కాష్మోరాకు కత్తెర..12 నిమిషాలు కట్ | Karthi's fantasy thriller trimmed by 12 minutes | Sakshi
Sakshi News home page

కాష్మోరాకు కత్తెర..12 నిమిషాలు కట్

Published Wed, Oct 26 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

కాష్మోరాకు కత్తెర..12 నిమిషాలు కట్

కాష్మోరాకు కత్తెర..12 నిమిషాలు కట్

చెన్నై: ప్రముఖ నటుడు కార్తీ అభిమానులకు చిన్న నిరాశ. ఆయన నటించిన చిత్రం కాష్మోరాకు కత్తెర వేశారు. పన్నెండు నిమిషాల నిడివిని తగ్గించారు. అయితే, సినిమా సౌకర్యార్థమే ఈ చిత్ర నిడివిని తగ్గిచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా శుక్రవారం కాష్మోరా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనున్న విషయం తెలిసిందే.

ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం 2గంటల 44నిమిషాల నిడివి ఉంది. అయితే, అందులో 12 నిమిషాల నిడివిని తగ్గించి తాజాగా 2గంటల 32 నిమిషాలకు సినిమా రన్నింగ్ టైంను కుదించారు. ఇప్పటికే ఈ సినిమాలో హర్రర్, కామెడీ, యాక్షన్, ఇతర అంశాల మేళవింపుతో ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలిసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement