వైఎస్ఆర్సీపీలో 400కుటుంబాల చేరిక
అలమండ (జామి) న్యూస్‌లైన్: జామి మండలం శిరికిపాలెం, అలమండ గ్రామాల్లో కాంగ్రెస్,టీడీపీలకు చెందిన 400 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కాకర్లపూడిసూరిబాబురాజు ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. శిరికిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బోనిరామునాయుడు, అలమండ గ్రామానికి చెందిన పాత్రుడు బంగారయ్యతోపాటు పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ లో చేరినవారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషిచేస్తామన్నారు. కాకర్లపూడి సూరి బాబురాజు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు.పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే స్వర్ణయుగం వస్తుందన్నారు.
అమ్మ ఒడి, మహిళా రుణాలు మాఫీ,రైతులకు గిట్టుబాటు ధర వంటి పథకాలు అమలవుతాయన్నారు. కార్యక్రమంలో గుడివాడ రాజేశ్వరరావు,కొత్తలి కృష్ణ, శిరిపురపు అప్పారావు,గేదెల వెంకటరావు,కొల్లు సత్యం, రొంగలి సత్యం,బొబ్బిలి వెంకటరావు, శివ, గుడివాడ చిన్నంనాయుడు,గుడివాడ ప్రభాకర్,గుడివాడ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.