Keerthi Jalli
-
నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి
దిస్పూర్: సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏమనుకుంటాం..పైనుండి ప్రభుత్వ విధానాల అమలు పరిధిని మాత్రమే చూసుకుంటూ తగిన సూచనలు చేసేవారనే అనుకుంటాం. ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం వీరి సొంతమైనా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మేము సైతం’ అంటూ ప్రజల కష్టాల్లో అడుగులు వేయడానికి కూడా వీరు వెనుకడుగు వేయరు. అచ్చం అలానే అస్సాంకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్న తరుణంలో మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కీర్తి జల్లి స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్‌గా చీరకట్టులో ఆ ప్రాంతాల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఆమె.. బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఐఏఎస్ అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగం విశేషంగా ఆకట్టుకుంది. నిజంగానే ఆమె మట్టిలో మాణిక్యం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ కీర్తి జల్లి ఎవరు? ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కీర్తి జల్లి పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు కీర్తి జల్లి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్న చేస్తున్నారు నెటిజన్లు. కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఆమె తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు ఐ.ఏ.ఎస్ ట్రయినింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందకు ఆమె చేసిన కృషికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్’ దక్కింది. ఉసిరి మురబ్బాతో సమస్యకు చెక్ 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు నిర్వహించే సమయంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. పిల్లల్లో పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్ ప్రధాన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది. పెళ్లైన మరుసటి రోజే విధుల్లోకి 2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి. చదవండి👉: కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా డ్యామేజ్.. పదేళ్లలో చేసిందంతా నీళ్లపాలు! This photo should have gone viral today A rare photo In the photo, Kachar District Commissioner (Srmti Keerthi Jalli, IAS) How to walk in the mud alongside the flood victims A nice photo 🙏🙏 One of them is going to spoil the expensive shoes😀 .. pic.twitter.com/FFEEHw9WLt — Ajit Sonowal (Jit) (@AjitSonowal3) May 26, 2022 A real defination of simplicity. Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.#AssamFloods pic.twitter.com/vPVnik77LF — Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) May 26, 2022 This is an appreciation tweet for @dccachar, Smt. Keerthi Jalli, IAS. Her eagerness to work for the people has no limits. The way she visited the remotest flood affected areas, taking stock of the damage and understanding the suffering of the people deserves huge respect. pic.twitter.com/ki7WPkUZOC — Karim Uddin Barbhuiya (@KUBarbhuiya) May 25, 2022 -
కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా నష్టం!
దిస్పూర్: ప్రతీ ఏటా అస్సాం వరదలు రావడం.. నష్టం వాటిల్లడం జరుగుతున్నదే. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. దిమా హసావో జిల్లాలో గత ఐదు-పదేళ్ల చేపట్టిన నిర్మాణాలు, రోడ్లు వరదల్లో కోట్టుకోవడంపై స్వయంగా సీఎం హిమంత బిస్వ శర్మ ప్రకటన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అస్సాం వరదలతో ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు. వానా-వరద నష్టంతో.. కేవలం ఏడు రాష్ట్రాల్లోనే సుమారు ఐదున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 956 గ్రామాలు పూర్తిగా నీట మునగ్గా, 47, 139, 12 హెక్టార్ల పంట సర్వనాశనం అయ్యిది. ఒక్క నాగోవ్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాచర్‌లో లక్షన్నర, మోరిగావ్‌లో 40వేలమందికి పైగా నిరాశ్రయులయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA). ఆరు జిల్లాల్లో 365 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి.. వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. Assam Floods 2022 ధుబ్రి, దిబ్రుగఢ్, గోలాఘాట్, నల్బరి, శివసాగర్, సౌత్ సాల్మరా, టిన్సుకియా, ఉదల్గురి జిల్లాల్లో నష్టం ఊహించని స్థాయిలో నమోదు అయ్యింది. రోడ్లు సహా అంతటా బ్రిడ్జిలు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున్న నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది. రెండు లక్షలకు పైగా కోళ్లు, పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయి. బ్రహ్మపుత్ర ఉపనది కోపిలి.. ధరమ్‌తుల్ దగ్గర ప్రమాద స్థాయికి దాటి ప్రవహిస్తుండడంతో.. ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఎస్డీఆర్ఎఫ్ కింద 324 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. వాన ప్రభావం తగ్గినా.. వరదలతో నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లేందుకు జనాలు ఇష్టపడడం లేదు. A real defination of simplicity. Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.#AssamFloods pic.twitter.com/vPVnik77LF — Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) May 26, 2022 -
అస్సాం ప్రజల్లో తెలుగు‘కీర్తి’
ఆమె తల్లిదండ్రులకు హైదరాబాద్‌లో కరోనా వచ్చింది.అయినా అస్సాంలో విధులను వదులుకోకుండా ప్రజల్లోనే ఉంది కీర్తి.ఐదారు రోజుల క్రితం వివాహం చేసుకుంది.అయినా మరుసటి రోజే కోవిడ్ స్పెషల్ వార్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది కీర్తి.స్త్రీల రక్తహీనతకు విరుగుడుగా ఉసిరి మురబ్బాను పంచి జనం మెచ్చుకోలు పొందింది కీర్తి.ఎన్నికలలో స్త్రీల భాగస్వామ్యాన్ని ప్రచారం చేసి రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు పొందింది కీర్తి.2013 బ్యాచ్ తెలంగాణ ఐ.ఏ.ఎస్ కీర్తి జెల్లి. ఇవాళ అస్సాం ప్రజల్లో స్త్రీ సామర్థ్యాన్ని,తెలుగువారి సామర్థ్యాన్ని నిరూపించి అభినందనలు అందుకుంటోంది ‘కీర్తి’. మొన్నటి సెప్టెంబర్ మొదటివారంలో అస్సాంలోని ‘కచార్’ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అయిన ‘సిల్చార్’లో కొంత మంది ప్రభుత్వ ముఖ్యాధికారులకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పంపింది కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్ కీర్తి జెల్లి. ‘మా ఇంట్లో సెప్టెంబర్ 10న వినాయకపూజ ఉంది. రండి’ అని ఆ ఆహ్వానం సారాంశం. జిల్లాలోని ముఖ్యాధికారులు ఆ రోజు కీర్తి జెల్లి బంగ్లాకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లాక తమలాగే మొత్తం 25 మంది అతిథులు కనిపించారు. తాము వచ్చింది కేవలం వినాయక పూజకు మాత్రమే కాదనీ కీర్తి జెల్లి వివాహానికి అని అక్కడకు వెళ్లాకగాని వారికి తెలియలేదు. తమ జిల్లా ముఖ్యాధికారి అంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆనందించారు. వరుడు ఆదిత్యా శశికాంత్ వ్యాపారవేత్త. పూణె నుంచి వచ్చి క్వారంటైన్ నియమాలు పాటించాకే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి ముందే నిశ్చయమైనా లాక్డౌన్ వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధులను వదులుకునే పరిస్థితి లేదు కనుక తన పని చోటులోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కీర్తి తెలిపింది. దాంతో కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ‘జూమ్’ ద్వారా మరో 800 మంది బంధుమిత్రులు వీక్షించారు. తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుంటున్నారు కనుక కేవలం చెల్లెలు ఐశ్వర్య మాత్రం అమ్మాయి తరఫున హాజరయ్యింది. పెళ్లికి కీర్తి ప్రత్యేకంగా సెలవు తీసుకోలేదు. పెళ్లయిన మరుసటి రోజే విధులకు హాజరయ్యి ఎప్పటిలాగే విధుల పట్ల తన అంకితభావాన్ని నిరూపించుకుంది. వరంగల్ అమ్మాయి కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరూ ఐ.ఏ.ఎస్‌కు వెళ్లలేదు. పైగా చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయడం గురించి బంధువుల ఆలోచనలు ఉండేవి. కాని కీర్తి తండ్రి కనకయ్యకు కుమార్తెను ఐ.ఏ.ఎస్ చేయాలని పట్టుదల. చిన్నప్పటి నుంచి ఆయన ఇందిరా గాంధీ వంటి ధీర మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కీర్తిని పెంచారు. ఐ.ఏ.ఎస్ కోచింగ్‌లో చేర్పించారు. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకూ సాధించింది. అస్సాంలో దూకుడు ఐ.ఏ.ఎస్ ట్రయినింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. సాధారణంగా అస్సాం ప్రజలు ఎన్నికల పట్ల నిరాసక్తంగా ఉంటారు. అది గమనించిన కీర్తి తన నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచడానికి, ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడానికి ‘భోని’ (చిన్నచెల్లెలు) అనే ‘ప్రచారకర్త బొమ్మ’ (మస్కట్)ను తయారు చేసి అన్నిచోట్ల ఆ బొమ్మ ద్వారా ప్రజలను ఉత్సాహపరిచింది. అస్సాం సంస్కృతిలో ‘చిన్న చెల్లెలు’ అంటే మురిపం ఎక్కువ. అందుకని ఆ ప్రచారం పని చేసింది. ఇది ఎలక్షన్ కమిషన్‌కు నచ్చింది. దాంతో కీర్తికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్’ ఇప్పించింది. రక్తహీనతకు ఉసిరి మురబ్బా 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు తీసుకున్నప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెకు సవాలుగా మారాయి. అక్కడ 47 శాతం మహిళలు, ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ఇక 33 శాతం ఐదేళ్లలోపు పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్ ప్రధాన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది. కోవిడ్ విధులలో 2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి?