k.dileepkumar
-
టీఆర్ఎస్ను నమ్మొద్దు: ఎమ్మెల్సీ దిలీప్
హైదరాబాద్: ఉద్యమకారులపై దాడులు చేసిన వారికి, ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ రాత్రికిరాత్రే టికెట్లు అమ్ముకున్నారని రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ వాదంతో ఓట్లడుగుతూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన కొండా సురేఖ, మహేందర్ రెడ్డి, ఉద్యమకారులను కాల్చి చంపించిన జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు వంటి వారికి టికెట్లిచ్చి అసలైన ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని దిలీప్‌కుమార్ విమర్శించారు -
రాజకీయ ఊసరవెల్లులను తరిమేద్దాం: దిలీప్
హైదరాబాద్: రోజుకు మూడు పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ ఊసరవెల్లులను తరిమేయాలని ఎమ్మెల్సీ, ఆర్ఎల్డీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కె.దిలీప్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎల్డీ అభ్యర్థులతో.. సామాజిక తెలంగాణ సాధన, బలహీనవర్గాలకు, మహిళలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మడమ తిప్పని పోరాటం చేస్తామంటూ ప్రమాణం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం పదవులు, అధికారం లక్ష్యంగా రోజుకు మూడు పార్టీలు మారిన రాజకీయ ఊసరవెల్లుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 24, 25 తేదీల్లో ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్, జయంత్సింగ్, జయప్రద, అమర్‌సింగ్ తదితరులు భువనగిరి, హన్మకొండ, మునుగోడుల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రచారం చేస్తారని దిలీప్‌కుమార్ తెలిపారు