K
-
విరాళాల సేకరణలో శివసేన టాప్
సాక్షి, న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు వచ్చిన విరాళాలు 37,794 శాతం, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి విరాళాలు 410 శాతం, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి 317 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 156 శాతం పెరిగాయి. 2018–19లో జేఎంఎంకు 0.017 కోట్లు, ఎల్జేపీకి 0.515 కోట్లు, ఎస్పీకి రూ.1.054 కోట్లు రాగా, 2019–20లో ఆయా పార్టీలకు వరుసగా రూ.6.442 కోట్లు, రూ.2.629 కోట్లు, రూ.4.392 కోట్లు వచ్చాయి. పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక శుక్రవారం విడుదలయ్యింది. 2019–20లో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్–5 పార్టీల్లో శివసేన, ఏఐఏడీఎంకే, ఆప్, బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. 2018–19లో కంటే 2019–20లో తమకు విరాళాలు తగ్గాయని శివసేన, బీజేడీ, వైఎస్సార్సీపీ ప్రకటించగా, తాము స్వీకరించిన విరాళాలు పెరిగాయని ఏఐఏడీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించాయి. టాప్–5 పార్టీలకు రూ.189.523 కోట్లు తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉందని ఏడీఆర్ గుర్తించింది. ఇందులో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించినట్లు ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంటున్నట్లు తెలిపింది. ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి. తగ్గిన విరాళాలు 2018–19 నాటి విరాళాలతో పోలిస్తే 2019–20లో జేఎంఎం, ఎల్జేపీ, ఎస్పీ, ఆప్‌లకు విరాళాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీకి రూ.71.651 కోట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రూ.40.876 కోట్లు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి రూ.23.573 కోట్లు, శివసేనకు రూ.7.371 కోట్లు, జేడీయూకు రూ.7.098 కోట్ల మేర విరాళాలు తగ్గాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం రూ.233.686 కోట్ల విరాళాలలో, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 421 విరాళాల నుండి రూ.4.884 కోట్లు నగదు రూపంలో స్వీకరించాయి. ఇది పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలలో 2.09% అని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచే విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి విరాళాల ద్వారా రూ.181.522 కోట్లు రాగా, 5,916 మంది వ్యక్తిగత దాతలు రూ.42.48 కోట్లు ఇచ్చారు. అదే సమయంలో మరో రూ.30.766 కోట్ల విరాళాల సమాచారాన్ని పార్టీలు బయటపెట్టలేదు. విరాళాలు స్వీకరించినట్లు ప్రకటించిన 27 ప్రాంతీయ పార్టీలలో 16 పార్టీలు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) వివరాలు లేకుండా రూ.24.779 కోట్ల విరాళాలు స్వీకరించినట్లు వెల్లడించాయి. కాగా, 14 ప్రాంతీయ పార్టీలు.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేడీ, డీఎంకే, శివసేన, ఆప్, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, జేఎంఎంలు రూ.447.498 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్డీపీపీ, డీఎండీకే, జేకేఎన్సీ పార్టీలు తాము అందుకున్న విరాళాల వివరాలను ప్రకటించలేదు. -
శశికళపై కోర్టుల్లో పిటిషన్ల పరంపర
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న శశికళపై పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. శశికళ మద్దతుదారులు నిర్బంధించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు విముక్తి కలిగించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో, ఆస్తుల కేసులో తీర్పు వెలువడే వరకు ప్రమా ణ స్వీకారంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్లు దాఖల య్యాయి. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించిన నేపథ్యంలో.. కున్నమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రన్ కనపడడం లేదని, ఆయన జాడ కనిపెట్టి, న్యాయస్థానంలో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఇలవరసన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాది కె.