kc cannol
-
కుందూపై మూడు జలాశయాలు
సాక్షి, అమరావతి: కుందూ నదిపై మూడు జలాశయాలను నిర్మించి కేసీ (కర్నూలు–కడప) కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను రూ.312.3 కోట్లతో నిరి్మంచనున్నారు. చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో రిజర్వాయర్‌ను రూ.1357.10 కోట్లతో నిరి్మంచనున్నారు. వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ జలాశయాల ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించనున్నారు. మరోవైపు కుందూనది నుంచి ఎనిమిది టీఎంసీలను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన అనుబంధ జలాశయం(ఎస్సార్)–1 జలవిస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోసి ఆయకట్టు స్థిరీకరించే పనులకు కూడా రూ.564.60 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరైంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు మంచి రోజులు.. ►తుంగభద్ర–పెన్నా నదులపై కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్ సంస్థ 1873లో ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా వరకు కాలువ తవ్వకం పనులను 1880 నాటికి పూర్తి చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అదే ఏడాది దీన్ని రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. 1933 నుంచి ఈ కాలువ సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టు కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు ఉంది. ►బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు తుంగభద్రలో సుంకేశుల వద్ద నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోవటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ►కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ►నిర్ణయించారు. ఆ క్రమంలో కుందూ నదిపై రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్ 23న పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. వైఎస్సార్ హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. ►కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. రిజర్వాయర్ల నిర్మాణంతో రాజోలి జలాశయంలో 6 గ్రామాలు, 9,938 ఎకరాలు ముంపునకు గురవుతాయి. జోలదరాశి జలాశయంలో ఒక గ్రామం, 2,157 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. బ్రహ్మం సాగర్‌కు కుందూ జలాలు ►తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 17.73 టీఎంసీలు. కానీ నీటిని సరఫరా చేసే లింక్ కెనాల్ సక్రమంగా లేకపోవడంతో బ్రహ్మంసాగర్‌ను నింపలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా తెలుగుగంగ ఆయకట్టుకు సరిగా నీళ్లందడం లేదు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ►ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ నదిపై వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్ట నిరి్మస్తారు. నదికి వరదలు వచ్చే 65 రోజుల్లో నిత్యం 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలను దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కి.మీ వద్ద అనుబంధ జలాశయం–1 (ఎస్సార్–1) జల విస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోస్తారు. ఆ జలాశయాన్ని నింపి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.564.60 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచి్చంది. ►దీనిద్వారా తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీరనుంది. -
కేసీ కెనాల్‌కు నీళ్లిచ్చే ఆలోచన చంద్రబాబుకు ఉందా?
-
కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, కడప : జిల్లా రైతులు ప్రతిసారి కరువు కొరల్లో చిక్కుకుపోతున్నారు.. మిగతా జిల్లాలకు ఎప్పుడో కరువు వస్తే.. ఇక్కడ మాత్రం పిలవని పేరంటంలా వచ్చి ఇబ్బంది పెడుతోంది. తుంగభద్ర నుంచి సాగునీరు సక్రమంగా రాక పులివెందుల, జమ్మలమడుగు రైతులు అల్లాడుతున్నారు... కృష్ణా జలాలైనా సంపూర్ణంగా వస్తే తప్ప.. కేసీ కాలువతోపాటు ఇతర ప్రాంతాల రైతులకు పంటలు పండించుకునే అవకాశం ఉండదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, గండికోట, జీఎన్ఎస్ఎస్ అధికారులతో వైఎస్ జగన్ శుక్రవారం విడివిడిగా సమీక్షించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో కలిసి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను గండికోటకు ఈసారైనా తీసుకురావాలని.. ఇంతలోపే ముంపు గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సిన పరిహారం మొత్తాన్ని ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలు గండికోటకు వస్తే అక్కడ నుంచి పైడిపాలెంకు తీసుకరావచ్చని.. అలాగే సీబీఆర్‌కు కూడా పంపింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పైడిపాలెం, సీబీఆర్, పీబీసీ, బైపాస్ కాలువలకు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ఉన్నప్పుడే 80శాతం పైగా పనులు పూర్తయితే.. ఇప్పటివరకు ఇంకా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. తుంగభద్ర నుంచి ఈసారైనా పులివెందులకు పూర్తి కోటా నీరు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. ఐఏబీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ మేరకు డిమాండు చేస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పీబీసీకి 4.4 టీఎంసీతోపాటు, మైలవరానికి 1.300టీఎంసీల పూర్తికోటా నీటిని అందించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్లను ఇబ్బంది పెట్టొదు రేషన్ డీలర్లకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగ్గా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని.. అలా కాకుండా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేయడం తగదని వైఎస్ జగన్ సూచించారు. నిజంగానే డీలర్ అన్యాయంగా సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ.. అనవసరంగా ఎలాగోలాగా ఇబ్బందులు పెట్టి తొలగించాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించండి : పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. గ్రామాల్లో సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమావేశాలలో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డి, పీబీసీ, పైడిపాలెం ప్రాజెక్టుల ఈఈలు రాజశేఖర్, చెంగయ్యకుమార్‌లతోపాటు పలువురు డీఈలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ రఘురామయ్య, ఏడు మండలాల తహశీల్దార్లు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శివరామయ్య, శ్రీనివాసులు, ఎల్.వి.ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవోలు మురళీమోహన్‌మూర్తి, సమత, జ్ఞానేంద్రరెడ్డి, మైథిలీ, బాలమునెయ్య, వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయండి నెలకొకమారు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను అధికారులు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఏ సమయానికి ఎక్కడ పింఛన్ ఇస్తున్నారో.. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా తెలపకపోవడంతో లబ్ధిదారుల పింఛనంతా ఆటో ఛార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో ఇబ్బందులు సృష్టించడం తగదని.. మాన్యువల్ పద్దతిలోనే లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేదన్నారు.