్కడి సాగర తీరమన్నా తనకు చాలా ఇష్టమన్నారు. అలాంటి గొప్ప నేలపై గొప్ప పురస్కారాన్ని తీసుకోవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. మానవత్వాన్ని మేల్కొల్పడమే ధ్యేయం బాలల వికాసానికి నిర్వహిస్తున్న చేతన, బాలబడి తదితర సేవా కార్యక్రమాల ద్వారా భావితరాలలో మానవత్వాన్ని మేల్కొల్పడమే ధ్యేయమని గుంటూరుకు చెందిన ఎన్. మంగాదేవి అన్నారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వంశీరామరాజు మాట్లాడుతూ 30 ఏళ్లుగా దివ్యాంగులకు సేవలందిస్తున్నానన్నారు. తన ఆశ్రమంలో చదివిన దివ్యాంగులు వాషింగ్టన్ బ్యాంకులో ఉద్యోగం చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అప్పరసు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
తలుపులు పగులగొట్టి పారిపోయేలా రక్షిత గృహాలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణాలో పట్టుబడిన బాధితులకు రక్షణగా ఉంటా యని భావించే రక్షిత గృహాలే పెద్ద సమస్యగా మారాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆందో ళన వ్యక్తం చేశారు. రక్షిత గృహాల్లో బాధితులు ధైర్యంగా ఉండే పరిస్థితులు లేకపోవడంతో వాటి నుంచి పారిపోతున్న ఘటనలు చోటు చేసు కుంటున్నాయని చెప్పారు. బాధితులు లైంగిక వేధింపులు, వెట్టి, బానిసత్వానికి గురౌతున్నారని చెప్పారు. జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ‘మానవుల అక్రమ రవాణా నివా రణ’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రారంభోప న్యాసం చేశారు. హైదరాబాద్‌లో 2012లో 34 మంది బాధిత మహిళలు పారిపోయారని, ఈ రక్షిత గృహం తలుపుల్ని పగులగొట్టుకుని మరో 135 మంది వెళ్లిపోయారంటే అక్కడి పరిస్థితులను సంస్కరించాల్సిన అవసరం ఎంతగా ఉందో స్పష్టం అవుతోందని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు. మరో ఘటన లో బాధిత మహిళ పారిపోయి ఆత్మహత్యాయ త్నానికి ప్రయత్నించిందన్నారు. రక్షిత గృహాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణా బాధితులకూ హక్కులు ఉన్నాయని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికం: ఏసీజే తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఎక్కువగా ఉందని, కమర్షి యల్ సెక్స్‌వర్కర్ల సంఖ్య కూడా అధికంగా ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ఒక ప్పుడు మానవ అక్రమ రవాణాలో మహి ళలు, పిల్లలే ఉండేవా రని, ఇప్పుడు అవయవాల నుంచి ఆఫీసుల వరకు, పార్లర్ల నుంచి ఫ్రెండ్షిప్ క్లబ్‌ల వరకూ మానవ అక్రమ రవాణా పరిధి విస్తరించ డం ఆందోళన కరమన్నారు. సదస్సుకు జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో ఉభయ రాష్ట్రాల పబ్లిక్ ప్రాసిక్యూ టర్లు, పలువురు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. -
కొత్త యజమానికి సంబంధం లేదు
♦ పాత యజమాని విద్యుత్ బకాయిలపై సుప్రీంకోర్టు ♦ టీఎస్పీడీసీఎల్ పిటిషన్ కొట్టివేత సాక్షి, హైదరాబాద్: వేలంలో ఓ కంపెనీని కొనుగోలు చేసిన ప్పుడు పాత యజమాని విద్యుత్ బిల్లుల బకాయిలతో కొత్త యజమానికి సంబంధం ఉండదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నెపంతో సదరు కంపెనీకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలా ఓ కంపెనీకి విద్యుత్ కనెక్షన్ నిరాకరించిన తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్పీడీసీఎల్) తీరును తప్పుపట్టింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీఎస్పీడీసీఎల్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా బొల్లారంలోని మెసర్స్ జేటీ అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తీసుకున్న అప్పును చెల్లించకపోవడంతో ఆ కంపెనీ భూమి, ప్లాంట్, యంత్రాలను సిటీ యూనియన్ బ్యాంక్ వేలం వేసింది. ఆ వేలంలో గోపాల్ అగర్వాల్ ఆ కంపెనీ ఆస్తులను సొంతం చేసుకున్నారు. మెదక్ విద్యుత్ అధికారి సిటీ యూనియన్ బ్యాంక్‌కు లేఖ రాసి.. జేటీ అల్లాయ్స్ తమకు రూ.1.18 కోట్ల మేర విద్యుత్ బిల్లు బకాయి ఉందని, అందువల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తంలో నుంచి తమకు ఈ బకాయిలు చెల్లించాలని కోరింది. అయితే వేలంలో వచ్చినదానికి తమకు చెల్లించాల్సిన మొత్తం సరిపోయిందని బ్యాంకు తెలిపింది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు... తాను కొన్న కంపెనీకి లోటెన్షన్ (ఎల్టీ) విద్యుత్ కనెక్షన్ కోసం గోపాల్ అగర్వాల్ దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి పాత యజమాని బిల్లు బకాయి ఉన్నారన్న కారణంతో అగర్వాల్‌కు విద్యుత్ కనెక్షన్‌ను తిరస్కరించడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. దీనిపై టీఎస్పీడీసీఎల్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ధర్మాసనం సైతం సింగిల్ జడ్జి ఉత్తర్వులనే సమర్థించింది. హైకోర్టు ధర్మాసనం తీర్పుపై టీఎస్పీడీసీఎల్ సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం... హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించడంలేదని అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.