KERINTHA
-
' కేరింత ' సరదా
-
కేరింత టీమ్‌తో చిట్ చాట్
-
ప్రేమ.. స్నేహం...
కాలేజీ లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. స్నేహం, ప్రేమ కలగలిసిన భావోద్వేగాలతో జీవితం పసందుగా ఉంటుంది. వాటికి తెరరూపాన్నిస్తూ, సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్య తారలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘కేరింత’. అడివి సాయికిరణ్ దర్శకుడు. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ-‘‘ ‘కొత్త బంగారులోకం’ సినిమా తర్వాత కొత్త వాళ్లతో సినిమా చేయాలనుకున్నాం. ఆ టైమ్‌లో సాయికిరణ్ చెప్పిన ఈ కథ నచ్చింది. దీనికి సుమంత్ అశ్విన్ హీరోగా బాగుంటుందనుకున్నాం. ప్రేమ, స్నేహం నేపథ్యంలో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: విజయ్ చక్రవర్తి. -
ప్రేమ కేరింత
ఆరుగురి యువతీ యువకుల జీవితాల్లో జీవితంలో స్నేహం, ప్రేమ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేరింత’. అడవి సాయికిరణ్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్య తారలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘చాలా ఫ్రెష్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయనీ, రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించారనీ సంగీత దర్శకుడు మిక్కీ జే. మేయర్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, సహనిర్మాతలు: శిరీష్,లక్ష్మణ్. -
'కేరింత' ఆడియో ఆవిష్కరణ
-
కొత్తవారి కేరింత
ఔత్సాహిక నటీనటులే ప్రధాన పాత్రధారులుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కేరింత’. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చారు. ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న 18వ చిత్రమిది. రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. కొత్తవాళ్లు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హంట్ నిర్వహించి మరీ ఎంపిక చేశాం. మా సంస్థలో వచ్చిన ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం చిత్రాల తరహాలో కొత్తదనం ఉండే సినిమా ఇది. ఈ నెల 23 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. సెప్టెంబర్‌లో పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: విశ్వ. -
కేరింతా మూవీ ఓపెనింగ్
-
రాష్ట్రం విడిపోయినా... సినీ రంగం విడిపోదు
రాష్ట్రం రెండుగా విడిపోయినా సినీరంగం మాత్రం ఎప్పటికీ విడిపోదని దిల్ రాజు అన్నారు. గురువారం తన కుమార్తె హన్షిత, అల్లుడు హర్షిత్‌రెడ్డితో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘‘మేం సినిమాలు తీసేదే తెలుగు ప్రేక్షకుల కోసం. మా సినిమాలు వారికే అంకితం. ఇక్కడ ప్రాంతాలతో ప్రమేయం లేదు. మంచి సినిమాలు తీయాలని, తెలుగు ప్రజలందరూ కలిసి సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను. ప్రేక్షకులందరికీ మంచి సినిమాలు ఇవ్వాలనే ఆత్రుతతో పనిచేస్తున్నాం. నూతన నటీనటులతో వచ్చే నెలలో ‘కేరింత’ అనే చిత్రాన్ని ప్రారంభిస్తాం. అలాగే ‘లవర్’, ‘కలిసుంటే కలదు సుఖం’ అనే సినిమాలు కూడా చిత్రీకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. -
ఈసారి చిన్న సినిమా!
‘‘నూతన దర్శకులతో 2008లో మా సంస్థలో సినిమాలు నిర్మించాం. ఆ తర్వాత పెద్ద సినిమాలకే పరిమితమయ్యాం. అందుకే, ఈ ఏడాది ‘కేరింత’ అనే చిన్న సినిమా నిర్మించాలనుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో నూతన నటీనటులతో ‘దిల్’ రాజు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘సాయికిరణ్ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో అబ్బూరి రవితో కలిసి పూర్తి కథ రెడీ చేశాం. ఈ చిత్రం ద్వారా ముగ్గురబ్బాయిలు, అయిదుగురమ్మాయిలను పరిచయం చేయనున్నాం. రాష్ర్టంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో ఆడిషన్స్ చేశాం. ఈ 25న హైదరాబాద్‌లో ఆడి షన్స్ జరుపుతాం. వచ్చే నెలాఖరుకి నటీనటుల ఎంపిక పూర్తి చేసి, ఏప్రిల్‌లో షూటింగ్ మొదలుపెడతాం. మా సంస్థలో పని చేసిన విశ్వని కెమెరామేన్‌గా, మధుని ఎడిటర్‌గా, విజయ్‌ని నృత్యదర్శకునిగా పరిచయం చేయనున్నాం’’ అని చెప్పారు. చాలాకాలంగా ఈ కథను వర్కవుట్ చేస్తున్నామని సాయికిరణ్ తెలిపారు. ఈ సమావేశంలో అబ్బూరి రవి, మిక్కీ జే మేయర్ తదితరులు పాల్గొన్నారు.