
కార్తీ కొత్త చిత్రం ట్రైలర్ వచ్చేసింది
హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది నటుడు, తమిళ తెలుగు చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా ట్రైలర్ విడుదలైంది. నటుడు కార్తీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీ మూడు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నాడు.
మాయలు, మంత్రాలు, లోకాతీత శక్తులతో నిండిన భారీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో చూపించన ప్రకారం కార్తీ ఈ చిత్రంలో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది.