డెంగీతో ముగ్గురి మృతి
వేములవాడ: డెంగీ తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ముగ్గురు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శంకర్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు డెంగీతో బుధవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన మల్లేశం (30), కాశం లావణ్య (37) తీవ్ర జ్వరంతో ఐదు రోజులుగా బాధపడుతున్నారు. మల్లేశంను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, లావణ్యను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పరిస్థితి విషమించడంతో బుధవారం ఇరువురు మృతి చెందారు. మరో ఘటనలో వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంథిని గ్రామానికి చెందిన రుషి (6) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుడూ హన్మకొండలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మృతి చెందాడు. డెంగీతోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు.