karnataka bjp
-
Tejasvi Surya: ఎందుకీ మౌనం?!
బెంగళూరు: విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, దానికి ప్రయాణికుడు చెప్పిన ‘సారీ’తో సరిపెట్టుకున్న ఇండిగో సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. వ్యవహారంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో ఉంది బీజేపీ యువ ఎంపీ కావడం వల్లే ఇలా.. ఎలాంటి చర్యలు లేకుండా వ్యవహారం చల్లారిపోయిందని రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 10వ తేదీన ఇండిగో విమానం నెంబర్ 6ఈ 733లో చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు బోర్డింగ్ జరుగుతున్న టైంలో ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచాడు. ఆ ఘటనకు సంబంధించి క్షమాపణలు చెప్పడంతో.. అక్కడికక్కడే ఆ విషయాన్ని వదిలేసింది ఇండిగో. ఘటన జరిగిన రెండు గంటలకుపైగానే ఆలస్యంగా నడిచింది విమానం. ఇండిగో ప్రకటన ద్వారా.. ఈ విషయం తాజాగా(మంగళవారం) వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రయాణికుడు కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంటూ గత రాత్రి నుంచి మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని.. కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అతని(తేజస్వి సూర్య) ప్రవర్తన ఎప్పుడూ అలాగే చిన్నపిల్లలాగా, చిల్లరగా ఉంటుందని పేర్కొంది. అలా అత్యవసర ద్వారం తెరవడం శిక్షార్హమైన నేరం. విమానయాన అధికారులు ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదంటూ వరుసగా ట్వీట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. గతంలో జనాలను నిరక్షరాస్యులంటూ నిర్లక్ష్యపూరిత కామెంట్లు చేసిన ఇదే తేజస్వి సూర్య.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడంటూ నిలదీస్తోంది కాంగ్రెస్. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏం బదులు ఇచ్చేవాడంటూ మండిపడుతోంది. పిల్లలకు బాధ్యతలు ఇస్తే ఇలాగే ఉంటుందంటూ ఎద్దేశా చేసింది కాంగ్రెస్. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సైతం ఈ వ్యవహారంపై మండిపడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇంకోవైపు శివ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరోజు విమానంలో తేజస్వి సూర్య ఉన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కూడా ఉన్నారు. ఇంకోవైపు విమర్శలు మొదలై.. 24 గంటలు గడుస్తున్న సదరు యువ ఎంపీ స్పందించకపోవడం గమనార్హం. బెంగళూరు సౌత్‌లోని ఎంపీ కార్యాలయం కూడా మీడియా ప్రశ్నకు బదులు ఇవ్వడం లేదు. మరోవైపు కర్ణాటక బీజేపీ సైతం ఈ విమర్శలను తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.! -
Bharat Jodo Yatra: అత్యంత అవినీతి ప్రభుత్వం
మైసూరు: దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది కర్ణాటకలో బీజేపీ సర్కారే అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. పదిరోజుల దసరా సంబరాల్లో మునిగిపోయిన మైసూరు పట్టణానికి భారత్ జోడో యాత్ర చేరుకున్న సందర్భంగా సోమవారం అక్కడ రాహుల్ మాట్లాడారు. ‘40 శాతం ముడుపులకు అలవాటుపడ్డ కర్ణాటక బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని వేధిస్తోంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల వ్యథలకు అంతేలేదు. ఈ కమీషన్ల పరంపరపై ప్రధానికి గతంలోనే రాష్ట్ర కాంట్రాక్టర్లు ఫిర్యాదుచేశారు. అయినా మోదీ చర్యలు శూన్యం’ అని రాహుల్ అన్నారు. మరోవైపు రాహుల్ సోమవారం మైసూరు చాముండి కొండపై చాముండేశ్వరి దేవీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, గురువారం యాత్రలో పాల్గొనేందుకు సోనియా మైసూరు చేరుకున్నారు. -
మహిళకు బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. వీడియో వైరల్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబవళి తన ప్రవర్తనతో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. తమ నిర్మాణాలను కూలగొట్టటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఓ మహిళను ఎమ్మెల్యే బెదిరిస్తూ, తీవ్రంగా దూషించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్ది సమయం తర్వాత తిరిగి ఇంటికి పంపించేశారు. అధికారిక పనులకు అడ్డుపడిన కారణంగా మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఏం జరిగిందంటే? ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు మొత్తం నీట మునిగింది. ఈ క్రమంలో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో పడ్డారు బెంగళూరు నీటి సరఫరా, మురుగు నిర్వహణ విభాగం అధికారులు. మురుగు నీటి కాలువపై నిర్మించారనే కారణంగా నల్లురహళ్లి ప్రాంతంలోని ఓ కమెర్షియల్ భవనం ప్రహరీ గోడను కూల్చేందుకు వచ్చారు. అయితే, ఆ భవనం యజమాని రత్ సగాయ్ మ్యారీ అమీలా అనే మహిళ దానిని వ్యతిరేకించారు. ప్రభుత్వ సర్వేయర్ సర్వే చేసిన తర్వాత, ప్రభుత్వ అనుమతులతోనే నిర్మించామని సూచించారు. అప్పటికే సగం ప్రహరీ గోడను అధికారులు కూల్చారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే లింబవళి.. అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతలను ఆపాలని మహిళ వివరించే ప్రయత్నం చేశారు. పలు పత్రాలను చూపించారు. వాటిని ఆమె నుంచి లాక్కునేందుకు యత్నించారు ఎమ్మెల్యే. జైళ్లో పెట్టిస్తానని ఆమెను బెదిరించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళను అక్కడి నుంచి లాక్కెళ్లి చితకబాదాలని పోలీసులతో అంటున్నట్లు కెమెరాలో నమోదయ్యాయి. కాంగ్రెస్ ఆగ్రహం.. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా. మహిళల భద్రత కోసం కట్టుబడి ఉంటామన్న బీజేపీ కపటత్వం బయటపడిందన్నారు. ‘మీ పార్టీకి చెందిన అరవింద్ లింబవళి ప్రజాప్రతినిధిగా మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తీరు క్షమించరానిది. బీజేపీ నేత క్షమాపణ చెప్పాలి.’ అని కన్నడలో రాసుకొచ్చారు. ಸ್ತ್ರೀ ಉದ್ಧಾರಕರಂತೆ ಕೇವಲ ಬೂಟಾಟಿಕೆಯ ಮಾತಾಡುವ ಬಿಜೆಪಿಗರೇ, ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಅರವಿಂದ ಲಿಂಬಾವಳಿಯವರು ಒಬ್ಬ ಜನಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಮಹಿಳೆಯೊಂದಿಗೆ ಅನುಚಿತವಾಗಿ ನಡೆದುಕೊಂಡ ರೀತಿ ಅಕ್ಷಮ್ಯ. ಇಂಥ ಮಹಿಳಾ ವಿರೋಧಿ ನಡೆಯ ವಿರುದ್ಧ ಮಾತಾಡುವ ಧೈರ್ಯ ತೋರುತ್ತೀರಾ? ಅರವಿಂದ ಲಿಂಬಾವಳಿಯವರು ಆ ಹೆಣ್ಣಿನ ಕ್ಷಮೆ ಕೇಳುತ್ತಾರ?#MahilavirodhiBJP pic.twitter.com/SqRDKXsyif — Randeep Singh Surjewala (@rssurjewala) September 3, 2022 సుర్జేవాలా ట్వీట్‌కు స్పందిస్తూ తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని, అయితే, ఆ మహిళ కాంగ్రెస్ కార్యకర్త అని సూచించారు లింబవళి. ‘నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధమే. కానీ, మీ పార్టీ కార్యకర్త రత్ సగాయ్ మ్యారీ.. మురికి కాలువును చాలా ఏళ్లుగా ఆక్రమించారు. ప్రజలకు సమస్యలు సృష్టించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆమెను కోరండి. మొండితనంగా వ్యవహరించటం మాను కోవాలని సూచించండి.’ అంటూ ట్వీట్ చేశారు లింబవళి. వరదలకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేశారు. ಈ ಬಗ್ಗೆ ನಾನು ಕ್ಷಮೆ ಕೇಳಲು ಸಿದ್ಧನಿದ್ದೇನೆ. ಆದರೆ ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಇದೇ ಕಾರ್ಯಕರ್ತೆ ರೂತ್ ಸಗಾಯ್ ಮೇರಿ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ರಾಜಕಾಲುವೆ ಒತ್ತುವರಿ ಮಾಡಿ, ಜನರಿಗೆ ಸಮಸ್ಯೆಯುಂಟು ಮಾಡಿದ್ದಾರಲ್ಲ, ಅದನ್ನು ಖಾಲಿ ಮಾಡಲು ಹೇಳಿ. ನಿಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತೆಯ ಮೊಂಡುತನವನ್ನು ಇಲ್ಲಿಗೇ ನಿಲ್ಲಿಸಲು ಹೇಳಿ. https://t.co/xveoqmXQK1 pic.twitter.com/18AdaTS0ta — Aravind Limbavali (@ArvindLBJP) September 3, 2022 ఇదీ చదవండి: ‘బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి’.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు! -
కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు?
బెంగళూరు: 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్పులు ఉండబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీ సురేశ్ గౌడ. ముఖ్యమంత్రి మార్పు సహా ఇతర అంశాలపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే.. మార్పు ఉంటుందా? ఉండదా అనే అంశంపై స్పష్టత లేదన్నారు. కానీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ‘రాష్ట్రంలో ఏదైనా మార్పు జరిగితే అది ఆగస్టు 15లోపే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ మార్పులు ఉండబోతున్నాయి. 2023లో రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటం, 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావటమే లక్ష్యం. ఏ సమయంలోనైనా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు.’ అని పేర్కొన్నారు గౌడ. మరోవైపు.. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంచి పనితీరు కనబరుస్తున్నారని తెలిపారు. ఏడాది పదవీ కాలంలో చాలా మంచి పనులు చేశారని, అయితే.. పార్ట ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అనుసరిస్తామన్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ బీజేపీలో కొనసాగుతోందన్నారు తుమకూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే. అయితే, ఆ నిర్ణయం కేంద్ర నాయకత్వం చేతిలో ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అనంతరం బీజేపీలో ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీలో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఈ మార్పులు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు..కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లేజ్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందా? అని అడగగా.. అది మీడియా క్రియేషన్‌గా పేర్కొన్నారు గౌడ. ఇదీ చదవండి: CM Nitish Kumar: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి? -
నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి?
సాక్షి, బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక నుంచి ఈసారి షాక్ తగలనుందని సమాచారం. ఆమెకు రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె యూపీ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. స్థానికేతరులు అవకాశమిస్తున్నా.. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నేటి (24వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రం తరఫున కేసీ రామ్మూర్తి, నిర్మలా సీతారామన్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ ఇద్దరికీ మళ్లీ టికెట్ ఇచ్చే విషయం సస్పెన్స్‌గా మారింది. -
కాంట్రాక్టర్ మృతి కేసు.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా!
కాంట్రాక్టర్ ఆత్మహత్యతో వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించిన ఈశ్వరప్ప.. గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశాడు. తనుకు మద్ధతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక రాజీనామా లేఖను ఈశ్వరప్ప శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి బసవరావ్ బొమ్మైకి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈశ్వరప్ప దిగిపోవాలంటూ విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప దిగిపోవాల్సిందేనని సీఎం బొమ్మై ఆదేశించినట్లు తెలుస్తోంది. Karnataka Minister KS Eshwarappa, whose name appeared in alleged suicide case of contractor Santosh Patil, says that he will handover his resignation to the Chief Minister tomorrow. Says, "Tomorrow I'm handing over the resignation letter to CM. I thank you all for co-operation." pic.twitter.com/vZFVrP4diI — ANI (@ANI) April 14, 2022 బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, బీజేపీ నేత సంతోష్ పాటిల్.. తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి పేమెంట్ క్లియర్ చేయడానికి.. 40 శాతం కమీషన్ కోసం తన పీఏ ద్వారా మంత్రి ఈశ్వరప్ప వేధించాడంటూ సదరు కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. అయితే దర్యాప్తు పూర్తయ్యేదాకా ఆయనపై చర్యలు ఉండబోవని సీఎం బొమ్మై చెప్పారు. ఈ లోపు కాంగ్రెస్ ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఇక.. తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఈశ్వరప్ప ఇదివరకే ఓ ప్రకటన చేశాడు కూడా. -
కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం
బెంగళూరు: పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఖాతాబుక్ సీఈఓ రవీష్ నరేశ్ చేసిన ఆవేదనా భరిత ట్వీట్ కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో అసౌకర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. అద్భుతమైన మౌలిక వసతులతో పాటు సామాజికంగానూ మెరుగైన పరిస్థితులు హైదరాబాద్ సొంతమని తెలిపారు. రాకపోకలకు ఈజీగా ఉండేలా ఎయిర్‌పోర్టు కూడా హైదరాబాద్ సొంతమని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక తమ ప్రభుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికగా సాగుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదమన్నారు సీఎం బవసరాజ్ బొమ్మై. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తుంటారని అన్నారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరేనని గుర్తు చేశారు. మూడేళ్లుగా రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందని అన్నారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్క వారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడడం సహజమని ఎద్దేవా చేసింది. ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది. -
ముస్లింలకు టికెట్లు ఇవ్వం
సాక్షి, బెంగుళూర్: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమను నమ్మరని, అందుకే తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కాని మీకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మమ్మల్ని నమ్మండి.. అప్పుడు మీకు టికెట్లతోపాటు ఏది కావాలంటే అది ఇస్తాం’ అని కర్ణాటకలోని కొప్పల్‌లో కురుబా, ఇతర మైనారిటీవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. వెనుకబడిన కురుబా సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. -
యడ్యూరప్పకు బీజేపీ వార్నింగ్
-
యడ్యూరప్పకు బీజేపీ వార్నింగ్
కర్ణాటకలో గొడవలు పడుతున్న బీజేపీ వర్గాలు రెండింటికీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గట్టి షాకిచ్చారు. సీనియర్ నాయకుడు, పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వర్గానికి చెందిన ఇద్దరితో పాటు ఆయన ప్రత్యర్థి కేఎస్ ఈశ్వరప్ప వర్గానికి చెందిన మరో ఇద్దరిపై కూడా వేటు వేశారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఎవరికి వాళ్లు అవతలి వర్గంపై చర్య తీసుకోవాలని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రెండు వారాల పర్యటన కోసం జమ్ము కశ్మీర్లో ఉన్న అమిత్ షా.. పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి మురళీధర్ రావుతో సంప్రదించి రెండు వర్గాలకు చెందిన ఇద్దరిద్దిరిని పార్టీ నుంచి తొలగించారు. పార్టీ ఉపాధ్యక్షులు భానుప్రకాష్, నిర్మల్ కుమార్ సురానా, రైతు మోర్చా ఉపాధ్యక్షుడు ఎంపీ రేణుకాచార్య, అధికార ప్రతినిధి జి.మధుసూదన్‌లను అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చూసుకోవాలి గానీ, వాటిని రోడ్డుమీదకు తీసుకెళ్లడం ఏ పార్టీకైనా ఆరోగ్యకరం కాదని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మురళీధర్ రావు అన్నారు. వచ్చే సంవత్సరం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తాము అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోంది. దక్షిణాదిన తమకు అధికారం అందించిన ఏకైక రాష్ట్రం కావడంతో మళ్లీ కర్ణాటకను చేజిక్కించుకోవాలని కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు రావడం మంచిది కాదని భావిస్తున్నారు. యడ్యూరప్ప కేవలం తన అనుచరులకే మేలు చేస్తూ ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీకి సంబంధం లేకుండా దళితులు, వెనకబడిన వర్గాలను ఐక్యం చేసేందుకంటూ కురుబ వర్గానికి చెందిన కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల ఓ భారీ సమావేశం నిర్వహించారు. అలా చేయొద్దని యడ్డి హెచ్చరించినా ఆయన వినిపించుకోలేదు. ఆ సమావేశంలో లింగాయత్ నాయకుడైన యడ్యూరప్పపై పలువురు మండిపడ్డారు. యడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ఈశ్వరప్ప అంటున్నారు. అమిత్ షా స్వయంగా ఆయనను పార్టీ అధ్యక్షుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు తామంతా సంతోషించామని, కానీ అంతమాత్రాన ఆయన ఏం అనుకుంటే అది చేస్తానంటే మాత్రం కామ్‌గా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. -
షా చాణక్యం.. యడ్డీకే 'కర్ణాటక' పట్టం
న్యూఢిల్లీ/ బెంగళూరు: సంస్థాగతంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బలమైన లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పకే బీజేపీ చీఫ్ పదవి దక్కింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అనంతరం యడ్డీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్ణాటకతోపాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే కర్ణాటక అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించింది. యడ్యూరప్పను అధ్యక్షుణ్ని చేసేందుకు అమిత్ షా గొప్ప చాణక్యమే నెరపాల్సివచ్చింది. నిజానికి యడ్డీకి మోదీ, షాలతో సత్సంబంధాలు లేవు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన యడ్డీ.. పార్టీ కురువృద్ధుడు అద్వానీకి వీర విధేయుడు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీలో నెలకొన్న తాజా పరిస్తితులు, బీజేపీ నుంచి దూరమై సొంతకుంపటి పెట్టుకోవటం వల్ల ఒరిగేదేమీ ఉండదని తెలిసిరావటం యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరేలా చేశాయి. మరోవైపు కేసుల విషయంలోనూ యడ్డీకి హైకోర్టులో ఊరట లభించింది. యడ్డీపై విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతి చెల్లదని జనవరిలో కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. దీంతో అధ్యక్ష పదవి చేపట్టేందుకు యడ్డీకి ఉన్న కేసుల అడ్డంకి కూడా తొలిగిపోయినట్లయింది. గనులు, భూముల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ యడ్డీ సహా ఆయన మంత్రివర్గంలోని పలువురిపై నాటి లోకాయుక్త తీవ్ర ఆరోపణలు చేయడం, యడ్యూరప్ప ఏడాదిన్నరపాటు జైలులో గడపటం తెలిసిందే. తిరిగి పార్టీలోకి వచ్చిన యడ్డీకి సారధ్యబాధ్యతలు అప్పగించేవిషయంలో సీనియర్ నాయకులైన సీటీ రవి, నళిన్ కుమార్ కటేల్, ఆర్.అశోక్ ల పేర్లతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే యడ్డీతో పోల్చుకుంటే మిగతా ఎవ్వరికీ పేద, మధ్యతరగతి వర్గాల్లో పట్టులేదు. అందుకు చిన్న ఉదాహరణ ఇటీవల జరిగన బీజేపీ రైతు యాత్ర. కాంగ్రెస్ పాలనలో రైతుల దీన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారంటూ బీజేపీ చేపట్టిన యాత్రకు మొదట్లో అంతగా స్పందనరాలేదు. ఎప్పుడైతే యడ్యూరప్ప రంగప్రవేశం చేశారో, అప్పటినుంచి యాత్ర స్వరూపమే మారిపోయింది. పెద్దెసంఖ్యలో జనం బీజేపీ యాత్రకు హాజరవుతున్నారు. ' ఒకవేళ ఇంకో నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే 2018లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేం కానీ యడ్యూరప్పకు ఇస్తే మాత్రం తప్పక ప్రభావం ఉంటుంది' అని అమిత్ షా బలంగా నమ్మటంవల్లే యడ్డీకి పదవి దక్కిందని, యడ్యూరప్ప ఆ నమ్మకాన్ని నిజం చేయగల సత్తాఉన్న నేత అని బీజేపీ నాయకులు అంటున్నారు. -
చంద్రబాబుది మూర్ఖత్వం: రాఘవులు
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జేడీ (ఎస్)లకు పట్టిన గతే త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కూడా పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ వీ రాఘవులు అన్నారు. శనివారం అనంతపురం విచ్చేసిన రాఘవులు మీడియాతో మాట్లాడారు. బీజేపీతో చంద్రబాబు పొత్తుకు యత్నించడం అత్యంత విషాద ఘట్టమని ఆయన అభివర్ణించారు. గుజరాత్‌లోని గోద్రా అల్లర్లులో వేలాది మంది మైనారటీలు ఊచకోతకు గురయ్యారని, ఆ సంఘటనకు ముఖ్య కారకుడు నరేంద్రమోడీ అని ఈ సందర్భంగా రాఘవులు గుర్తు చేశారు. అలాంటి మోడీని ప్రధానిని చేయాలనుకోవడం చంద్రబాబు మూర్ఖత్వానికి నిదర్శనమని బీ వీ రాఘవులు పేర్కొన్నారు. -
యడ్యూరప్పకు రెడ్‌కార్పెట్; బీజేపీ నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ నిర్ణాయక విభాగమైన కోర్ కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలో శని, ఆదివారాల్లో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించే విషయమై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కూడా సమావేశంలో తీర్మానించారు. అగ్రనేత అద్వానీ మాత్రమే యడ్యూరప్ప రాకను వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఈ విషయమై ఒప్పించేందుకు మాజీ సీఎం సదానందగౌడ నాయకత్వంలో పార్టీ బృందం సోమవారం అహ్మదాబాద్‌కు వెళ్లింది.