వైఎస్‌ జగన్‌తో కాపునాడు జాతీయ అధ్యక్షుడు భేటీ  | Kapunadu National President met with YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తో కాపునాడు జాతీయ అధ్యక్షుడు భేటీ 

Published Mon, Feb 18 2019 3:27 AM | Last Updated on Mon, Feb 18 2019 3:27 AM

Kapunadu National President met with YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌ను కలిసిన కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం తదితరులు

సాక్షి, అమరావతి/హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌(గన్నవరం): కాపునాడు జాతీయ అధ్యక్షుడు, వంగవీటి రాధా రంగ మిత్రమండలి ముఖ్యనేత గాళ్ల సుబ్రమణ్యం నాయుడు ఆధ్వర్యంలో పలువురు కాపునాడు నాయకులు ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగే బీసీ గర్జనకు హాజరయ్యేందుకు వచ్చిన జగన్‌ను కాపునాడు నాయకులు విమానాశ్రయం సమీపంలోని వెటర్నరీ అతిథి గృహంలో కలిశారు.

ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లు మొదలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఒకే సామాజికవర్గానికి జరుగుతున్న న్యాయం వరకు పలు అంశాలు చర్చించినట్టు గాళ్ల సుబ్రమణ్యం నాయుడు తెలిపారు. అధికారంలోకి రాగానే కాపులకు తగిన ప్రాధాన్యత ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్సార్‌సీపీలో చేరికపై హర్షం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement