రాష్ట్రం విడిపోయినా... సినీ రంగం విడిపోదు | Though state was seperated... cine field will not seperate | Sakshi
Sakshi News home page

రాష్ట్రం విడిపోయినా... సినీ రంగం విడిపోదు

Published Thu, May 15 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

రాష్ట్రం విడిపోయినా... సినీ రంగం విడిపోదు

రాష్ట్రం విడిపోయినా... సినీ రంగం విడిపోదు

రాష్ట్రం రెండుగా విడిపోయినా సినీరంగం మాత్రం ఎప్పటికీ విడిపోదని దిల్ రాజు అన్నారు. గురువారం తన కుమార్తె హన్షిత, అల్లుడు హర్షిత్‌రెడ్డితో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘‘మేం సినిమాలు తీసేదే తెలుగు ప్రేక్షకుల కోసం. మా సినిమాలు వారికే అంకితం. ఇక్కడ ప్రాంతాలతో ప్రమేయం లేదు. మంచి సినిమాలు తీయాలని, తెలుగు ప్రజలందరూ కలిసి సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను. ప్రేక్షకులందరికీ మంచి సినిమాలు ఇవ్వాలనే ఆత్రుతతో పనిచేస్తున్నాం. నూతన నటీనటులతో వచ్చే నెలలో ‘కేరింత’ అనే చిత్రాన్ని ప్రారంభిస్తాం. అలాగే ‘లవర్’, ‘కలిసుంటే కలదు సుఖం’ అనే సినిమాలు కూడా చిత్రీకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement