రాజకీయ ఊసరవెల్లులను తరిమేద్దాం: దిలీప్ | political usaravellulanu beet them- Dilip | Sakshi
Sakshi News home page

రాజకీయ ఊసరవెల్లులను తరిమేద్దాం: దిలీప్

Published Mon, Apr 14 2014 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM

రాజకీయ ఊసరవెల్లులను తరిమేద్దాం: దిలీప్ - Sakshi

రాజకీయ ఊసరవెల్లులను తరిమేద్దాం: దిలీప్

 హైదరాబాద్: రోజుకు మూడు పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ ఊసరవెల్లులను తరిమేయాలని ఎమ్మెల్సీ, ఆర్‌ఎల్డీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కె.దిలీప్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎల్డీ అభ్యర్థులతో.. సామాజిక తెలంగాణ సాధన, బలహీనవర్గాలకు, మహిళలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మడమ తిప్పని పోరాటం చేస్తామంటూ ప్రమాణం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం పదవులు, అధికారం లక్ష్యంగా రోజుకు మూడు పార్టీలు మారిన రాజకీయ ఊసరవెల్లుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 24, 25 తేదీల్లో ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్, జయంత్‌సింగ్, జయప్రద, అమర్‌సింగ్ తదితరులు భువనగిరి, హన్మకొండ, మునుగోడుల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రచారం చేస్తారని దిలీప్‌కుమార్ తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement