Kadapa collector
-
సీఎం ఆశయసాధనకు కార్యరూపం
సాక్షి, కడప: ‘‘సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆయన సొంత జిల్లాలో పనిచేయడం మధురానుభూతి’’ అని కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించారు. సిబ్బందిని పలకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాక్షి : కొత్త ఏడాది ప్రభుత్వ లక్ష్యాలేమిటి? కలెక్టర్ : ఈ ఏడాదిలో జిల్లాలోని రైతులందరికీ సాగునీరు అందించడమే ప్రధాన ఎజెండా. వైఎస్ హయాంలో నెలకొలి్పన గాలేరు–నగరి సుజల స్రవంతి ఫేజ్–2 పనులను రివర్స్ టెండరింగ్‌లో ఖరారు చేశాం. పనులను పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తాం. ఫేజ్–1లో వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో పిల్ల కాలువలను పూర్తి చేస్తాం. సాక్షి : గండికోట పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? కలెక్టర్ : గండికోట ప్రాజెక్టు పరిధిలో ఆర్అండ్ఆర్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. త్వరలో 20 టీఎంసీలు నిలుపాలన్నది లక్ష్యం. గండికోట పరిధిలో రూ. వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి విడతలో రూ. 140 కోట్లు కేటాయించారు. ముంపు వాసులకు ఈ పరిహారం చెల్లిస్తా. సాక్షి : కొత్త ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి చేస్తారు? కలెక్టర్ : కుందూ, తెలుగుగంగ ఎత్తిపోతల, రాజోలి ఆనకట్టల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇటీవలే శంకుస్థాపన చేశారు. 15 కిలోమీటర్ల పొడవున్న రాజోలి బండ్ నిర్మాణానికి అవసరమైన 400 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నాం. కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 60 ఎకరాలను సేకరిస్తున్నాం. సాక్షి : జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ఎప్పుడు? కలెక్టర్ : ఈ పథకానికి కూడా సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారు. సర్వే పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంది. అనంతరం పథకం పనులకు టెండర్లు పిలుస్తాం. చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులకు నీరిస్తాం. సాక్షి : నాడు–నేడు అమలు ఎలా? కలెక్టర్ : నాడు–నేడు ద్వారా జిల్లాలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడతలో 1048 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి 200 అంచనాలు సిద్ధమయ్యాయి. మరో 900 ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అంచనాలు పూర్తి కాగానే పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సోషియల్æ కాంట్రాక్టు కింద పనులు చేపడతాం. సాక్షి : పేదలకు వైద్య సేవలు అందించేందుకు తీసుకునే చర్యలు? కలెక్టర్ : ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 400 సబ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. 150 సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మరో 250 సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి. 150 కొత్త సబ్ సెంటర్లకు స్థలాలు సేకరిస్తున్నాం. కొత్త భవనాలు నిర్మిస్తాం. సాక్షి : పులివెందుల మెడికల్ కళాశాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? కలెక్టర్ : మెడికల్ కళాశాలకు స్థల సేకరణ పూర్తయింది. డిజైన్ అయ్యాక టెండర్లు పిలుస్తాం. కడపలో కేన్సర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిమ్స్‌లో స్థలం సిద్ధంగా ఉంది. డిజైన్ పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. సాక్షి : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు ఎప్పుడు? కలెక్టర్ : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు స్థలం ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. రిమ్స్ ఎదురుగా 10 ఎకరాల స్థలం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపి రెండు సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ కట్టేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి : అభివృద్ధి పనుల సంగతేమిటి? కలెక్టర్ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో రూ. 30–40 కోట్లతో మురుగు కాలువలను ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్నాం. వీటితోపాటు ఒక్కో నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నాం. సాక్షి : గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి? కలెక్టర్ : జిల్లాలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రూ. 40 లక్షలతో కొత్త భవనాలు, రూ. 30 లక్షలతో పాత భవనాల విస్తరణ, రూ. 25 లక్షలతో పాత భవనంపై కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నాం. ఒక్కొక్క సచివాలయాన్ని 2600 స్కోయర్ ఫీట్‌తో నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 280 కొత్త సచివాలయాలు మంజూరు చేశాం. వచ్చే జూలై, ఆగస్టు నాటికి వీటిని పూర్తి చేస్తాం. సాక్షి : పేదల గృహాల మంజూరు ఎప్పుడు? కలెక్టర్ : జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 1750 ఎకరాలను గుర్తించాం. ఇది 70 వేల మందికి సరిపోతుంది. ఇంకా 350 ఎకరాల స్థలం అవసరం ఉంది. సాక్షి : ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చేయబోతోంది? కలెక్టర్ : జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే జమ్మలమడుగు వద్ద స్టీల్ ప్లాంటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పనులు మొదలవుతాయి. రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కొప్పర్తి వద్ద ఈసీ క్లియరెన్స్ పూర్తి కాగానే ఆరు వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. సాక్షి : రోడ్ల విస్తరణ ఎప్పుడు మొదలు పెట్టనున్నారు? కలెక్టర్ : రేణిగుంట–కడప ఫోర్‌లేన్ హైవేను కర్నూలు ఫోర్‌లేన్ హైవేకు అనుసంధానం చేస్తున్నాం. భూసేకరణ మొదలు పెట్టాం. బెంగుళూరు–పులివెందుల రోడ్డు ముద్దనూరు వరకు విస్తరిస్తున్నాం. సాక్షి : కొత్త రైల్వేలైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? కలెక్టర్ : కడప–బెంగుళూరు రైల్వేలైన్ భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం పూర్తయింది. రైతులకు పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపాం. సాక్షి : పేదలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? కలెక్టర్ : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలందరికీ ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. జనవరి 3 నుంచి 1259 రకాల వ్యాధులకు, ఏప్రిల్ 1 నుంచి క్యాన్సర్‌తోపాటు పలు రకాల తీవ్ర వ్యాధులకు సైతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించనున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 21,550 మంది రోగులకు రూ. 55 కోట్లతో వివిధ రకాల ఆపరేషన్లు చేశాం. అలాగే వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా 15 వేల మందికి కంటి అద్దాలు ఇచ్చాం. మరో రెండు వేల మందికి ఆపరేషన్లు చేయబోతున్నాం. సాక్షి : ఆసరా అమలు తీరు ఎలా ఉంది? కలెక్టర్ : ఆసరా పథకం ద్వారా 836 జబ్బులతో బెడ్డుమీద ఉన్న వారికి నెలకు రూ. 5000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. సాక్షి : జిల్లాలో రూ. ఐదు వేల పెన్షన్ ఎవరెవరికి ఇస్తున్నారు? కలెక్టర్ : లెప్రసీ, పెరాలసిస్ స్టేజీ–3, 4, 5, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, రెండు బోదకాలు ఉన్న 15 వేల మందిని గుర్తించాం. వీరందరికీ రూ. 5 వేల పెన్షన్ ఇస్తున్నాం. సాక్షి : గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? కలెక్టర్ : జిల్లాలో 8547 గ్రామ సచివాల ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, 400 పో స్టులు మినహా మిగిలినవన్నీ భర్తీ చేశాం. ఖా ళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నాం. సాక్షి : సీఎం జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది? కలెక్టర్ : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి పరుగులు పెడుతున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా లక్ష్యాలను సాధిస్తా. ముఖ్యమంత్రి బాటలోనే అంతా ముందుకు సాగుతున్నాం. ఇది మంచి అనుభూతి. ఇక్కడ చేస్తున్న పని జీవితంలో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. సాక్షి : ప్రజాప్రతినిధులతో సమన్వయం ఎలా ఉంది? కలెక్టర్ : వైఎస్సార్ జిల్లాలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మొదలుకొని అందరితో సమన్వయం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నదే ముఖ్యమంత్రి సందేశం. సాక్షి : అవినీతి అక్రమాలపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? కలెక్టర్ : పాలనలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇది పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లింది. ఆ దిశగానే అందరం ముందుకు సాగుతున్నాం. కిందిస్థాయిలో అవినీతిని పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పాలన సాగుతోంది. సాక్షి : ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? కలెక్టర్ : ముఖ్యమంత్రి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడతారు. మేం చెప్పింది వింటారు. కరెక్ట్ అనిపిస్తే వెంటనే నిర్ణయం ఉంటుంది. నేను కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, చంద్రబాబు నాయుడు పాలన చూశాను. ఇలా ఎవరూ ఉండరు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంత నిబద్ధతతో పనిచేసే వారిని నేను చూడలేదు. సాక్షి :పెన్షన్లు తొలగిస్తున్నారన్న అపోహ కరెక్టేనా? కలెక్టర్ : పెన్షన్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నెలకు జిల్లాలో పెన్షన్ల ద్వారా ఇచ్చే మొత్తం రూ. 60–70 కోట్లకు పెరిగింది. వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల 15 వేలకు పైగా కొత్త పెన్షన్లు రానున్నాయి. సాక్షి :స్థానిక ఎన్నికల ప్రణాళిక సిద్ధమా? కలెక్టర్ : జిల్లాలో గత నాలుగైదు ఎన్నికల్లో ఒక్కచోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. అదే నిబద్దతతో, నిష్పక్షపాతంగా, పోలీసుల సహకారంతో స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తాం. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సైతం సిద్ధం చేశాం. -
పులివెందులలో ప్రగతి పరుగు
దేశ, రాష్ట్ర రాజకీయాలలో పులివెందులకు ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి, తనయులను ముఖ్యమంత్రులుగా పంపిన ఘన చరిత్ర పులివెందుల ప్రాంతానిది. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట. అలాంటి పులివెందుల ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏ అవకాశాన్ని వైఎస్ కుటుంబం వదులుకోలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారికి గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబమే. వైఎస్ కుటుంబీకులు ‘మేమున్నామంటూ’ వారి సమస్యలను తీరుస్తున్నారు. సాక్షి, పులివెందుల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పులివెందుల అభివృద్ధి పరుగు పెట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కనీస మౌలిక వసతుల కల్పన కోసం పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా) ఏర్పాటు చేసి, అందుకు పాడా ఆఫీసర్ ఆన్ స్పెషల్ (ఓఎస్డీ) అధికారిని నియమించడం జరిగింది. కేవలం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రగతి పనులు చేపట్టారు. అప్పట్లో దాదాపు రూ.200 కోట్ల నిధులు కేటాయించి, అభివృద్ధికి కృషి చేశారు. వైఎస్సార్ హయాంలో పాడా నిధుల ద్వారా తాగునీటి పథకాలు, సిమెంటు రోడ్లు, పాలశీతలీకరణ కేంద్రాలు, డ్రైనేజీ, వ్యవసాయ కార్యాలయ భవనాలు, బస్ షెల్టర్లు, కళాశాలల ప్రహరీ నిర్మాణాలు, పాఠశాలలకు ఫర్నీచర్ వంటి పనులు చేపట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత పాడా నిధులు ఆగిపోవడం జరిగింది. వైఎస్ జగన్ సీఎం కావడంతో.. వైఎస్సార్ మరణం తర్వాత పులివెందుల ప్రాంత అభివృద్ధి దాదాపు ఆగిపోయిందని చెప్పవచ్చు. వైఎస్సార్ మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు పులివెందుల ప్రాంతానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. వైఎస్సార్ తలపెట్టి, 90 శాతం పూర్తి చేసిన పథకాలకు అరకొర నిధులు మంజూరు చేసి అంతా తామే చేసినట్లుగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి పరుగులు పెట్టనుంది. పాడా చైర్మన్‌గా కలెక్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా) చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ హరికిరణ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పులివెందుల నియోజకవర్గంలోని అభివృద్ధికి ఎలాంటి పనులు, ఏ పనులు చేపట్టాలి వంటి విషయాలను కలెక్టర్ పర్యవేక్షిస్తారు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రగతి పనులు మొదలు కానున్నాయి. రూ.100 కోట్ల కేటాయింపు ఇటీవల 2019–20కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇందులో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పేరుతో పులివెందుల ప్రాంత అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. దీంతో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్ తరహాలోనే తనయుడు వైఎస్ జగన్ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పులి వెందుల ప్రాంత అభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక అధికారిని నియమించి అం దుకు తగిన కార్యాలయం, సిబ్బందిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రత్యేక నిధుల ఏర్పాటుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కనీస మౌలిక వసతులతోపాటు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరి నట్లు సమాచారం. పులివెందుల ప్రాం తానికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రామ్మోహన్ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం
సాక్షి, కడప : అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు పంతగాని రామ్మోహన్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు భార్య నాగరత్నమ్మకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ బుధవారం రైతు రామ్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం యావత్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందచేశారు. కాగా చిట్వేలు మండలం నాగవరం హరిజనవాడకు చెందిన రామ్మోహన్ సోమవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి మూడు ఎకరాల భూమి ఉంది. బొప్పాయి, అరటి పంటలను సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఏటా ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తినడం, గిట్టుబాటు ధరలేక నష్టపోయాడు. ఆర్థికంగా దెబ్బతినడంతో మానసికంగా దిగులుపడుతూ ఉండేవాడు. అంతేకాకుండా నీటి సౌకర్యం తక్కువగా ఉండేది. బోరులో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో చిట్వేలిలోని సహకార బ్యాకులో లక్ష రుణం, నాగవరం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయల రుణం, గ్రామంలో ఓ రైతు వద్ద మరో లక్ష తీసుకుని మూడు బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక పంట పూర్తిగా ఎండిపోవడంతో ఆవేదన చెంది మొన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్మోహన్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కలెక్టర్‌గా హరికిరణ్
సాక్షి,కడప/కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కలెక్టర్ బాబూరావునాయుడును బదిలీ చేసింది. ఆయనను గిరిజన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన స్థానంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్, తుడా వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న చేవూరి హరికిరణ్‌ను నియమించింది. 1982 ఏప్రిల్ 29నæ జన్మించిన హరికిరణ్ 2006లో ముంబయి ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2009లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించారు. 2010–11లో కృష్ణా జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత 2011–12లో భద్రాచలం, 2012–13లో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా, 2013–15 మధ్య విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా, 2015–17లో కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ 2017 మే నెలలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఆయన పదోన్నతిపై కలెక్టర్‌గా కడపకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరికిరణ్ కుటుంబం విశాఖపట్టణం గాజువాకలో స్థిరపడ్డారు. తండ్రి సి.విజయ్‌కుమార్ వైద్యుడిగా సేవలు అందించగా, తల్లి సి.పద్మజ ఎంఏ పీహెచ్డీ చేయగా, సతీమణి బి.సుగుణ కూడా సింగఫూర్లోని నేషనల్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బయాలజీలో పీహెచ్డీ చేశారు. ఏపీలో మొదటి ర్యాంకు 2009లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌లో హరికిరణ్ ఆలిండియాలో 18వ ర్యాంకు వస్తే, ఏపీకి సంబంధించి టాపర్‌గా నిలిచారు. విజయనగరంలోని కోరుకుండ సైనిక్ స్కూలులో చదువుకోగా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ) ఆంధ్ర యూనివర్శిటీలో చేశారు. ముంబయిలోని ఐఐటీలో 2006లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్ సెలెక్ట్ అయ్యారు. ప్రజల కోసం చిత్తూరుజిల్లా తిరుపతిలో మున్సిపల్ కమిషనర్గాపనిచేస్తున్న హరి కిరణ్ కడప కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ప్రజలకు మేలు చేయాలన్న తలంపు ఉ న్న అధికారి. అవినీతి రహిత సమాజం కోసం పరితపించే వ్యక్తిగా పేరు గడించారు. కిందిస్థాయి అధి కారుల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పర్యవేక్షించడంలో అందెవేసిన చేయి. ప్రజల కోసం బాగా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం హరికిరణ్ సొంతం. జాయింట్ కలెక్టర్‌గా నాగరాణి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌కు సెక్రటరీగా పనిచేస్తున్న సి.నాగరాణిని కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న శ్వేత తెవతీయ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవడంతో కొన్నాళ్లుగా జేసీ–2గా ఉన్న శివారెడ్డి ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రభుత్వం రెగ్యులర్ జేసీగా నాగరాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర సతీమణి నాగరాణి గతంలో కర్నూలు ఆర్డీఓగా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా సేవలు అందించారు. ఏది ఏమైనా రెండు నెలలుగా ఇన్‌ఛార్జి పాలన సాగుతుండగా, ప్రభుత ఎట్టకేలకు రెగ్యులర్ జేసీగా నియమించింది. బాబూరావునాయుడు బదిలీ గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బాబూరావునాయుడు సంవత్సరానికి పైగా విధులు నిర్వహించారు. తనదైన ముద్ర వేశారు. ట్రాన్స్జెండర్లను జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కృషి చేయడమే కాకుండా వారికి రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరికి పెన్షన్లు మంజూరు చేయలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. గండికోట ముంపు పరిహార సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్సెల్ నిర్వహించారు. గల్ప్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా వాసులను వారి కుటుంబాలతో కలిపేందుకోసం ‘బంధం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజంపేటలో యానాది దర్బార్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాగే జిల్లాలో పందుల పెంపకం దారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి సల్పారు. ఈ క్రమంలో అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించారు.కడప నగరంలో ఐదవ విడత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు వివాదానికి దారి తీశాయి. ఇందుకు బాధ్యులైన తహసీల్దార్ ప్రేమంత్కుమార్పై చర్యలకు ఉపక్రమించారు. అయితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తన పరపతిని ఉపయోగించడంతో తహసీల్దార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. పలు ఆరోపణలు రావడంతో ఐదుగురు తహసీల్దార్లను సస్పెండ్ చేశారు. మైలవరం డిప్యూటీ తహసీల్దార్ కె.వెంకటసాయినాథ్పై కూడా ఇవే ఆరోపణలు వచ్చినప్పటికీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఒత్తిడితో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పలు శాఖల ఉన్నతాధికారులను ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే కలెక్టర్‌గా బాబూరావునాయుడు గుర్తింపు పొందారు. -
హలో.. నేను కలెక్టర్ మాట్లాడుతున్నా
కలెక్టర్: నీ పేరు ఏమిటి? రైతు: నా పేరు నరసింహారెడ్డి. కలెక్టర్: ఎందుకు వచ్చావు. రైతు:సార్.. నాకు పంట పొలం ఆన్లైన్ ఎక్కించడంలో అధికారులు తిప్పుతున్నారు. అందుకే ఇక్కడికి వచ్చా. కలెక్టర్: అవునా ... ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు. అసలు సమస్య ఏమిటీ.. రైతు:సమస్య ఏమిటో నాకు తెలియదు సార్. నేను దాదాపు ఐదారు నెలలుగా తిరుగుతున్నా. కలెక్టర్:ఓకే.. నాకు అర్థమైంది. నేను తహసీల్దార్‌తో మాట్లాడతా ఉండు. కలెక్టర్: హలో .. తహసీల్దార్ గారూ.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. ఎందుకు నరసింహారెడ్డికి సంబంధించిన పొలం విస్తీర్ణం ఆన్లైన్లో ఎక్కించలేదు. మీకు ఉన్న ప్రాబ్లం ఏమిటి. ఇన్ని రోజులుగా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు. ఎప్పుడు పరిష్కరిస్తారు. మళ్లీ ఈ రైతు నా దగ్గరికి వస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. జాగ్రత్త. దాదాపు రైతును 5 నిమిషాల పాటు తన వద్ద ఉంచుకుని ఆ సమస్యపై కింది స్థాయి అధికారితో మాట్లాడి స్వయంగా కలెక్టరే ఇన్ని రోజుల్లో పరిష్కారమవుతుందని చెప్పడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన శైలిలో అధికారుల్లో మార్పు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న కలెక్టర్ బాబురావు నాయుడు ఏది చేపట్టినా అది సంచలనమే అవుతోంది. ప్రత్యేకంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ వచ్చిన కలెక్టర్ ఇప్పుడు ఒక నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. కడప కలెక్టరేట్లో నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కలెక్టర్ కూడా ప్రస్తుతం ల్యాప్‌ట్యాప్ ద్వారా కొత్త విధానంతో అక్కడికక్కడే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ప్రజలు అర్జీలు తీసుకుని తన వద్దకు రాగానే కలెక్టర్ అక్కడే పరిశీలించి.. అక్కడే పరిష్కారం చూపడం..మండల కేంద్రాలకు సంబంధించి సమస్య అక్కడే పరిష్కారం కావాల్సిన పరిస్థితుల్లో ల్యాప్‌ట్యాప్ ద్వారా సంబంధిత మండల కేంద్రానికి ఫోన్ చేసి కలెక్టర్ స్వయంగా మాట్లాడుతున్నారు. మొదటగా ‘హలో.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా మీ మండలంలోని ఫలానా గ్రామానికి చెందిన రైతు వచ్చాడు. ఇతనికి సంబంధించి ఫలానా సమస్య పెండింగ్‌లో ఉంది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు పరిష్కారం చేయలేదు. మీ దగ్గరికి చాలా సార్లు తిరిగినా పట్టించుకోలేదు, ఇప్పుడు నా వద్దకు వచ్చాడు. అలాంటి పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి, ఇప్పుడు ఆ రైతును మీ దగ్గరికే పంపిస్తున్నా, సమస్యను పరిష్కరించండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి. వారిని మాత్రం ఇబ్బందులకు గురిచేయొద్దని’ అక్కడికక్కడే జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ ల్యాప్‌ట్యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తరహాలో మండల అధికారితో మాట్లాడి పరిష్కారం చూపుతుండటం గమనార్హం. కలెక్టర్ ప్రారంభించిన ఈ కొత్త విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కలెక్టర్ ల్యాప్‌ట్యాప్‌లో చూస్తూ అవతలి అ«ధికారితో మాట్లాడుతుండగా హాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ మీద జిల్లా కలెక్టర్‌తోపాటు బాధిత రైతు, మండల కేంద్రంలోని అధికారులు కూడా ఇక్కడి స్కీన్ మీద కనిపిస్తుండటం కొత్త విధానం ప్రత్యేకత. -
కడప కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత