'పార్టీ సభ్యత్వంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి'
కరీంనగర్ : పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆ జిల్లా జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. అందులోభాగంగా వివిధ జిల్లాలో ఇప్పటికే ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.