Kadubandi Srinivasa Rao YS. Jagan Mohan Reddy
-
భీమాలి గ్రామాన్ని సందర్శించిన శృంగవరపు కోట MLA
-
పుంగనూరులో పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారు
-
ఎస్.కోట ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం
సాక్షి, విజయనగం(శృంగవరపుకోట) : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా మొత్తం 11 మంది శాసనసభ్యులతో ఈ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకైక శాసనసభ సభ్యునిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కమిటీలో చోటు దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత చురుకుగా పనిచేసి ఎంపిక చేసిన పదవికి న్యాయం చేస్తానని, శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు
విజయనగరం : శృంగవరపుకోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం తనపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఇలాంటి పనులకు ఒడిగట్టడం సరికాదు. ప్రజా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని నాయకులందరి సమన్వయంతోనే పారదర్శకంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిస్తున్నాం. గ్రామసచివాలయ ఉద్యోగ నియామకాలనే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ నియామకాలలో ప్రతిపక్షపార్టీల పిల్లలకు కూడా ఉద్యోగాలొచ్చాయి. అంతేగాక ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణలో మా నుంచి ఎటువంటి ఒత్తిడిలు ఉండవు. వారి విధులు సక్రమంగా నిర్వర్తించుకొనేందుకు, గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. అన్ని వర్గాలనుంచి మంచి స్పందన వస్తోంది. టీడీపీ నాయకులు గ్రూపు రాజకీయాలంటూ చేసే ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. -
అనకాపల్లి వైఎస్సార్సీపీ పరిశీలకుడిగా కడుబండి
విశాఖపట్నం: సంస్థాగత బలోపేతం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ మరో ముందడుగు వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిశీలకుడిగా కడుబండి శ్రీనివాసరావును నియమించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు శ్రీనివాసరావును నియమించినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఆది నుంచి పార్టీలో క్రియాశీల పాత్ర అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన కడుబండి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్లో ఆది నుంచి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఆయన విజయనగరం జిల్లా గజపతినగర నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన పెదనాన్న వంగపండు నారాయణ అప్పల నాయుడు గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన చిన్నాన్న సమితి ప్రెసిడెంట్గా చేశారు. అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న కడుబండి శ్రీనివాసరావు 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిన ఆయనను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. ఆయన భార్య అమెరికాలో ప్రముఖ క్యాన్సర్ వైద్యురాలిగా గుర్తింపుపొందారు. పార్టీ బలోపేతం.. విజయమే లక్ష్యం: శ్రీనివాసరావు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే తన లక్ష్యమని కడుబండి శ్రీనివాసరావు చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పార్టీ నేతలు, కార్యకర్తలం సమష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటానన్నారు.