Kaatru Veliyidai
-
ఆయన దూకమంటే దూకేస్తా!
తమిళసినిమా: నేను చాలా కష్టపడే అవకాశాలు పొందాను అంటోంది నటి అదితిరావ్. ఈ బాలీవుడ్ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో నటుడు కార్తీతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించి గుర్తింపు పొందింది. హిందీలోనూ నటిస్తున్న అదితిరావ్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పద్మావత్ చిత్రంలోనూ కీలకపాత్రను పోషించింది. తాజాగా మణిరత్నం ఈ అమ్మడికి మరో చాన్స్ ఇచ్చారు. ఆయన తాజా చిత్రం సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబులతో కలిసి నటిస్తోంది. ఇందులో నటి జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్ కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నటి అదితిరావ్ తన భావాలను పంచుకుంది. అవేమిటో చూద్దాం. నేను చిన్నతనం నుంచి మణిరత్నం అభిమానిని. బొంబాయి చిత్రం చూసి అందులోని నటి మనీషాకొయిరాలలా అవ్వాలని కలలు కన్నాను. అందుకే డాన్స్‌ను నేర్చుకున్నాను. అలాంటి తరుణంలో మణిరత్నం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. కాట్రువెలియిడై చిత్రంలో నటించే అవకాశం రావడంతో పట్టరాని సంతోషం కలిగింది. ఆయన నటీనటుల నుంచి చాలా సున్నితంగా నటనను రాబట్టుకోవడంలో దిట్ట. మణిరత్నం కిందకు దూకమన్నా ఆలోచించకుండా దూకేస్తాను. విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశపడుతున్నాను. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు రావడం సులభం. అలాంటి నేపథ్యం లేనివారు ఈ రంగంలో ఎదగడం కష్టతరం. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను. నటిగా సపోర్టు చేయడానికి ఎవరూ లేరు. చాలా కష్ట పడే అవకాశాలు అందుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు టర్నింగ్ ఇచ్చే కథా పాత్ర ఇంకా అమరలేదు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను అని నటి అదితిరావ్ పేర్కొంది. -
సంగీత మాంత్రికుడి మరో రికార్డు
కీర్తి అంతా భగవంతుడికే. మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఆలోచనల సముద్రం. మణిరత్నం చిత్రం తనకెప్పుడూ ప్రత్యేకమే. మణిరత్నం అన్నయ్య, కార్తీ, చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. దేశానికి చాలా అవసరమైన చిత్రానికి తనకు జాతీయ అవార్డు రావడం సంతోషం అన్నారు. మామ్ చిత్రం కోసం నటి శ్రీదేవి చెన్నైకి వచ్చినప్పుడు ఇది చాలా స్పెషల్. అయితే నటి శ్రీదేవినే మిస్ అయ్యాం. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మరో రికార్డును సాధించారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఉప్పొంగే ఓ కెరటం ఏఆర్ రెహ్మాన్. సినీ సంగీతాన్ని కొత్తబాట పట్టించిన ధ్రువతార ఈయన. శాస్త్రీయ, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలతో సినీ ప్రేక్షకులను ఓలలాడించిన సంగీత మాంత్రికుడు రెహ్మాన్. సంగీతాన్ని ఎప్పటికప్పుడు కొత్త పుంతులు తొక్కిస్తూ ప్రయోగాల వీరుడిగా పేరు గాంచిన ఏఆర్ రెహ్మాన్ సినీ సంగీతానికే ఒక బ్రాండ్‌గా నిలిచారు. 25 ఏళ్ల కిందట రోజా చిత్రంతో సువాసనలు వెదజల్లి తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును కొల్లగొట్టిన సంగీత గని రెహ్మన్. అలా మొదలైన ఈయన సంగీత పయనం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్లో పరవళ్లు తొక్కింది. మహామహులైన భారత సినీ కళాకారులకు కలగా మిగిలిన ఆస్కార్ అవార్డును స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో అవలీలగా సాధించారు. సినీ భారతావని కీర్తి కిరీటాలను ప్రపంచానికి చాటారు. సంగీతం ఎల్లలు చెరిపేసిన ఈయన ఎందరో నూతన గాయనీగాయకులకు అవకాశాలను కల్పించి అందులోనూ రికార్డు సాధించారు. రోజా చిత్రంతోనే జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్న ఏఆర్.రెహ్మాన్ ఆ తరువాత మిన్సార కనువు, కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రాలకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అదే విధంగా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లి అక్కడ లగాన్ చిత్రానికి జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రానికి ఉత్తమ సంగీతదర్శకుడి అవార్డును, హిందీ చిత్రం మామ్ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గానూ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 65వ జాతీయ సినీ అవార్డులను వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ఒకే వేదికపై స్లమ్‌డాగ్ మిలీనియర్ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్న రెహ్మాన్ రికార్డు నెలకొల్పారు. అదే విధంగా ఇప్పుడు ఒకే సారి రెండు జాతీయ అవార్డులను అందుకోనున్నారు.ఇదీ రికార్డే. ఇళయరాజా రికార్డు బ్రేక్ ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా సాధించిన జాతీయ అవార్డుల రికార్డును రెహ్మాన్ బ్రేక్ చేశారు. ఇళయరాజా ఇప్పటి వరకూ 5 జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఏఆర్.రెహ్మాన్ ఇంతకు ముందు రోజా, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, మిన్సార కనవు, లగాన్ చిత్రాలకు జాతీయ పురష్కారాలను అందుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రంకు, హింది చిత్రం మామ్‌కు గానూ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుని ఆరు జాతీయ పురష్కారాలను అందుకున్న సంగీత దర్శకుడిగా ఇళయరాజా రికార్డును బ్రేక్ చేశారు. 65 వ జాతీయ అవార్డుల ప్రకటనలో ఈ సారి తమిళ చిత్ర పరిశ్రమ మూడు అవార్డులను గెలుచుకుంది. అందులో కాట్రువెలియిడై చిత్రానికి గానూ ఏఆర్.రెహ్మాన్, టూలెట్ అనే తమిళ చిత్రానికి ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఉత్తమ చిత్రంగానూ, కాట్రులియిడై చిత్రంలోని వాన వరువాన్ అనే పాటకుగానూ గాయని శాషా త్రిపాధి జాతీయ అవార్డులను ప్రకటించారు. ఇలా ఈ సారి మణిరత్నం తమిళ చిత్రపరిశ్రమ గౌరవాన్ని కాస్త కాపాడారనే చెప్పాలి. -
ఆ సన్నివేశాలు హద్దు దాటవు
మణిరత్నం చిత్రాల్లో ఆ సన్నివేశాలెప్పుడూ హద్దు దాటవు అంటున్నారు నటుడు కార్తీ. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కాట్రువెలియిడై. ఇందులో కార్తీకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు నటించారు. ఇందులో కార్తీ యుద్ధ విమాన పైలట్‌గా నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టిన కాట్రు వెలియిడై చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని కార్తీ తెలుపుతూ దర్శకుడు మణిరత్నం చిత్ర కథను ఇచ్చి చదవమన్నారన్నారు. ఇది యుద్ధ విమాన పైలట్ గురించిన కథ కావడంతో అస్సలు అర్థం కాలేదన్నారు. ఇదే విషయాన్ని మణిరత్నంకు చెప్పగా ఫైటర్ పైలట్‌గా పనిచేసేవారితో ఉండి వారి అనుభవాలను, విధి నిర్వహణలు తెలుసుకునేలా ఏర్పాటు చేశారని చెప్పారు. ఫైటర్ పైలట్స్ ఆసాధారణ విధులు తనను ఎంతగానే విస్మయ పరచాయన్నారు. కాట్రు వెలియిడై పాత్రలోని విషయం తనుకు అప్పుడు అర్థమైందని అన్నారు. ఇందులో మాలీవుడ్ నటి అతిథిరావు నాయకిగా నటించడంతో ఆమెతో రొమాన్స్ సన్నివేశాలు ఉన్నాయా? అని అడుగుతున్నారని, అలాంటి సన్నివేశాలున్నా మణిరత్నం చిత్రాల్లో హద్దులు మీరవని కార్తీ పేర్కొన్నారు. ఇందులో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించాల్సి ఉందని, ఆమె ఎందుకు నటించలేదో దర్శకుడినే అడగాలని అన్నారు. ఇకపోతే ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మధురంగా ఉంటాయని కార్తీ పేర్కొన్నారు. ఆ చిత్రం చెలియా పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. -
ఐరోపాలో మణిరత్నం, కార్తీల చిత్ర షూటింగ్
మణిరత్నం, కార్తీల చిత్రం ఐరోపా అందాలను తనలో బంధించుకోవడానికి సిద్ధమైందని తాజా సమాచారం. మణిరత్నం చిత్రం అంటేనే జయాపజయాలకు అతీతంగా ఒక అటెన్షన్‌ను నెలకొల్పుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఇప్పుడు చాలా మంది దర్శకులు అవసరం ఉన్నా, లేకపోయినా విదేశాల్లో చిత్రీకరించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అజిత్ నటిస్తున్న చిత్రం, సూర్య నటిస్తున్న చిత్రాల చిత్రీకరణ విదేశాల్లోనే జరుగుతుండడం గమనార్హం. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం 90 శాతం మలేషియాలోనే చిత్రీకరించుకుందన్నది తెలిసిన విషయమే. ఇక పలువురు పాటల కోసం విదేశాలకు వెళ్లడం పరిపాటే. కాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చాలా అవసరం అనుకుంటే గానీ విదేశాలలో చిత్రీకరించరు. 10 ఏళ్ల క్రితం కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రాన్ని అధిక భాగం శ్రీలంకలో చిత్రీకరించారు. ఆ తరువాత చాలా వరకూ స్వదేశంలోనే తన చిత్రాల షూటింగ్‌లను నిర్వహించారు. అలాంటిది ఆయన తాజా చిత్రం కాట్రు వెలియడై చిత్ర షూటింగ్ కోసం ఐరోపా దేశాలకు వెళ్లనున్నారు. కార్తీ, అతిథిరావు జంటగా నటిస్తున్న చిత్రం కాట్రు వెలియడై. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తయిoది. మిగిలిన షూటింగ్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా ఇందులోని పాటలను ఐరాపా దేశాల్లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ బయలుదేరనున్నట్లు సమాచారం. -
మంచు కొండల్లో మణిరత్నం షూటింగ్
ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం, తన నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ జానర్నే ఎంచుకున్న మణి, అదే బాటలో తనకు సక్సెస్ ఇచ్చిన లోకేషన్లలోనే షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ కట్రూ వెలియిదైని కూడా కశ్మీర్ అందాల మధ్య షూట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీ, అదితీరావ్ హైదరీలు జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ను ఈ నెలాఖరు నుంచి కశ్మీర్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రద్దా శ్రీనాథ్‌లపై పలు కీలక సన్నివేశాలను, ఒక పాటను చిత్రీకరించనున్నారు. 2017లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రవి వర్మన్ సినిమాట్రోగఫి బాధ్యతలు తీసుకున్నాడు. మణిరత్నం తన స్వీయ దర్శకత్వంలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. -
మణిరత్నం ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నై అభిరామ్పురంలోని మద్రాస్ టాకీస్ ఆఫీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. సిబ్బందితో పాటు ఇరుగు పొరుగు వారు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించటంతో వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా లక్షలల రూపాయిల ఆస్తి అగ్నికి ఆహుతైనట్టుగా చెపుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మణిరత్నం, కార్తీ హీరోగా తెరకెక్కుతున్న కట్రు వెలెయిదై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తన సొంతం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు మణి. ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఓకె బంగారం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మణిరత్నం ఈ సినిమాతో మరోసారి తన ఫాం కొనసాగించాలని భావిస్తున్నాడు. -
మణిరత్నం కొత్త సినిమా ఫస్ట్ లుక్
ఒకే బంగారం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మణిరత్నం తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవలే కార్తీ హీరోగా తన నెక్ట్స్ సినిమా ఉంటుందంటూ అఫీషియల్‌గా ప్రకంటించిన ఈ క్రియేటివ్ జీనియస్, ఆ సినిమా షూటింగ్ మొదలుతున్న సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కార్తీ సరసన అదితి రావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కూడా మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని పోస్టర్‌తోనే కన్ఫామ్ చేశాడు దర్శకుడు. ఫస్ట్ లుక్ పోస్టర్లో మూవీ టైటిల్‌తో పాటు సాంకేతిక నిఫుణుల పేర్లను కూడా ప్రకటించారు. కాట్రు వెలియిదై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మణిరత్నం స్వయంగా తన మద్రాస్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాధ్ ఎడిటింగ్, షర్మిస్టారాయ్ ఆర్ట్ డైరెక్షన్, వైరముత్తు సాహిత్య బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ రోజు (గురువారం) నుంచి ఈ సినిమా షూటింగ్ ఊటిలో ప్రారంభమవుతోంది.