![చంద్రబాబుది మూర్ఖత్వం: రాఘవులు - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/2/71381086225_625x300_3.jpg.webp?itok=lLhmxwg6)
చంద్రబాబుది మూర్ఖత్వం: రాఘవులు
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జేడీ (ఎస్)లకు పట్టిన గతే త్వరలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కూడా పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ వీ రాఘవులు అన్నారు. శనివారం అనంతపురం విచ్చేసిన రాఘవులు మీడియాతో మాట్లాడారు. బీజేపీతో చంద్రబాబు పొత్తుకు యత్నించడం అత్యంత విషాద ఘట్టమని ఆయన అభివర్ణించారు.
గుజరాత్లోని గోద్రా అల్లర్లులో వేలాది మంది మైనారటీలు ఊచకోతకు గురయ్యారని, ఆ సంఘటనకు ముఖ్య కారకుడు నరేంద్రమోడీ అని ఈ సందర్భంగా రాఘవులు గుర్తు చేశారు. అలాంటి మోడీని ప్రధానిని చేయాలనుకోవడం చంద్రబాబు మూర్ఖత్వానికి నిదర్శనమని బీ వీ రాఘవులు పేర్కొన్నారు.