నిందితుల జాబితాలో తల్లిదండ్రులు!
ఎంసెట్ కుంభకోణం కేసులో చేర్చనున్న సీఐడీ
16 మందిపై కేసుల నమోదుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కుంభకోణంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులపై కేసు లు నమోదు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. వారి పిల్లల కోసం కాకుండా ఇతర విద్యార్థులకు పేపర్ లీక్ చేసి, డబ్బులు దండుకున్న వారిని నిందితులుగా చేర్చేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 16 మంది తల్లిదండ్రులు బ్రోకర్లుగా వ్యవహరిం చి ప్రశ్నపత్రం లీకేజీలో పాలుపంచుకున్నారని వెల్లడించాయి. ఈ కేసులో ఇప్పటివరకు 80 మందిని అరెస్టు చేసినట్లు తెలిపాయి.
నిందితుడిగా ప్రింటింగ్ ప్రెస్ యజమాని
ఈ కేసులో ప్రధాన నిందితుడు కమిలేశ్ కుమార్ సింగ్ ప్రింటింగ్‌ప్రెస్ నుంచే ప్రశ్నప త్రాన్ని లీక్ చేసినట్టు ఆధారాలున్నాయని సీఐడీ అధికారులు తెలిపారు. కమిలేశ్ ఢిల్లీ శివార్లలోని ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నప త్రాన్ని తెచ్చి.. తన నెట్వర్క్ ద్వారా తెలం గాణ, ఏపీల్లో భారీ మొత్తానికి అమ్ముకున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ సంస్థను, దాని యజమానిని నిందితుల జాబి తాలో చేర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రెస్ యజమానికి, కమిలేశ్కుమార్కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తామన్నారు.
లింక్ తెగినట్టేనా..?
ప్రింటింగ్ ప్రెస్ నుంచి కమిలేశ్‌కుమార్ ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు ఆధారాలు సేకరిం చిన సీఐడీకి ఆయన మృతితో కొత్త సమస్య వచ్చింది. ఢిల్లీలోని ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రశ్నపత్రం ముద్రిస్తున్న సంగతి కమిలేశ్‌కు ఎలా తెలిసింది? జేఎన్టీయూలో ఎవరితో సంబంధముందన్న కోణంలో విచారించాలని సీఐడీ భావించింది. కానీ కమిలేశ్ మృతితో ఈ కేసులో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిం దని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.
కమిలేశ్ మృతిపై హెచ్చార్సీ ఆరా..
ఎంసెట్ కుంభకోణంలో కీలకపాత్ర పోషిం చిన కమిలేశ్ అనుమానాస్పద మృతిపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆరా తీసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. పోలీసు కస్టడీలో మృతి చెందితే ఎన్‌హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేయాలనే ఆదేశాలు న్నాయి. ఈ మేరకు తాము అన్ని కార్య క్రమాలు పూర్తి చేశామని సీఐడీ తెలిపింది. కమిలేశ్ మృతిపై ఎన్‌హెచ్చార్సీకి ఓ నివేదిక కూడా పంపిస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
గుండెపోటుతోనే కమిలేశ్ మృతి: సీఐడీ ఐజీ
ఎంసెట్ కుంభకోణంలో కీలక నిందితుడైన బీహార్‌లోని పాట్నాకు చెందిన కమిలేశ్ గుండె పోటుతో చనిపోయారని సీఐడీ ఐజీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత డిసెంబర్ 20న అధికారులు కమిలేశ్‌ను పాట్నాలో అరెస్టు చేసి, అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారని... ట్రాన్సిట్ వారెంట్‌పై అదే రోజు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని తెలిపారు. సీఐడీ కోర్టు అనుమతి మేరకు డిసెంబర్ 31న తమ కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ నెల 1న ఉదయం 11.45 సమయంలో ఛాతీలో నొప్పి వస్తోందని కమిలేశ్ చెప్పాడన్నారు. అధికారులు మాసబ్‌ట్యాంక్‌లోని మహవీర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు మృతి చెందాడని వెల్లడించారు.