Kaashmora
-
కాష్మోరాకు కత్తెర..12 నిమిషాలు కట్
చెన్నై: ప్రముఖ నటుడు కార్తీ అభిమానులకు చిన్న నిరాశ. ఆయన నటించిన చిత్రం కాష్మోరాకు కత్తెర వేశారు. పన్నెండు నిమిషాల నిడివిని తగ్గించారు. అయితే, సినిమా సౌకర్యార్థమే ఈ చిత్ర నిడివిని తగ్గిచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా శుక్రవారం కాష్మోరా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనున్న విషయం తెలిసిందే. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం 2గంటల 44నిమిషాల నిడివి ఉంది. అయితే, అందులో 12 నిమిషాల నిడివిని తగ్గించి తాజాగా 2గంటల 32 నిమిషాలకు సినిమా రన్నింగ్ టైంను కుదించారు. ఇప్పటికే ఈ సినిమాలో హర్రర్, కామెడీ, యాక్షన్, ఇతర అంశాల మేళవింపుతో ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలిసిన విషయం తెలిసిందే. -
కార్తీ కొత్త చిత్రం ట్రైలర్ వచ్చేసింది
-
కార్తీ కొత్త చిత్రం ట్రైలర్ వచ్చేసింది
హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది నటుడు, తమిళ తెలుగు చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా ట్రైలర్ విడుదలైంది. నటుడు కార్తీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీ మూడు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. మాయలు, మంత్రాలు, లోకాతీత శక్తులతో నిండిన భారీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో చూపించన ప్రకారం కార్తీ ఈ చిత్రంలో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది.