జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
► ఆయిల్ కంపెనీలకు సూచన
► రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ జేసీ కె.నాగేంద్ర
అల్లిపురం(విశాఖ దక్షిణ): పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రానప్పటికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ కె.నాగేంద్ర స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లకు జీఎస్టీ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి రంగానికి జీఎస్టీ అవసరమన్నారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జీఎస్టీ పరిధిలోకి రానప్పటికీ.. నమోదు చేసుకోవడా నికి గల కారణాలు వివరించారు. రాష్ట్రానికి 45 శాతం పెట్రోలు రంగం ద్వారానే ఆదాయం వస్తోందన్నారు. ఏడాదికి రూ.9 వేల కోట్లు ఆదాయం పన్నుల రూపంలో వస్తోందన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆరు జిల్లాల నుంచి పెట్రోలు, డీజిల్ డీలర్లు పాల్గొన్నారు.