kanakadurga flyover
-
దుర్గగుడి పాలకమండలి సమావేశం.. భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు(సోమవారం) జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఇక, పాలక మండలి సమావేశం అనంతరం దుర్గగుడి ఛైర్మన్ రాంబాబు మాట్లాడుతూ.. ‘త్వరలో శివాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. శివాలయంలో రూ.40లక్షల అంచనాలతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తాం. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. దూరప్రాంత భక్తులకు మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం.. దుర్గగుడి ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. అలాగే, దుర్గాఘాట్‌ను త్వరలోనే అందుబాటుకి తీసుకువస్తామన్నారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా యూట్యాబ్‌లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. పౌర్ణమి నుంచి ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించనున్నట్టు తెలిపారు. 2వేల మంది అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ విస్తరిస్తున్నామన్నారు. అన్నదాన భవన్‌కు రాబోయే నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వినాయక చవతిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
కనకదుర్గ ఫ్లైవోవర్‌పై భారీ వాహనాల నిషేధం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైవోవర్‌పై పగటి వేళల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే.. చిన్నకార్లు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సిలెండర్ల వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 16న కనకదుర్గ ఫ్లైవోవర్ ప్రారంభమైన విషయం విదితమే. ప్రైవేటు బస్సులు స్వాతి సెంటర్ మీదుగా కొండ తిరిగి రావాల్సిందేనని, రాత్రి 11 గంటల తరువాత లారీలు భారీ వాహనాలను అనుమతిస్తామని అధికారులు వివరించారు. -
కనకదుర్గ ఫ్లైఓవర్‌పై జర్నీ అద్భుతం..
-
కనకదుర్గ ఫ్లైఓవర్‌పై జర్నీ అద్భుతం..
సాక్షి, విజయవాడ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం... ఆరు వరుసలతో విశాలంగా రోడ్ నిర్మాణం. కృష్ణా నదిపై 46 పిల్లర్లపై వారధి.. విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలకి చెక్ పెడుతూ కనకదుర్గ వారధి అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ వారధిపై ప్రయాణమంటే ఇక చెప్పేదేముంది. 500 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన కనకదుర్గ వారధితో విజయవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఇప్పటి వరకు ట్రాఫిక్‌తో అష్టకష్టాలు పడిన నగరవాసులకి ఈ వారధి నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా వర్చువల్ పద్దతిలో ప్రారంభమైన ఈ వారధిని చూసేందుకు నగర వాసులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌కి వెళ్లే మార్గం కావడంతో వాహనాలు ఆపి మరీ వారధి అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు దసరా ఉత్సవాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. కనకదుర్గ వారధి విజయవాడకు మణిహారంగా ప్రజలు, పర్యాటకులతో కళకళలాడుతోంది. (బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం) సాయం సంధ్యవేళ కనకదుర్గమ్మ వారధిపై వాహనాలు రయ్ రయ్ మని దూసుకుపోతుంటే చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. విజయవాడ నుంచి హైదరబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి రాజీవ్ గాంధి పార్క్ వద్ద ప్రారంభమయ్యే ఫ్లై ఓవర్ భవానీపురం వరకు 2.6 కిలోమీటర్ల వరకు సాగుతుంది. ఇంతటి అందమైన ఫ్లై ఓవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు స్ధానికులు కుటుంబాలతో సహా తరలి వస్తున్నారు. కృష్ణమ్మ అందాలని సెల్పీలలో బందిస్తూ ఆనందపరవశులు అవుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే నదిపై నిర్మించిన అతి పెద్ద ఫ్లై ఓవర్ ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ.. కృష్ణా తీరం అందాలను ఆస్వాదించే విధంగా రూపుదిద్దుకుంది. ఈ వారధిపై ప్రయాణమంటే ఓ ప్రత్యేక అనుభూతే అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఏమండోయ్ నాని గారు.. క్షమాపణలు చెప్పించండి
సాక్షి, అమరావతి : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించగా.. తాజాగా కేశినేని గత ఐదేళ్ల కాలాన్ని స్వర్ణయుగమంటూ వ్యాఖ్యానించడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తుచేసి.. చంద్రబాబు చేత క్షమాపణలు చెప్పించండని అన్నారు. (ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం) ‘ఏమండోయ్ నాని గారు (కేశినేని నాని).. చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగి పోయి, నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు. రోజుకు పదికోట్ల ప్రజల సోమ్ముతో ధర్మపోరాటం, ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశారు. నేడు మీరేమేూ గత ఐదేళ్లు స్వర్ణ యుగం, కేంద్ర మంత్రులందరు ఏపీకి అండగా నిలిచారని చెప్పారు (కేంద్రం ఇచ్చింది నిజమేలే). తన స్వార్థ రాజకీయూల కోసమే బీజేపీపై తప్పుడు ప్రచారం చేశానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినాగాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ ఫ్లె ఓవర్ ప్రారంభం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై కేశినేని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అండతోనే వంతెన నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణానికి గానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దికిగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కపార్టీలోనే ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కార్యకర్తలు సైతం విస్మయానికి గురవుతున్నారు. -
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్లను జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట్రంలో రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు భూమి పూజ, శిలాఫలకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారం నాగపూర్ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన పలు ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గడ్కరీ ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.8,869 కోట్లతో 28 ప్రాజెక్టులు ► ఏపీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 2014లో మేము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఈ అయిదేళ్లలో కొత్తగా 2,667 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ► రాష్ట్రంలో రూ.8,869 కోట్లతో మొత్తం 28 ప్రాజెక్టులు చేపడుతున్నాం. 2,209 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.32,175 కోట్లు వ్యయం కానుంది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తుది దశలో ఉంది. వచ్చే ఏడాదిలో పనులు మొదలవుతాయి. ► రూ.5 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యే బెంగళూరు–చెన్నై హైవే ఏపీకి ఎంతో కీలకం. పోర్టు కనెక్టివిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తాం. ఆ జాబితా ఇప్పటికే మా దగ్గర ఉంది. ఆ మేరకు పనులు చేపడతాము. ► అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే పనులు నాలుగు జిల్లాలలో కొనసాగుతాయి. అదే విధంగా విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కూడా చేపడదాం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మీరు (సీఎం జగన్) ఢిల్లీకి రండి. అక్కడ అన్నీ చర్చిద్దాం. ► భూసేకరణలో మీ వాటా 50 శాతం కొంత భారం అంటున్నారు కాబట్టి, రోడ్డు నిర్మాణంలో వాడే వాటి మీద మైనింగ్ సెస్ లేక రాయల్టీ, స్టీల్, సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీలో మినహాయింపు ఇవ్వండి. తద్వారా కేంద్రంపై ప్రాజెక్టు భారం కాస్త తగ్గుతుంది. ► విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఇవాళ దేశానికే గర్వకారణం. నేను కూడా చూశాను. అమ్మవారిని దర్శించుకున్నాను. ► దేశంలో ఏటా 5 లక్షల ప్రమాదాల్లో లక్ష మంది చనిపోతున్నారు. ఏపీలో కూడా బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇప్పటికే మార్చాం. అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ► ఏపీలో మరింత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎంఎస్ఎంఈ, ఖాదీ పరిశ్రమలకు మేము పూర్తి అండగా నిలుస్తాం. ఎంఎస్ఎంఈ మంత్రిగా చెబుతున్నాను. చేనేత, హస్తకళల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇక్కడ వాటికి కొదవ లేదు. ► రాష్ట్రంలో ఉన్న పోర్టులు కూడా అభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తున్నాయి. మీ (సీఎం) విజ్ఞప్తులకు పూర్తి అండగా నిలుస్తాం. వచ్చే నెలలో నేను ఢిల్లీకి వస్తాను. మీరూ, అధికారులు రండి. మీ ఎంపీలు కూడా నన్ను కలుస్తున్నారు. మీరు ఢిల్లీకి వస్తే, అన్నీ మాట్లాడుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ► ఈ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి రాష్ట్ర మంత్రులు ఎం.శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు. రహదారుల నెట్‌వర్క్‌కు ఏపీ హబ్ దేశంలో అనేక రహదారుల నెట్‌వర్క్‌కు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా ఉంది. దీని వల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. – వీకే సింగ్, కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్ వల్ల విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తొలగిపోతుంది. రాష్ట్రంలో ఇంకా చాలా కేంద్ర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకు మంత్రి గడ్కరీ ఎంతో సహకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి -
బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, విజయవాడ : నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్ పూర్తయింది. ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులున్నాయి. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతాం. రాయలసీమలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల’’ని అన్నారు. -
రేపు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, విజయవాడ : బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. కనదుర్గ ఫ్లై ఓవర్ రేపు (శుక్రవారం) ప్రారంభం కానుంది. వర్చ్యువల్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు రూ.7584 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే 8007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 15 వేల కోట్ల పనులకు రేపు భూమిపూజ, ప్రారంభోత్సవా కార్యక్రమాలు జరుపనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు. కొత్త సర్కారుతో ఊపందుకున్న పనులు 2.6 కిలోమీటర్ల మేర దాదాపు రూ.325 కోట్ల వ్యయంతో సోమా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2015 డిసెంబర్ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. -
బెజవాడ ప్లైఓవర్: 16న ముహూర్తం!
సాక్షి, అమరావతి : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రూ.15,622 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, చేపట్టబోయే వాటికి శంకుస్థాపనలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలు వర్చువల్ విధానంలో రూ.7,584 కోట్లతో చేపట్టే 16 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, రూ.8,038 కోట్లతో పూర్తి చేసిన 10 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. (6న ప్రధానితో సీఎం జగన్ భేటీ!) వీటిలో బెంజిసర్కిల్‌పై ఫిబ్రవరి నుంచే ఒకవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు దానిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. తొలుత ఈ కార్యక్రమాలను సెపె్టంబర్ నాలుగున చేపట్టడానికి ముహూర్తం నిర్ణయించారు. కానీ అప్పట్లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో ఆ ముహూర్తాన్ని 8కి మార్చారు. అన్నీ సన్నద్ధమవుతున్న తరుణంలో సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు. ఇంతలో కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈనెల 16న వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. -
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా
సాక్షి, అమరావతి బ్యూరో: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరో మారు వాయిదా పడింది. తొలుత దీనిని ఈ నెల 4న ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం వైఎస్ జగన్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో ప్రారంభోత్సవం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో సంతాప దినాలు కొనసాగాయి. అందువల్ల ఈ నెల 8కి మార్పు చేశారు. కానీ వివిధ కారణాలతో 18వ తేదీకి మళ్లీ వాయిదా వేశారు. (కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు చివరి సామర్థ్య పరీక్షలు ) అయితే తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో మరోసారి వాయిదా పడింది. అయితే తదుపరి ప్రారంభోత్సవ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఎనిమిది నెలల కిందట పూర్తయిన బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ కూడా శుక్రవారమే జాతికి అంకితం చేయాల్సి ఉంది. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ తరహాలోనే కనకదుర్గ ఫ్లైఓవర్‌పై నుంచి కూడా వాహనాలను అనుమతిస్తారని భావించారు. కానీ ఇప్పటికిప్పుడు అలా అనుమతించడం లేదని ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ అనుమతించం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ నగరంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ రాకపోకలను అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆర్అండ్బీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ అనుమతించే తేదీ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరికొంత సమయం వేచి ఉండాలని ఆయన కోరారు. -
కనక దుర్గ గుడి ఫ్లైఓవర్ లైటింగ్ ఫొటోస్..
-
ముస్తాబైన దుర్గ గుడి ఫ్లైఓవర్ ఫోటోలు
-
మార్చిలో దుర్గగుడి ఫ్లైఓవర్ రెడీ!
సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నగరవాసుల ఆశలు తీర్చేలా ఫ్లైఓవర్ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరుకల్లా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ఈ వంతెనపై అనధికారికంగా వాహనాల రాకపోకలకు వీలు కల్పిస్తారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు. కొత్త సర్కారుతో ఊపందుకున్న పనులు 2.6 కిలోమీటర్ల మేర దాదాపు రూ.325 కోట్ల వ్యయంతో సోమా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2015 డిసెంబర్ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే స్పాన్లు, వింగ్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కనకదుర్గ అమ్మవారి గుడి కొండపైకి వెళ్లే ప్రవేశ ద్వారానికి ఎదురుగా జరుగుతున్న రెండు స్పాన్ల పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వై డక్ట్, రాజీవ్‌గాంధీ పార్క్ వైపు అప్రోచ్ రోడ్ల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ పనులు కూడా నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు.. ఫ్లైఓవర్‌కు ఇప్పటికే అందమైన రంగులు అద్దారు. వంతెనపై విద్యుద్దీపాల ఏర్పాటు 75 శాతం పూర్తయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ రెండ్రోజుల క్రితం కాంట్రాక్టరు ప్రతినిధులు, సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్‌పై ట్రయల్ రన్ నిర్వహించాలని యోచిస్తున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. రాజీవ్‌గాంధీ పార్క్ నుంచి సగం వరకు ఫినిషింగ్ వర్క్ పూర్తయిందని, భవానీపురం వైపు పనులు సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ వంతెన పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ సూపరింటెండింగ్ ఇంజినీర్ (క్వాలిటీ కంట్రోల్) జాన్‌మోషే ‘సాక్షి’కి చెప్పారు. చివరి దశలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులో పూర్తవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి మరో నెల గడువివ్వండి
సాక్షి, అమరావతి: విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి మరో నెల గడువు కావాలని కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ కేంద్రాన్ని కోరింది. నగరంలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి గడువును ఇప్పటికే కేంద్రం రెండు సార్లు పొడిగించింది. గతేడాది డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు నోటీసులిచ్చినా జాప్యం చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంత సమయం పడుతుందో నివేదిక పంపాలని ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆదేశించింది. భవానీ దీక్షల విరమణ, దసరా పండగ సీజన్లో పనులు ముందుకు సాగలేదని, అందువల్లే జాప్యం జరిగిందని కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, మరో నెలలో ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ చెబుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు కేంద్రానికి నివేదిక పంపించారు. కాగా, కృష్ణలంక నుంచి భవానీపురం వరకు 5.290 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు 2015లో టెండర్లు పిలవగా.. రూ. 307.58 కోట్లతో సోమా కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. 2016 డిసెంబర్‌లోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకుని ఆర్థిక ఇబ్బందులు పేరుతో మూడేళ్లకు పైగా పనుల్ని సాగదీస్తూ వచ్చింది. గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. రహదారులు, భవనాల సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులపై ఆరా తీశారు. త్వరిగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. -
కనకదుర్గ ఫ్లైఓవర్: నిధులకు గ్రహణం!
-
కనకదుర్గ ఫ్లైఓవర్: నిధులకు గ్రహణం!
సాక్షి, విజయవాడ: బెజవాడ ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు చేపట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టింది. ఫ్లైఓవర్ నిర్మాణానికి తగినంతగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో ఏడాదిన్నరగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సత్వరమే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి.. ట్రాఫిక్ కష్టాలు దూరం చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీలు ఇచ్చినప్పటికీ.. అవి ఆచరణకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టు కనిపిస్తోంది. ఫ్లైఓవర్ నిర్మాణంలో డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. దీంతో మార్పులకు అదనంగా అయ్యే వ్యయాన్ని ఇచ్చేదిలేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంతలేదన్న మరో ఏడాది సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.