kancha ialiah
-
ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న జనవరి 30న ఒకటవ తరగతి నుంచే ఐబీ సిలబస్‌తో పాఠశాల విద్యను ప్రారంభించడానికి ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లిష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుసంధానం చేయడంలో ఇది మరో ప్రధాన అడుగు. విద్యార్థులు దీంతో ఉమ్మడి సర్టిఫికెట్ పొందుతారు. విజ్ఞాన భారత్‌ను నిర్మించడంలో భాగంగా, ఏపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పాఠశాల విద్యపై దృష్టి సారించిందన్న విషయం, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించిన రాష్ట్ర శకటంలో ప్రతిఫలించింది. గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో, ‘పాఠశాల విద్య పరివర్తన’ థీమ్‌తో ఒక శకటాన్ని ప్రపంచ, జాతీయ నాయకత్వం ముందు ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త దృక్పథాన్ని చూపించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాడుతూ, నృత్యాలు చేస్తూ శకటం వెంట కదిలారు. అధికారులు సృజనాత్మకంగా నిర్మించిన ఆ శకటాన్ని పరేడ్‌లో ఉంచడానికి ఏపీ ముఖ్యమంత్రికి ధైర్యం, విశ్వాసం అవసరం. దాన్ని వీక్షించిన అంతర్జాతీయ, జాతీయ వీక్షకులు చాలా ఉత్సా హంగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇది ఇతర రాష్ట్ర శకటాల కంటే ఒక ప్రధాన వ్యత్యాసాన్ని కనబర్చింది. ‘సకల విద్యలకు మేమే సాటి / విశ్వ విద్యకు మేమే పోటీ’ అంటూ పిల్లలు పాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యా నాణ్యత గురించి ఈ పాట చెబుతుంది. తమ పాఠశాల యూనిఫారంలో నిల బడి ఉన్న విద్యార్థులు వారి టాబ్లెట్లు, ద్విభాషా పుస్తకాలను చూపు తున్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యాలను, జ్ఞానాన్ని నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తున్నారు. భారతదేశం తన గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. గణతంత్ర దినోత్సవ అతిథిగా వచ్చిన ఫ్రా¯Œ ్స అధ్యక్షుడు మెక్రాన్ దానిని ఆసక్తితో చూశారు. పాఠశాల విద్యకు సంబంధించిన పరివర్తన సందేశం గురించి ఒక అనువాద కుడు ఆయనకు వివరించడం కనిపించింది. గత 74 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపబ్లిక్ డే పరేడ్లలో ఇలాంటి వినూత్న పాఠశాల విద్యా నమూనాను ప్రదర్శించలేదు. నాణ్యమైన విద్య కాకపోయినా, అక్షరాస్యత రేటును చూపించడానికి ధైర్యం చేయగల ఏకైక రాష్ట్రం కేరళ కూడా ఇన్నేళ్లుగా తమ పాఠశాల విద్యా విజయాన్ని ఏపీ ప్రభుత్వం రీతిలో జరుపుకోవాలని అనుకోలేదు. వాస్తవానికి, ప్రతి అధికార రాజకీయ పార్టీ తన పనితీరు, విధాన కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది. కానీ పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన కొత్త ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య, గ్లోబల్ పవర్ హౌజ్‌గా మారాలని భావిస్తున్న ప్రజాస్వామ్యంలో హృదయాన్ని కదిలించే విషయం. నాణ్యమైన పాఠశాల విద్య అనే ఆలోచనను జగన్ ప్రైవేట్ నుంచి పబ్లిక్‌గా మార్చారు. మారుమూల గ్రామాల్లోని పేద పిల్లలు తమ సొంత గ్రామంలోని పాఠశాలల్లో ఆధునిక ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జాతీయ, ప్రపంచ మార్కెట్లలోకి రావాలని ఆశపడుతున్నారు. జగన్ తన ముందున్న అభివృద్ధి నమూనాకు విరుద్ధంగా ఈ అభివృద్ధి నమూనాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు సింగపూర్ వంటి రాజధాని నగరం నిర్మించడానికి 30,000 ఎకరాల భూమిని సమీకరించడంలో రాష్ట్ర వనరులను పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రైవేట్ రంగ పెట్టుబడి నమూనాయే ఆయన నమూనా. విద్యా రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆయన ప్రోత్సహించారు. ఏపీ శకటం ఇతర రాష్ట్ర శకటాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. గత వైభవం, స్వాతంత్య్ర పోరాట చిహ్నాలు, మతపరమైన చిహ్నాలు లేదా వారి గిరిజన, సాదాసీదా జీవన స్త్రీలను మిగతా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్ కవాతును దేశంలో మహిళా సాధి కారతను ప్రత్యేకంగా ప్రదర్శించడానికి ఉద్దేశించారు. సైన్యంలోని అన్ని విభాగాల్లో, ఇస్రో వంటి వైజ్ఞానిక కార్యకలాపాలలో, ప్రతి రంగంలో దేశం మహిళలను ఎలా ప్రోత్సహిస్తోందో ప్రపంచానికి చూపించడానికి దీన్ని రూపొందించారు. అంతరిక్ష శాస్త్రంలో తన సొంత మహిళా శక్తిని ‘ఇస్రో’ తన శకటంలో ఉంచింది. ఆ రకంగా అది దాని సొంత భవిష్యత్తు యోగ్యతను కలిగి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (రామ్ లల్లాపై తన శకటాన్ని రూపొందించింది) వంటివి తమ సాంప్రదాయ నృత్యం చేసే మహిళలతో తమ శకటాలను రూపొందించాయి. కానీ ప్రపంచీకరణ యుగంలో ఆధునికమైన, చక్కగా అమర్చిన ఇంగ్లిష్ మీడియం విద్యతో, పాఠశాల విద్యను ఈ దేశ భవిష్యత్తుగా చూపిన ఏకైక రాష్ట్రం ఏపీయే. ఇప్పటికీ అర్ధ–మధ్యయుగ జీవన వ్యవస్థలతో వేలాడుతున్న గిరిజన (ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ మొదలైనవి) లేదా గిరిజనేతర మహి ళల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో ఆ యా రాష్ట్రాలు చూపలేదు. ముస్లిం మహిళల స్థితిగతులు ఏమిటో ఏ శకటమూ చెప్పలేదు. కశ్మీర్ నుంచి కనీసం అలాంటి ఒక్క శకటాన్నయినా తేవాల్సింది.రాష్ట్ర చరిత్రను చూపించడం ఒక విషయం; పిల్లలకు చక్కగా, ప్రణాళికాబద్ధమైన విద్యనుఅందించడం ద్వారా దేశ భవిష్యత్తును చూపించడం మరొక విషయం. ఆంధ్రప్రదేశ్ దీనిని స్పష్టమైన విజన్ తో చేసింది. ఏపీ శకటం కదులుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని జాగ్రత్తగా గమనించారు. ఆయన సొంత గుజరాత్ మోడల్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అంత బాగా అందించలేకపోయింది. గుజరాత్ కూడా ఇప్పుడు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రైవేట్ పాఠ శాలలపై ఆధారపడుతోంది. అది కూడా ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశం పాశ్చాత్య దేశాలతో, చైనాతో పోటీ పడాలని ఆకాంక్షిస్తున్నప్పుడు, తమ సొంత ప్రాంతీయ భాషలో చక్కటి పునాది కలిగివుండి, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక మార్గం. జగన్ మోహన్ రెడ్డి చైతన్యపూర్వకమైన ప్రయత్నంతో నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యపై ఆంధ్రా విద్యార్థులకు విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు దాన్నే వైఎస్ జగన్ తన ఎన్నికల ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ఆలోచనతోనే ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాఠ శాల విద్యా శకటాన్ని ప్రదర్శింపజేశారు. పాఠశాల విద్యలో కేంద్రం లేదా రాష్ట్రం ఏదైనా పెద్ద సానుకూల అడుగు వేసిందంటే తప్పనిసరిగా అభినందించాలి. దేశ భవిష్యత్తు అక్కడే ఉంది. సైద్ధాంతిక విభేదాలు ఏ విషయంలోనైనా ఉండవచ్చు, కానీ ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా నాణ్యమైన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడంలో కచ్చితంగా విభేదాలు ఉండ కూడదు. అప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తుకు ఎదురుదెబ్బ తగ లదు. ఏ పిల్లవాడు అయినా రెండు భాషలను చాలా సులభంగా నేర్చు కోగలడు. మన విషయంలో అది ఇంగ్లిష్, పిల్లల ప్రాంతీయ భాష అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రా విద్యా నమూనాను అర్థం చేసుకుంటుందని, అభినందిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. - వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ఇంటర్ రద్దే ‘కార్పొరేట్’ జబ్బుకు మందు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల చీడను మూలం వరకు పెకిలించాలంటే ప్రభుత్వాలు తక్షణం ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను రద్దు చేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. రాజకీయ పార్టీలన్నింటిపై ప్రభావం చూపగల బలమైన వ్యవస్థను ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల లాబీలు నెలకొల్పుకున్నాయి. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్నీ, ఇంటర్ విద్యను రద్దు చేయడాన్నీ సుతరామూ అనుమతించవు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కఠిన వైఖరి అవలంబించి హైస్కూల్స్‌లోనే విద్యార్థులు 12వ తరగతిని పూర్తిచేసుకునేలా చేయగలిగితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు్డ భారీ సంక్షోభాన్ని సృష్టించింది. దీని బారినపడి ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పలువురు విద్యార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. ఈ పెనుసమస్యకు పరిష్కారం.. పరీక్షాపత్రాల్లోని మార్కులను తిరిగి లెక్కించడంతో కానీ, పరీక్షా పత్రాల పునర్మూల్యాంకనం చేయడంతో కానీ లభించదు. ప్రస్తుత సమస్య మరింత విస్తృతస్థాయిలో ఉంది. విద్యాపాలనా వ్యవస్థలపై అజమాయిషీ చేస్తున్న ప్రైవేట్ కాలేజీ నెట్‌వర్క్‌లో ఈ సమస్యకు మూలం దాగి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన గుత్తాధికార స్వభావం కలిగిన రెండు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అత్యంత కీలకమైన మన విద్యావ్యవస్థను ధ్వంసం చేసిపడేశాయి. పైగా అవి ఇప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ పేరిట పాఠశాల విద్యా వ్యవస్థలోకి జొరబడ్డాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రధానంగా నాలుగు అంశాలను చేపట్టాయి. 1) ఇవి రెండు రాష్ట్రాల్లో జూనియర్ కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లను నెలకొల్పాయి. 2) భారీ పెట్టుబడులతో ప్రకటనలు గుప్పించడం ద్వారా ఇవి రెండు రాష్ట్రాల కుటుంబ వ్యవస్థను (గిరిజన ప్రాంతాల వరకు కూడా) ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చక్కటి విద్య లభ్యమవుతుందని నమ్మేలా చేశాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి లక్షలాదిమంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. కొన్ని డజన్లమంది విద్యార్థులకు పెయిడ్ ర్యాంకులను ప్రకటించడమే కాకుండా పరీక్షా ఫలితాలు ప్రకటించిన వెంటనే మీడియా నెట్‌వర్క్‌లలో భారీ స్థాయి ప్రకటనలు గుప్పిస్తూ తల్లిదండ్రులు, పిల్లల మనస్సులపై భారీ యుద్ధానికి తలపెడుతున్నాయి. 3) దీనివల్ల రెసిడెన్షియల్, డే స్కాలర్ ప్రైవేట్ ఇంటర్మీడియట్, కోచింగ్ సెంటర్లలో భారీ ఎత్తున విద్యార్థులు చేరిపోతున్నారు. పైగా కార్పొరేట్ విద్యాసంస్థలు విస్తృత స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. అధ్యయనానికి బదులుగా నిద్రపోనీయకుండా వల్లెవేయించడం, తరుణ వయస్సులో ఎలాంటి వినోదాల్లో పాలుపంచుకోనీయకుండా చేస్తూ ఈ విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక స్థితిని ధ్వంసం చేస్తున్నాయి. సృజనాత్మకతలేని ఈ హింసాత్మక విద్యావంచన కోసం ఇవి కుటుంబాల ఆర్థిక వ్యవస్థనే కూల్చివేస్తున్నాయి. 4) ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు భారీస్థాయిలో రాష్ట్రాల ప్రభుత్వాలపై అజమాయిషీ చలాయించడానికి వచ్చాయి. నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ట సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పుడీయన రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతి పెద్ద ఇంటర్మీడియట్ విద్యా కుంభకోణాల కర్తల్లో అగ్రగణ్యుడిగా ఉంటున్నారు. నారాయణ కొల్లగొట్టిన ధనసంపదను చూసి చంద్రబాబు ఆయనకు మంత్రిపదవినిచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ఉండే ప్రముఖ విద్యాసంస్థల అధిపతిని కూడా చంద్రబాబు పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీని చేశారు. ఇప్పుడీయన కేసీఆర్ పార్టీలో చేరిపోవడమే కాకుండా మంత్రిపదవి కూడా కొట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీకాలేజీ యాజమాన్యాలు వాస్తవానికి అక్రమంగా ఆర్జించిన సంపదతో రాష్ట్రాలను నడుపుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం, ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ ఎడ్యుకేషన్ నుంచి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల వరకు అన్నీ అనైతికమైన, అవినీతికరమైన, నాసిరకం విద్యా కుంభకోణాలకు పాల్పడుతున్నాయి. అయితే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ద్వారానే అతిపెద్ద నష్టం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ చీడ మూలాన్ని పెకిలించాలంటే తక్షణం ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను రద్దు చేసి పడేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. పదవ తరగతిలో కఠినమైన ఇంటర్నల్ పరీక్షను నిర్వహిస్తూ 12వ తరగతిలో మాత్రమే టెర్మినల్ బోర్డు పరీక్షను నిర్వహించాలి. ఈ నూతన వ్యవస్థలో 12వ తరగతి వరకు తెలుగు భాషా సబ్జెక్టును కలిగి ఉంటూనే చక్కటి ఇంగ్లిష్ మీడియంని బలోపేతం చేసినట్లయితే గ్రామీణ స్థాయి పాఠశాలల ప్రమాణాలు మెరుగుపడతాయి. దీనివల్ల ప్లస్ 2 లెవల్ విద్యపై తల్లితండ్రులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో అంశం ఏదంటే, తమ పిల్లలను గ్రామాల నుంచి సుదూరంలో ఉండే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలకు పంపించడాన్ని పరిత్యజించాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని రెండో సబ్జెక్టుగా అనుమతించడం అనేది మార్కుల నిర్వహణా యంత్రాంగంగా మారిపోయింది. ఈ విధానంలో ఏ విద్యార్థి కూడా నిజమైన సంస్కృతాన్ని నేర్చుకోవడం లేదు. అందుకే సంస్కృతాన్ని తొలగించి తెలుగును తప్పనిసరి సబ్జెక్టును చేయాలి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల సంక్షోభం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న 10+2 విద్యా విధానాన్ని ఎస్బీఎస్ఈ నమూనాలో ఉండే 1 నుంచి 12వ స్కూల్ లెవల్ లోకి మార్చాలని తలుస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా అందరూ ఆహ్వానించదగిన అంశం. కానీ ఈ మార్పును కూడా ఇంటర్మీడియట్, ప్రైవేట్ స్కూల్ లాబీలు ప్రతిఘటించే ప్రమాదం ఉంది. అందుకే ప్రైవేట్ విద్యా లాబీల ఒత్తిడికి తలొగ్గకుండా దీనిని చేపట్టాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను తక్షణం రద్దు చేయాలి. అయితే రాజకీయ పార్టీలన్నింటిపైనా అజమాయిషీ చేయగల బలమైన వ్యవస్థను ప్రైవేట్ ఇంటర్మీడియట్, కోచింగ్ సంస్థల లాబీలు నెలకొల్పుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ఆశ లేశమాత్రంగా లేని కమ్యూనిస్టుపార్టీలతో సహా ఏ రాజకీయపార్టీనీ ప్రైవేట్ విద్యా సంస్థల లాబీలు వదిలిపెట్టడం లేదు. అన్నిరకాల రాజకీయ భావజాలాలకు చెందిన జూనియర్, స్కూల్ టీచర్ నాయకులు సైతం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, భారీస్థాయిలో డబ్బు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లను నెలకొల్పడంలో మునిగి తేలుతున్నారు. ఇక నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో, కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెబుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ టీచర్లు, ఇతర టీచర్లు కూడా తమ డబ్బును, తమ ఆర్థిక, సంస్థాగత శక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేవారు కూడా తప్పకుండా జరగాల్సిన ఈ మార్పునుంచి తప్పించుకోలేరని వీరికి తెలుసు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తే ఎన్నికల వ్యవస్థలోకి చొప్పిస్తున్న భారీ మొత్తంలోని డబ్బును అది తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తున్నాయి. ఇదంతా అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రులనుంచి లూటీ చేసిన డబ్బే. అందుకే రాజకీయ పార్టీలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్య ఉన్న అపవిత్ర సంబంధాన్ని బద్దలు చేయాల్సి ఉంది. అయితే విద్యా విధానంలో మార్పును ఇవి అంత సులభంగా అనుమతించవు. విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలు తప్ప కుండా వీరిపై ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణలో దీనికి సంబంధించిన ఉద్యమం ప్రారంభమైతే అది ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేగం పుంజు కుంటుంది. అధికారంతో ముడిపడి ఉన్న ఈ పవర్ బ్రోకర్లు ఇంతకుముందు కేసీఆర్‌నే లొంగదీసుకున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థలో కేజీ టు పీజీ ప్రవేశపెడతామని కేసీఆర్ గతంలో పదే పదే మాట్లాడారు. ఆ తర్వాత అందరికీ ఉచిత విద్యను అందించే ఈ కేజీ టు పీజీ గురించి మాట్లాడటమే ఆయన మానేశారు. ఈ ప్రైవేట్ శక్తులే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. పాఠశాల, జూని యర్ కళాశాల టీచర్ల నాయకులు పలువురు ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయడాన్ని, దాన్ని ప్రభుత్వ స్కూల్ వ్యవస్థలో విలీనం చేయడాన్ని జూనియర్ లెక్చరర్ సంఘాలు వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే హైస్కూల్లో పాఠాలు చెప్పడం తమ పని కాదని ఇవి వాదించవచ్చు. జూనియర్ కాలేజీల్లాగా కాకుండా పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా వ్యాపించాయి. లోతట్టు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాఠాలు బోధించకపోవచ్చని ఈ సంఘాలు వాదించవచ్చు. ఇలాంటి వాదనలు చేసేవారితో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. జూనియర్ కాలేజీ గ్రేడ్ టీచర్లు ఆన్ రోల్స్‌లో ఉన్నంతవరకు పాఠశాలల్లోని 11, 12 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. కానీ వీరిని ఎక్కడైనా నియమించవచ్చు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తాము తెలుగు మీడియంలో బోధించడానికే నియమితులమయ్యామని పాఠశాల ఉపాధ్యాయులు వాదించారు. కానీ ఇలాంటి బోధనా వ్యతిరేక శక్తులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరగా... ఇంటర్మీడియట్ రద్దు అనేది మన విద్యావ్యవస్థలో కొత్త మలుపును తీసుకొస్తుంది. భారతదేశంలోని పాఠశాల విద్యావ్యవస్థ మొత్తాన్ని ఈ చట్రం కిందికి తీసుకురావాలి. ఇంతవరకు సీబీఎస్ఈ మోడల్ ఉత్తమమైనదిగా ఉంటోంది. ప్రతి గ్రామీణ విద్యార్థి గ్రామీణ పాఠశాలలోనే 12వ తరగతిని పూర్తి చేసుకున్నట్లయితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది. కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త, రచయిత ‘ ఈ–మెయిల్ : kanchailaiah1952@gmail.com -
ఎన్నికలయ్యాక మేనిఫెస్టోలకు పవిత్రత, చట్టబద్ధత కావాలి
ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)లు, వాటి అమలు రాను రాను ప్రహసనంగా మారుతున్నాయి. అలా కాకుండా వాటికి ఒక పవిత్రత, చట్టబద్ధత, అమలుపరచకుంటే... సదరు ప్రభుత్వాలను రద్దయినా చేసే పరిస్థితి రావాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అలాంటి నిబద్ధతే లేకుంటే, అదీ ఒక రకంగా ఓటర్లను గంపగుత్తగా ప్రలోభపెట్టడమే అవుతుంది. ఎన్నికల ముందు ఏ వాగ్దానమైనా చేయొచ్చు. అరచేత వైకుంఠం చూపి, ఆకర్శణీయ వరాలతో ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకున్నాక.... సదరు హామీలను పూర్తిగా మర్చిపోయి, ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇక ఎన్నికల ప్రణాళికకు ఉండే విలువేంటి? దాన్ని నమ్మి ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటి? అని ఆలోచనాపరులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘మేనిఫెస్టో’ అంటే, ‘ఇదుగో మేం అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఇలా చేస్తాం’అని ముందుగానే ఆయా రాజకీయ పార్టీలు చేసే నిర్దిష్ట ప్రతిపాదన వంటిది. దాన్ని చూసి, నమ్మకంతో ఓటువేసి సదరు పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకురావడమంటేనే, వారిద్దరి మధ్య అదొక పరస్పర అంగీకార పత్రం అయినట్టే లెక్క! అందుకని, పాలకపక్షంగా ఆయా పార్టీలు మేనిఫెస్టోలను అమలు పరచాలి. మేనిఫెస్టో అమలుపరచకపోవడం అంటే, సదరు పరస్పర అంగీకారాన్ని ఉల్లంఘించడమే! ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఒక అంగీకారాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడాన్ని చట్టవిరుద్ధ చర్యగా పరిగణించాలి. తగు విధంగా శిక్షించాలి. ఇప్పటివరకు ఇది లేదు. మలి విడత ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఇటీవలి ఒక మార్పు ఏంటంటే, ప్రధాన పార్టీల ఎన్నికల ప్రణాళికలను ఎన్నికల సంఘం పరిశీలించి, ఆమోదించిన తర్వాతే వాటిని ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాలి. ‘ఇది మా మేనిఫెస్టో’ అని ఆయా పార్టీల వారితో డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇది కొంతలో కొంత మేలు! అలా ప్రకటించిన ప్రణాళికను సదరు పార్టీలు అధికారంలోకి వచ్చాక అమలుపరచకపోతే, ప్రజలెవరైనా న్యాయస్థానాలను సంప్రదించవచ్చనే వెసలుబాటు కల్పించారు. కానీ, ఇది మాత్రమే సరిపోదు! ప్రకటించిన స్ఫూర్తి కొరవడకుండా మేనిఫెస్టోను ‘యధాతథం’ అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా, ‘ఇదో ఇలా అన్నాం, ఇలా చేశాం, ఇది అమలుపరచడమే!’ అని అరకొరగా చేసి, అటు ఇటుగా తిప్పి బుకాయిస్తే సరిపోదు. దాన్ని నిలదీయడానికి, సదరు వైఫల్యానికి ఆయా పార్టీలను–ప్రభుత్వాలను జవాబుదారు చేయడానికి ఈ విషయంలో ఒక చట్టబద్ద రక్షణ అవసరం. నిన్నటికి నిన్న మనమే చూశాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల్లో పెద్ద పెద్ద హామీలతో ఎన్నికల ప్రణాళికల్ని ప్రకటించిన పాలకపక్షాలు, అధికారం చేజిక్కాక హామీలను సవ్యంగా నెరవేర్చకపోగా అమలుపరచినట్టు జబ్బలు చరచుకున్నాయి. హామీ–అమలుకు మధ్య వ్యత్యాసానికి వక్రభాష్యం చెప్పాయి. కొన్నిటికి సమాధానమే లేదు. పాలన మొదలై రెండున్నరేళ్లు గడవక ముందే, ‘మా ఎన్నికల మేనిఫెస్టోలను పూర్తిగా అమలు చేయడమే కాకుండా, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉంద’ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రకటించి ప్రజల్ని విస్మయ పరిచారు. ఈ పరిస్థితి మారాలి. నిబద్ధత కావాలి. కొన్ని కీలక విషయాల్లో ‘పర్యావరణానికి మేం కట్టుబడి ఉన్నాం’ ‘పేదరికాన్ని నిర్మూలించడానికి మా పార్టీ కట్టుబడి ఉంది’. ‘మేనిఫెస్టోలు–అమలు’పై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరే షన్ హైదరాబాద్‌లో సోమవారం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. పలువురు ప్రొఫెసర్లు, ఎడిటర్లు ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పేదవాడిని బాగుపర్చేలా... ఎన్నికల ప్రణాళికలు, సబ్సిడీలు పేదవాడ్ని బాగుచేయాలి తప్ప ధనికుల్ని మరింత ధనికుల్ని చేసేలా ఉండకూడదు. తమ ప్రణాళికాంశాల ఆర్థిక వ్యయాల్నీ ప్రకటించాలి. అవి రాష్ట్ర ఆదాయవనరులకు లోబడి ఉండాలి. – ప్రొ. కంచ అయిలయ్య ప్రజలు నిలదీసే వాతావరణం ఏదీ? ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించిన సామాజికార్థికాంశాల్ని అమలుపరిచే సంస్కృతి మన రాజకీయ పార్టీలకు లేదు. అలా అమలు చేయనపుడు ప్రజలు పాలకుల్ని నిలదీసి ప్రశ్నించే ప్రజాస్వామ్య వాతావరణం రాష్ట్రంలో, దేశంలో లేదు. – ప్రొ. హరగోపాల్ శ్వేతపత్రం కావాలి రాజకీయపార్టీలు అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన ప్రణాళికను అమలుపరచాలి. అప్పటివరకు ఏ మేరకు అమలుపరచింది ప్రతి ఏటా ఒక శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలి. – ప్రొ.మురళీ మనోహర్ చర్యలుండాలి ఎన్నికల ప్రణాళిక అమలుపరచకపోతే నిలదీసే, చర్యతీసుకునే విధంగా దానికో చట్టబద్ధత ఉండాలి. చర్యలు తీసుకునే ఒక ఎజెన్సీ ఉండాలి. – వినయ్‌కుమార్, ఎడిటర్ నిబద్ధత లేకుంటే వృథాయే... పార్టీలు అనుత్పాదక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నందున అభివృద్ధి కుంటుపడుతోంది. పార్టీలకు నిబద్ధత లేనపుడు మేనిఫెస్టోలు భ్రమ కల్పించే పత్రాలే! అవి తూకానికి తప్ప మరొకందుకు పనికిరావు. – సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు .:: దిలీప్‌రెడ్డి -
కేసీఆర్‌పై గద్దర్ పోటీ
నాగర్‌కర్నూల్ రూరల్: సీఎం కేసీఆర్‌పై ప్రజాగాయకుడు గద్దర్ పోటీచేస్తారని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు అంగీకరించారని టీమాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య వెల్లడించారు. ఈ విషయంలో గద్దర్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేయకుండా తనకు సహకరించాలని కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెన్ బాటిల్ సాయం తో చేసిన ఉద్యమం కంటే ప్రజాఉద్యమాల కోసం తన శరీరంలో బుల్లెట్లు ఉంచుకున్న గద్దర్ నిజమైన ఉద్యమ నాయకుడని అన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు అధికారం దక్కాలన్నదే బీఎల్ఎఫ్ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. అధికారంలోకి వస్తే రైతుబంధుకు అదనంగా కూలీ బంధుపథకం తీసుకొస్తామని హామీఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను పటిష్టపర్చి అందులో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభిస్తామన్నారు. చరమగీతం పాడాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఉద్యమ ముసుగులో గద్దెనెక్కిన కేసీఆర్ నాలుగేళ్ల కాలంలో బంగారు తెలంగాణకు బదులుగా కుటుంబ పరిపాలనతో అప్రజాస్వామికంగా దరిద్రపు తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. సంస్కారం లేని, నీతిమాలిన తిట్ల పురాణంతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి పరిపాలనకు చరమగీతం పాడాలంటే బీఎల్ఎఫ్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్‌లో దళిత కులానికి చెందిన శ్రీనివాస్ బహదూర్‌ను బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ప్రకటించామని గెలిపించాలని కోరారు. సమావేశంలో టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీ, బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు గులాం, నాగర్‌కర్నూల్ శాసనసభ బీఎల్ఎఫ్ అభ్యర్థి శ్రీనివాస్ బహదూర్, స్థానిక బీఎల్ఎఫ్ నాయకులు వర్ధం పర్వతాలు, కందికొండ గీత, ఆర్.శ్రీనివాసులు, దేశ్యానాయక్, రామయ్య పాల్గొన్నారు. రాజ్యాధికారంతోనే బడుగుల అభివృద్ధి కొల్లాపూర్: రాజ్యాధికారంతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం స్థానిక మహెబూబ్ ఫంక్షన్ హాల్లో బీఎల్ఎఫ్ నియోజకవర్గ ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభకు తమ్మినేని వీరభద్రంతోపాటు టీమాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గం కమ్యూనిస్టులకు పుట్టినిల్లు వంటిదని, ఈ కోటపై బీఎల్ఎఫ్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రవర్ణాల పార్టీలుగా మారాయన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించబోయే జాబితాలో కూడా బీసీలకు పెద్దగా ప్రాధాన్యం దక్కేలా లేదన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే చదువుల సావిత్రి అనే పథకంతో ప్రతి అమ్మాయికి చదువుతోపాటు అన్ని రకాల సంక్షమే పథకాలను వర్తింపజేస్తామన్నారు. రైతుబంధుతోపాటు కూలీబంధు పథకాన్ని తీసుకొచ్చి రూ.