బాలు, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి గురువారం వేర్వేరుగా హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు హాజరై అన్నాడీఎంకేకు చెందిన 130 ఎమ్మెల్యేలను విడిపించి, కోర్టులో హాజరు పర్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ... ఎమ్మె ల్యేలు కిడ్నాప్‌నకు గురికాలేదని, ఇంటివద్దనే సురక్షితంగా ఉన్నారని వాదించారు. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు స్పందిస్తూ... ఎమ్మె ల్యేల కిడ్నాప్ అంశంపై పిటిషన్ దాఖలు చేస్తేనే విచారణ చేపట్టగలమని అన్నారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన చట్ట పంచాయిత్తు ఇయక్కం తరఫున సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాడు. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకూ సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశాడు. -
కరీంనగర్లో బీజేపీ భారీ ధర్నా
కరీంనగర్: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీజేపీ భారీగా ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా సోమవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వసూల్ రాజా
కార్యాలయంలో రూ.2,16,500, లజపతిరావు ఇంట్లో రూ.5,20,500 నగదు స్వాధీనం రూ.6.21 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు సీజ్ ప్రతి హాస్టల్ విద్యార్థి నుంచి రూ.15 చొప్పున వసూలు చివరి విడత డైట్ చార్జీల చెల్లింపులో చేతివాటం ఏలూరు (వన్ టౌన్) : హాస్టల్ విద్యార్థుల నుంచి లంచాలు వసూలు చేస్తూ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.లాలాలజపతిరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అతడిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంతోపాటు లజపతిరావు ఇంట్లో తనిఖీలను కొనసాగిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు చివరి మూడు నెలల భోజన చార్జీలకు సంబంధించిన సొమ్ము చెల్లింపుల సందర్భంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.15 చొప్పున వసూలు చేసినట్టు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఏసీబీ డీఎస్పీ కె.రాజేం ద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్స్ ఉంటున్న ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల భోజన ఖర్చుల కోసం చివరి మూడు నెలలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాలను చెల్లించేందుకు వారినుంచి లంచాలు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏసీబీ బృందం ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం మెరుపు దాడిచేసింది. ఆ సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.లాలాలజపతిరావు జేబులోంచి రూ.14,500, అదే కార్యాలయంలో ఉన్న భీమవరం హాస్టల్ వార్డెన్ ఎం.తిరుపతిరావు, పాల కొల్లు హాస్టల్ వార్డెన్ ఎల్.కరుణాకరరావు నుంచి రూ.43 వేలు, 24 హాస్టళ్ల నుంచి వసూలు చేసి లజపతిరావు టేబుల్‌పై ఉంచిన రూ.1,09,000లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ జి.సతీష్‌కుమార్ ఉపయోగిస్తున్న బీరువాలో ఉన్న రూ.50 వేలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంలో 24 హాస్టళ్లలో ఏ హాస్టల్ నుంచి ఎంత సొమ్ము వసూలు చేశారనే వివరాలతో కూడిన చిట్టా లజపతిరావు వద్ద లభించింది. లజపతిరావు ఇంట్లో సోదాలు చేయగా రూ.5,20, 500 నగదు, రూ.6,21,000 విలువైన 11 ప్రాంసరీ నోట్లు లభ్యమయ్యాయి. రాత్రి 11.30 గంటల వరకూ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 చొప్పున.. జిల్లాలో 89 హాస్టళ్లు ఉండగా, సుమారు 7వేల మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ డైట్ చార్జీల చివరి క్వార్టర్ బడ్జెట్ విడుదలైంది. ఆ మొత్తాలను మంజూరు చేసేందుకు ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.15 చొప్పున హాస్టల్ వార్డెన్లు వసూలు చేశారు. మొదటి విడతగా 24 హాస్టళ్లలోని విద్యార్థుల నుంచి రూ.1,09,000 వసూలు చేశారు. భీమవరం హాస్టల్ వార్డెన్ ఎం.తిరుపతిరావు, పాలకొల్లు హాస్టల్ వార్డెన్ ఎల్.కరుణాకరరావు వసూలు చేసిన రూ.43 వేలను లజపతిరావుకు ఇచ్చేందుకు తీసుకువచ్చారు. పెద్దమొత్తంలో సొమ్ములు చేతులు మారుతున్నాయన్న సమాచారం అధికారులకు అందటంతో ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్రరావు, సీఐ యూజే విల్సన్, సిబ్బంది రంగంలోకి దిగటంతో వ్యవహారం వెలుగుచూసింది. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లజపతిరావు, సూపరింటెండెంట్ సతీష్కుమార్లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. -
కార్తికేయ మూవీ స్టిల్స్