Kanumuri Raghurama Krishnam Raju
-
తణుకులో పర్యటించిన మంత్రి, ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజులు శనివారం తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు సుమారు రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇరగవరం మండంలం రేలంగి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. దీంతో వారందరికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మంత్రి శీరంగనాథరాజులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే తణుకులో వైఎస్సార్సీపీ అభిమానులు నడిపిస్తున్న రాజన్న క్యాంటీన్‌ను వారు సందర్శించారు. మండలంలోని తేతలి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించగా, తణుకు బ్యాంకు కాలనీ నందు రహదారి నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. సమారు 12000 మంది గ్రామ వాలంటీర్లతో తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో సమావేశమై, అక్కడి సమస్యలపై మంత్రి శీరంగనాథరాజు, ఎంపీ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధిదారులకు చేరాలని వారు ఆదేశించారు. -
ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదే
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదేనని, ఇది తమకు కూడా సమ్మతమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ విషయంలో దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల జమ్మూకశ్మీర్‌లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, కశ్మీర్ పునర్విభజన బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
వారధి కోసం కదిలారు మా‘రాజులు’
సాక్షి, నరసాపురం: ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. అయితే గత టీడీపీ ప్రభుత్వం అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హైడ్రామా నడిపింది. ఇందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంతెన అంశంలో వడివడిగా అడుగులు వేస్తోంది. వశిష్ట వంతెన నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నిర్ణయించారు. దీంతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్‌గట్కరీని ఢిల్లీలో సోమవారం కలవడానికి ఎంపీ, ఎమ్మెల్యే హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. దీంతో వంతెన విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి వశిష్ట వంతెన విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కృతనిశ్చయంతో ఉన్నారు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారా వంతెన నిర్మించి తీరతానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పటికే లోక్‌సభలో వంతెన అంశాన్ని ప్రస్తావించి రెండు జిల్లాల ప్రజల ఇబ్బందులను ప్రధాని ఎదురుగా లోక్‌సభలో వివరించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో వంతెన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ విషయంలోనూ లేని విధంగా నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. స్వయంగా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రుల వద్ద నలిగిన వంతెన ఫైలు వశిష్ట వంతెన అనేది దశాబ్దాల పోరాటం. బహుశా రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్‌కు ఇన్నిసార్లు శంకుస్థాపనలు, సర్వేలు జరగలేదు. బ్రిటీష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. బ్రిటీష్ పాలన మరికొంతకాలం ఉంటే కచ్చితంగా వారి హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మాణం జరిగేదని స్థానికంగా ఉండే పెద్దలు చెప్పుకుంటారు. కాగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇక ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. రాజకీయ వత్తిళ్లతోనే ఇది జరిగిందనేది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పెద్దచర్చ. అయితే అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వెంతెన కథ సాగుతూనే ఉంది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడా వంతెన నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వంతెన నిర్మాణంపై ప్రకటనలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక గత ఐదేళ్లలో అయితే వంతెన విషయంలో టీడీపీ నేతలు పెద్ద డ్రామానే నడిపారు. వంతెన మంజూరు అయిపోయిందంటూ పలుమార్లు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి హడావిడి చేశారు. వైఎస్ హయాంలో రూ.94 కోట్లతో టెండర్లు.. వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. ఆయన పాదయాత్ర సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.94 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలు అన్నీ పూర్తయ్యాయి, ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. అయితే వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందారు. అయితే మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు. కచ్చితంగా నిర్మించి తీరుతాం. వంతెన కట్టాలి.. లేదంటే కుదరదని చెప్పాలి. అంతేగాని ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన వెంటనే టెండర్ పిలిపించి పనులు మైటాస్ సంస్థకు అప్పగించారు. ఆయన బతికుంటే ఎప్పుడో బ్రిడ్జి పూర్తయ్యేది. కానీ ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం వంతెన వచ్చేసిందంటూ హడావిడి చేసింది. స్వీట్లు పంచుకున్నారు. ఇది మోసం చేయడం కాదా. మా హయాంలో ఇలాంటి మోసాలు ఉండవు. కచ్చితంగా వంతెన నిర్మాణం జరిపి తీరుతాం. – ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం -
బాబూ.. నీపై ఉన్న కేసుల సంగతేంటి
సాక్షి, భీమవరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా మంచివారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రముఖ సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ ధ్వజమెత్తారు. భీమవరంలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడో వ్యక్తులను కాకుండా నిత్యం అందుబాటులో ఉండే గ్రంధి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా, కనుమూరు రఘురామకృష్ణంరాజును ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరని, దీనిని గమనించాలన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని విమర్శించారు. నిత్యం జగన్‌పై కేసులు గురించి మాట్లాడే చంద్రబాబు తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు. ఆయన చుట్టూ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ్యత, సంస్కారం మర్చిపోయి ఎన్నికల సభల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడన్నారు. గత ఐదేళ్లుగా తాను ప్రజలకు ఏం చేశానో చెప్పడం లేదని మోహన్‌బాబు విమర్శించారు. మూడెకరాల ఆసామికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాకున్నాడనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జగన్ సోదరి షర్మిళను కించపర్చే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు సభ్యత లేదంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చి పూర్తిగా మోసం చేశాడని, పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సభలో గ్రంధి శ్రీనివాస్, కనుమూరు రఘురామకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, తోట భోగయ్య, రాయప్రోలు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనం, సభలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, సినీహీరో మోహన్‌బాబు, చిత్రంలో గ్రంధి శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు -
ప్రజలు వైఎస్ జగన్‌ని కోరుకుంటున్నారు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వంపై విసిగి, మోసపోయి ప్రజలు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు వ్యాఖ్యానించారు. గురువారం నరసాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కావురు శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. తాము పూర్తిగా, సంపూర్ణంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తామిద్దరూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పూర్తి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అవతల అభ్యర్థి ఎవరనేది చూడకుండానే 5వ సారి పోటీ చేస్తున్నానని వెల్లడించారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అసెంబ్లీ స్థానానికి నెంబర్ వన్‌గా నామినేషన్ ఎలాగైతే వేశారో.. అదే విధంగా నెంబర్ వన్ స్థానంలో ప్రసాద్ రాజు గెలుస్తారని జోష్యం చెప్పారు. -
అది బాబు మైండ్ గేమ్
* ఓ పత్రికలో కథనంపై వైఎస్సార్సీపీ నేత రఘురామకృష్ణంరాజు * జగన్‌తో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి * వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా): విజయం సాధించలేననే అనుమానంతో పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తాడేపల్లిగూడెంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై వచ్చిన కథనాన్ని గోబెల్స్ ప్రచారంగా అభివర్ణించారు. ఆ పత్రిక ఉద్దేశపూర్వకంగానే ఇదంతా రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్‌గేమ్ అని విమర్శించారు. సమావేశంలో పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, పట్టణ కన్వీనర్ యెగ్గిన నాగబాబు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెన్నేటి జగ్జీవన్ పాల్గొన్నారు. ఆయనేమన్నారు? * మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిపై నేను అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం అభూత కల్పన. ఆయనతో నేను సన్నిహితంగా ఉంటా, ఎలాంటి విభేదాలూ లేవు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్నా. ఒక సర్వే ప్రకారం నియోజకవర్గంలో నాకు 53 నుంచి 54 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర పార్టీ, తెలుగుదేశం విభజన పార్టీ. కోస్తాంధ్రలోనే మా పార్టీకి 140 నుంచి 145 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది. తెలంగాణలోనూ గణనీయమైన సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. * ఈ నెల 23వ తేదీన తర్వాత కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన వారంతా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులు దొరకడంలేదు. అందుకే బలంగా ఉన్న మా పార్టీని బలహీనంగా చూపించడానికి ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారు. * విభజన పార్టీ అయిన తెలుగుదేశం రెండు ప్రాంతాల్లో రెండు వాదనలు వినిపిస్తోంది. తెలంగాణలో ఎర్రబెల్లి, కోస్తాంధ్రలో పయ్యావుల కేశవ్ విభిన్న వాదనలు ఎలా వినిపిస్తారు? * ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ చాలా చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వెనక్కు తగ్గుతున్నట్లు ఎలా రాస్తారు? విజయవాడ నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేయనని వెనక్కి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదం. ఆయనసలు మా పార్టీలోనే లేరుకదా. -
వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి
-
వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నేత, తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు నేడు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీలోకి వచ్చారు. జగన్ వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి అనుచరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు భారీగా వీరు వైఎఎస్సార్ సీపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే జగన్‌తోనే సాధ్యమని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని బాలశౌరి అంతకుముందు అన్నారు. రాష్ట్రానికి సరైన నాయకత్వం, దశ, దిశ చూపగలిగిన నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కృతనిశ్చయంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.