హైదరాబాద్‌లో యువతి అదృశ్యం!
బహదూర్‌పురా: కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన హైదరాబాద్ లోని హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్‌స్వామి తెలిపిన వివరాల ప్రకారం... హుస్సేనీఆలం బైరూపియా గల్లీ ప్రాంతానికి చెందిన బి.రవీందర్ యాదవ్ కూతురు కవిత (18). కాగా ఈ నెల 13వ తేదీన తండ్రి రవీందర్ యాదవ్‌తో పాటు తల్లి మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన కవిత తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది.
అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా, తెలిసిన వారి వద్ద వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి అదృశ్యం అవడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.