కేజ్రీవాల్ కు సమన్లు
న్యూఢిల్లీ: మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్ లను ఢిల్లీ కోర్టు ఆదేశించింది.. న్యాయవాది ఆనంద్ కుమార్ దాఖలు చేసిన డిఫమేషన్ కేసలో ఆప్ నేతలు కోర్టుకు హాజరుకాకపోవడంపై కోర్టు సీరియస్ గా స్పందించింది. వారికి చట్టం మీద గౌరవం లేదంటూ వ్యాఖ్యానించింది. కాగా గత జూన్ 4 , 2014లో ఈ కేసులో బెయిలు మీద విడుదలైన సంగతి తెలిసిందే. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మయూరి సింగ్ ఈ ముగ్గురి నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.