మణిరత్నం కొత్త సినిమా ఫస్ట్ లుక్ | Mani Ratnam, Karthis Kaatru Veliyidai first look poster | Sakshi
Sakshi News home page

మణిరత్నం కొత్త సినిమా ఫస్ట్ లుక్

Published Thu, Jul 7 2016 2:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

మణిరత్నం కొత్త సినిమా ఫస్ట్ లుక్

మణిరత్నం కొత్త సినిమా ఫస్ట్ లుక్

ఒకే బంగారం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మణిరత్నం తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవలే కార్తీ హీరోగా తన నెక్ట్స్ సినిమా ఉంటుందంటూ అఫీషియల్గా ప్రకంటించిన ఈ క్రియేటివ్ జీనియస్, ఆ సినిమా షూటింగ్ మొదలుతున్న సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కార్తీ సరసన అదితి రావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కూడా మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని పోస్టర్తోనే కన్ఫామ్ చేశాడు దర్శకుడు.

ఫస్ట్ లుక్ పోస్టర్లో మూవీ టైటిల్తో పాటు సాంకేతిక నిఫుణుల పేర్లను కూడా ప్రకటించారు. కాట్రు వెలియిదై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మణిరత్నం స్వయంగా తన మద్రాస్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాధ్ ఎడిటింగ్, షర్మిస్టారాయ్ ఆర్ట్ డైరెక్షన్, వైరముత్తు సాహిత్య బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ రోజు (గురువారం) నుంచి ఈ సినిమా షూటింగ్ ఊటిలో ప్రారంభమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement