చిరు ఇమేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు
ప్రస్తుతం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. దాదాపు దశాబ్ద కాలం తరువాత చిరు హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో పాటు, అది చిరంజీవి 150వ సినిమా కూడా కావటంతో ఈ మూవీ పై భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా భారీ ప్రచారం సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు చిత్రయూనిట్.
అయితే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు చిన్న సినిమా నిర్మాతలు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సక్సెస్ సీక్రెట్‌గా మారిన హర్రర్ జానర్లో తెరకెక్కిన ఓ సినిమా, తెలుగు డబ్బింగ్ వర్షన్‌కు ఖైదీ నంబర్ 150 గుర్తుకు వచ్చేలా టైటిల్ నిర్ణయించారు. 'కాందబరి ఇంటి నంబర్ 150' అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. నవంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాకు 150 నంబర్ ఎంత వరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.