ఐరోపాలో మణిరత్నం, కార్తీల చిత్ర షూటింగ్ | Mani Ratnam to shoot a song in Europe? | Sakshi
Sakshi News home page

ఐరోపాలో మణిరత్నం, కార్తీల చిత్ర షూటింగ్

Published Wed, Nov 9 2016 4:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

ఐరోపాలో మణిరత్నం, కార్తీల చిత్ర షూటింగ్

ఐరోపాలో మణిరత్నం, కార్తీల చిత్ర షూటింగ్

 మణిరత్నం, కార్తీల చిత్రం ఐరోపా అందాలను తనలో బంధించుకోవడానికి సిద్ధమైందని తాజా సమాచారం. మణిరత్నం చిత్రం అంటేనే జయాపజయాలకు అతీతంగా ఒక అటెన్షన్‌ను నెలకొల్పుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఇప్పుడు చాలా మంది దర్శకులు అవసరం ఉన్నా, లేకపోయినా విదేశాల్లో చిత్రీకరించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అజిత్ నటిస్తున్న చిత్రం, సూర్య నటిస్తున్న చిత్రాల చిత్రీకరణ విదేశాల్లోనే జరుగుతుండడం గమనార్హం.
 
 రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం 90 శాతం మలేషియాలోనే చిత్రీకరించుకుందన్నది తెలిసిన విషయమే. ఇక పలువురు పాటల కోసం విదేశాలకు వెళ్లడం పరిపాటే. కాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చాలా అవసరం అనుకుంటే గానీ విదేశాలలో చిత్రీకరించరు. 10 ఏళ్ల క్రితం కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రాన్ని అధిక భాగం శ్రీలంకలో చిత్రీకరించారు. ఆ తరువాత చాలా వరకూ స్వదేశంలోనే తన చిత్రాల షూటింగ్‌లను నిర్వహించారు.
 
 అలాంటిది ఆయన తాజా చిత్రం కాట్రు వెలియడై చిత్ర షూటింగ్ కోసం ఐరోపా దేశాలకు వెళ్లనున్నారు. కార్తీ, అతిథిరావు జంటగా నటిస్తున్న చిత్రం కాట్రు వెలియడై. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తయిoది. మిగిలిన షూటింగ్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా ఇందులోని పాటలను ఐరాపా దేశాల్లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ బయలుదేరనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement