మణిరత్నం ఆఫీస్లో అగ్ని ప్రమాదం
మణిరత్నం ఆఫీస్లో అగ్ని ప్రమాదం
Published Tue, Aug 9 2016 12:14 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నై అభిరామ్పురంలోని మద్రాస్ టాకీస్ ఆఫీస్లో ఈ ప్రమాదం జరిగింది. సిబ్బందితో పాటు ఇరుగు పొరుగు వారు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించటంతో వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా లక్షలల రూపాయిల ఆస్తి అగ్నికి ఆహుతైనట్టుగా చెపుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మణిరత్నం, కార్తీ హీరోగా తెరకెక్కుతున్న కట్రు వెలెయిదై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తన సొంతం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు మణి. ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఓకె బంగారం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మణిరత్నం ఈ సినిమాతో మరోసారి తన ఫాం కొనసాగించాలని భావిస్తున్నాడు.
Advertisement
Advertisement