శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు. చిత్రంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ నాగార్జునరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణాలో పట్టుబడిన బాధితులకు రక్షణగా ఉంటా యని భావించే రక్షిత గృహాలే పెద్ద సమస్యగా మారాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆందో ళన వ్యక్తం చేశారు. రక్షిత గృహాల్లో బాధితులు ధైర్యంగా ఉండే పరిస్థితులు లేకపోవడంతో వాటి నుంచి పారిపోతున్న ఘటనలు చోటు చేసు కుంటున్నాయని చెప్పారు. బాధితులు లైంగిక వేధింపులు, వెట్టి, బానిసత్వానికి గురౌతున్నారని చెప్పారు.
జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ‘మానవుల అక్రమ రవాణా నివా రణ’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రారంభోప న్యాసం చేశారు. హైదరాబాద్‌లో 2012లో 34 మంది బాధిత మహిళలు పారిపోయారని, ఈ రక్షిత గృహం తలుపుల్ని పగులగొట్టుకుని మరో 135 మంది వెళ్లిపోయారంటే అక్కడి పరిస్థితులను సంస్కరించాల్సిన అవసరం ఎంతగా ఉందో స్పష్టం అవుతోందని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు. మరో ఘటన లో బాధిత మహిళ పారిపోయి ఆత్మహత్యాయ త్నానికి ప్రయత్నించిందన్నారు. రక్షిత గృహాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణా బాధితులకూ హక్కులు ఉన్నాయని ఆయన అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికం: ఏసీజే
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఎక్కువగా ఉందని, కమర్షి యల్ సెక్స్‌వర్కర్ల సంఖ్య కూడా అధికంగా ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ఒక ప్పుడు మానవ అక్రమ రవాణాలో మహి ళలు, పిల్లలే ఉండేవా రని, ఇప్పుడు అవయవాల నుంచి ఆఫీసుల వరకు, పార్లర్ల నుంచి ఫ్రెండ్‌షిప్ క్లబ్‌ల వరకూ మానవ అక్రమ రవాణా పరిధి విస్తరించ డం ఆందోళన కరమన్నారు. సదస్సుకు జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో ఉభయ రాష్ట్రాల పబ్లిక్ ప్రాసిక్యూ టర్లు, పలువురు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment