kadapa assembly constiuency
-
కడప.. మంత్రుల గడప
సాక్షి, కడప : జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కడప అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచిన వారికే ఎక్కువసార్లు మంత్రి పదవులు లభించాయి. 1952లో ఇక్కడ గెలిచిన కడప కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్.రామమునిరెడ్డికి వెద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించింది. 1985లో టీడీపీఅభ్యర్థిగా గెలుపొందిన సి.రామచంద్రయ్యకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా అవకాశం వచ్చింది. 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎస్ఏ ఖలీల్బాషాను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా నియమించారు. 2009లో రెండవ పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదుల్లా గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మైనార్టీ సంక్షేమశాఖను అప్పగించారు. ఇలా ఐదుసార్లు కడప ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. అసలే దక్కని నియోజకవర్గాలు రైల్వేకోడూరులో సరస్వతమ్మ, రాజంపేటలో బండారు రత్నసభాపతి, పసుపులేటి బ్రహ్మయ్య, బద్వేలులో బిజివేముల వీరారెడ్డి, మైదుకూరులో డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు నుంచి పి.శివారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కమలాపురంలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి పి.బసిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలు మంత్రులుగా పనిచేశారు. రాయచోటి, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు ఇంతవరకు మంత్రి పదవులు దక్కలేదు. -
అసెంబ్లీ బరిలో 143 మంది
సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిం ది. అసెంబ్లీ, లోక్సభ బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలింది. కడప లోక్సభ బరిలో 14 మంది, రాజంపేట లోక్సభ బరిలో తొమ్మిది మంది రంగంలో నిలిచారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 44 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 36 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా, ఉపసంహరణ అనంతరం 14 మంది మాత్రమే పోటీలో నిలిచారు. జిల్లాలో అత్యధికంగా రాజంపేట నియోజకవర్గంలో 20 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో 12 మంది చొప్పున పోటీలో ఉన్నారు. అసెంబ్లీ బరిలో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ప్రొద్దుటూరు బరిలో ఉన్న ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ఆయన సతీమణి లక్ష్మిప్రసన్న ఉన్నారు. కడప అసెంబ్లీకి సంబంధించి జై సమైక్యాంధ్ర అభ్యర్థి సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే చివరి క్షణంలో తెలుగుదేశం అభ్యర్థిగా దుర్గాప్రసాద్రావును రంగంలో నిలిపారు. అయితే కడప అసెంబ్లీ బరిలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఇద్దరూ బరిలో ఉన్నారు.