Karnataka farmers
-
రైతు రక్తాక్షరాలు
బొమ్మనహళ్లి : కన్నడ నాట విచిత్ర పరిస్థితి నెలకొంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా ఉత్తర కర్ణాటక చుక్కనీరు లేక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో తమకు సాగు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కొందరు రైతులు తమ రక్తంతో ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. కుమారస్వామి సొంత జిల్లా అయిన హాసన్ ప్రాంతం నుంచే లేఖ రాయడం గమనార్హం. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా బాగూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తమకు సాగు, తాగునీటిని కల్పించాలని తమ రక్తంతో లేఖ రాయడంతో పాటు రక్తంతో సంతకాలు కూడా చేశారు. బాగూరు గ్రామం సమీపంలో ఉన్న సొరంగ మార్గం కాలువలో నీరు లేదని, ఈ కాలువకు నీరు మళ్లించాలని, లేకుంటే ప్రజలతో పాటు పశువులు కూడా తాగునీటి కష్టాలు తప్పవన్నారు. భూగర్భ జలాలు సైతం ఇంకిపోవడంతో బోర్లలో సైతం నీరు లేదని, ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఆ లేఖలో పేర్కొన్నారు. నీరు కల్పించలేని పరిస్థితి ఉంటే దయా మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు. -
రాజధానిని ముట్టడించిన రైతులు
కన్నడ రైతన్నకు కోపం వచ్చింది. ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే భారీ సంఖ్యలో వచ్చి రాజధాని బెంగళూరు నగరాన్ని ముట్టడించారు. రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బెంగళూరు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఉత్తర కర్ణాటక రైతులు కూడా తక్షణం కరువు సహాయ చర్యలు చేపట్టాలన్నారు. ఉత్తర కర్ణాటకలోని 12 జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. చెరకు రైతులకు ఫ్యాక్టరీలు బాకీ పడిన వెయ్యి కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు రాజధానిని ముట్టడించారు. రైతులు ట్రాక్టర్లతో అసెంబ్లీ దిశగా వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు.. బెంగళూరు నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిబంధన విధించడంతో దానికి నిరసనగా వందలాది ట్రాక్టర్లతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గాన్ని కూడా రైతులు దిగ్బంధించారు. -
నీటికోసం సరిహద్దులో గొడవ
♦ కృష్ణానది నిల్వనీటి విడుదలకు కర్ణాటక రైతుల యత్నం ♦ అడ్డుకున్న మహబూబ్‌నగర్ రైతులు.. స్వల్ప ఉద్రిక్తత మాగనూర్: రాష్ట్ర సరిహద్దులో నీటి వివాదం చెలరేగింది.. ఆదివారం కృష్ణానదిలో నిల్వ ఉన్న నీటిని రివిట్మెంట్ తొలగించి కర్ణాటక రైతులు మళ్లించుకునేందుకు యత్నించగా.. మహబూబ్‌నగర్ జిల్లా రైతులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమకు తాగునీటి ఇబ్బందులు ఎదురవడంతోనే నీటికి అడ్డంగా ఉన్న రాళ్లను తొలగిస్తున్నామని కర్ణాటక రైతులు చెప్పారు. తమకూ ఇబ్బందులు ఉన్నాయని, ఈ సమయంలో నిలిచిన నీటిని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదిలాఉండగా, కర్ణాటకలోని శక్తినగర్ పవర్‌ప్లాంట్‌కు నీళ్లు అవసరం ఉండడంతో వారం క్రితం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 1,551 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటిని నది మధ్యలో వారి ప్రాంతం లో కొంతవరకు ఇసుకబస్తాలను అడ్డుగా వేసి నిల్వ చేసుకున్నారు. ఆ నీళ్లు మహబూబ్‌నగర్ సరిహద్దులోకి కూడా వచ్చి చేరాయి. వాటిని కర్ణాటక రైతులు దిగువకు విడుదల చేసుకోవడంతో వివాదం మొదలైంది. -
దోపిడీని ప్రోత్సహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం