చిరు-లక్ష్మి 'రత్తాలు..రత్తాలు' వచ్చేస్తోంది!
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్‌పై లహరి మ్యూజిక్ స్పందించింది. ఆడియోపరంగా కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపో్తున్న అమ్మడు కుమ్ముడు పాట తాజాగా ఏడుమిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.. అలాగే రెండవ పాట సుందరీ..' పాట 4 మిలియన్ వ్యూస్‌కి చేరుకుంటుండగా, మూడవ పాట 'యు అండ్ మి' పాట 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. దీంతోశ్రోతల నుంచి వస్తున్న సెన్సేషనల్ స్పందనపై ట్విట్టర్ ద్వారా సంతో్షాన్ని వ్యక్తం చేసింది లహరి మ్యూజిక్ సంస్థ.
మరోవైపు రత్తాలు..రత్తాలు ఐటం సాంగ్ ఐటమ్ సాంగ్‌ను డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు. అదే రోజు ఈ చిత్రంలోని అన్ని పాటలు యూ ట్యూబ్ జూక్‌బాక్స్‌లో అందుబాటులోకి రానుంది.
కాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయట..యు/ఎ సర్టిఫికెట్ లభించింది. రత్తాలు..రత్తాలు..ఐటమ్ సాంగ్ లో లక్ష్మీరాయ్ తో చిరంజీవి స్టెప్పులేశారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కొణిదెల ప్రొడక్షన్స్ సారధ్యంలో రామ్ చరణ్. నిర్మి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించగా చిరంజీవి జోడీగా సరసన కాజల్ నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.