లక్ష వరకు ఉపాధి రుణాలు ఇస్తామన్నారు. బీఎల్ఎఫ్ ప్రకటించిన 56 స్థానాల్లో 32 స్థానాలు బీసీలకే కేటాయించామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థి బ్రహ్మయ్యచారిని గెలిపించాలని ఆయన కోరారు. కంచె ఐలయ్య మాట్లాడుతూ కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతులు పాలమూరు ప్రాజెక్టులో తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని, రైతుల పక్షాన బీఎల్ఎఫ్ నిలవాలని కోరుతూ తమ్మినేనికి వినతిపత్రం అందజేశారు. సదస్సులో బీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలజం సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాస్ బహద్దూర్, జయరాములు, నాయకులు జాన్‌వెస్లీ, కిల్లె గోపాల్, ఈశ్వర్, జబ్బార్, ఈశ్వర్ పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ ఐలయ్య అడ్డగింత.. ఉద్రిక్తత
పరకాల : ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య వాహనాన్ని వైశ్య సంఘాలు అడ్డుకోవడంతో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. తమ కులంపై అభ్యంతరకర వ్యాఖ్యాలతో పుస్తకం రాయడాన్ని నిరసిస్తూ కొందరు వైశ్యులు.. ఐలయ్య ప్రయాణిస్తోన్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టి, భద్రత నిమిత్తం ఐలయ్యను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రొఫెసర్ ఐలయ్య భూపాలపల్లిలో జరిగిన టీమాస్ సభకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఐలయ్యపై సుప్రీం కోర్టుకు వెళ్తాం.. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే పుస్తకం ద్వారా ఉన్నతమైన ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరచిన కంచె ఐలయ్యపై పై తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. శుక్రవారం వామ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కంచె ఐలయ్య ఒక్క ఆర్యవైశ్యులనే కాదు, బ్రాహ్మణులను, ఏక మొత్తంగా హిందూమతాన్ని నీచపదజాలంతో దూషిస్తూ పుస్తకాలు వెలువరించినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఉగ్రవాదులను ఉరితీసినపుడు సానుభూతి సభలను ఆయన నిర్వహించారని ఆరోపించారు. భారత్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ రచనలు సాగించినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కంచె ఐలయ్యలోని సైకో, కులాల మధ్య చిచ్చుపెట్టడం వంటి దుర్మార్గమైన అనేక నైజాలను వెలికి తీయాల్సిందిగా కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయంలో కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలవబోతున్నామని రామకృష్ణ చెప్పారు. -
టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తు: ఐలయ్య
టీడీపీ, బీజేపీలది అపవిత్ర పొత్తని సామాజికవేత్త కంచె ఐలయ్య విమర్శించారు. సీమాంధ్ర ప్రజలు ఈ పార్టీలు రెండింటినీ తిరస్కరిస్తారని ఆయన చెప్పారు. చంద్రబాబు దేశద్రోహి అని, కేవలం అధికారం కోసమే ఆయన బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని ఐలయ్య మండిపడ్డారు. అసలు చిన్న రాష్ట్రాల ఏర్పాటును ప్రారంభించినదే బీజేపీ అని, ఒకవేళ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే తాము ప్రవపేశపెడతామని బీజేపీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి విభజనకు కారణమైన బీజేపీ, టీడీపీ కలిసి ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయని ఐలయ్య ప్రశ్నించారు.