kapunadu leaders
-
వైఎస్ జగన్‌తో కాపునాడు జాతీయ అధ్యక్షుడు భేటీ
సాక్షి, అమరావతి/హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): కాపునాడు జాతీయ అధ్యక్షుడు, వంగవీటి రాధా రంగ మిత్రమండలి ముఖ్యనేత గాళ్ల సుబ్రమణ్యం నాయుడు ఆధ్వర్యంలో పలువురు కాపునాడు నాయకులు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగే బీసీ గర్జనకు హాజరయ్యేందుకు వచ్చిన జగన్‌ను కాపునాడు నాయకులు విమానాశ్రయం సమీపంలోని వెటర్నరీ అతిథి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లు మొదలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఒకే సామాజికవర్గానికి జరుగుతున్న న్యాయం వరకు పలు అంశాలు చర్చించినట్టు గాళ్ల సుబ్రమణ్యం నాయుడు తెలిపారు. అధికారంలోకి రాగానే కాపులకు తగిన ప్రాధాన్యత ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్సీపీలో చేరికపై హర్షం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు కాపు వ్యతిరేకి..
-
‘ఈబీసీ కోటాలో మాకు వాటా వద్దు’
సాక్షి, అమరావతి : అగ్రవర్ణాల రిజర్వేషన్లలో ఇచ్చే వాటా తమకు అవసరం లేదంటున్నారు రాష్ట్ర కాపునాడు సంఘం నేతలు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపు వ్యతిరేకి.. మాయ మాటలు చెప్తాడు నమ్మవద్దంటూ హెచ్చరించారు. చంద్రబాబు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలోనే కాపులకు వాటా ఇస్తానని అంటున్నాడు. ఇలా చేయడం అంటే కాపులు, అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టడమే అని తెలిపారు. ఈబీసీ కోటాలో ఇచ్చే రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రచారం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ఓ చేత్తో రిజర్వేషన్లు ఇచ్చి మరో చేత్తో కోర్టులో కేసులు వేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు కోసం వచ్చి.. లిఫ్టులో ఇరుక్కున్నారు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన కాపునాడు నాయకులు లిఫ్టులో ఇరుక్కుపోయారు. లేక్‌వ్యూ అతిథిగృహంలోని లిఫ్టులో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మంగారావు సహా ఆరుగురు అతిథిగృహంలోని లిఫ్టులో ఇరుక్కున్నారు. గంట సేపటి నుంచి వాళ్లు లిఫ్టులోనే ఉండిపోయారు. సాంకేతిక సమస్య కారణంగా లిఫ్టు ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక వాళ్లు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.