Kilimanjaro peak
-
శిఖరాలపై శిఖామణి
సాక్షి, అమరావతి: గట్టి సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదు.. దానికి శరీర దారుఢ్యం తోడైతే.. రాజా శిఖామణి అవుతారు. ఆరు పదుల వయసు దాటినా పర్వతాలను అవలీలగా ఎక్కేస్తారు. 63 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన అందరికీ ఆశ్చర్యం కలిగించే పనులు చేస్తుంటారు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తారు. తాజాగా 63 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు రాజా శిఖామణి. విశ్రాంత పోలీస్ అధికారి అయిన ఆయన ఎవరెస్ట్ ప్రయాణం విజయవంతంగా ముగించుకుని విజయవాడ వచ్చారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న రాజా శిఖామణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన జీవన ప్రస్థానం, ఎన్నో ఆపదలతో నిండిన పర్వతారోహణ విశేషాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు నుంచి కాలిఫోర్నియా వరకు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఒంగోలులో స్థిరపడ్డారు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ (ఏబీఎం) హైస్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్, ఆ తర్వాత అథ్లెటిక్స్ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్సిటీ చాంపియన్‌గా నిలిచాను. తర్వాత ఎస్ఐగా ఎంపికయ్యాను. అనంతపురంలో పోలీస్ శిక్షణ పూర్తిచేసి హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా తొలిపోస్టింగ్ తీసుకున్నా. ఇంటెలిజెన్స్, సివిల్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2016లో విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి ప్రిన్సిపాల్ అయ్యాను. తరువాత ఆరు నెలలు అనంతపురం పీటీసీలో ప్రత్యేకాధికారిగా సేవలందించాను. 5 వేల మంది ఎస్ఐలు, 150 మంది డీఎస్పీలు, 55 మంది ఐపీఎస్‌లకు శిక్షణనిచ్చాను. ఇండియన్ పోలీస్ మెడల్‌తో పాటు అనేక అవార్డులు లభించాయి. కాలిఫోర్నియాలోని రెక్లెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకం, రాష్ట్ర పోలీస్ చిహ్నంతో శిఖామణి మావోయిస్టులకు రెవెన్యూ అధికారినని చెప్పా స్టాండర్డ్ ట్రైనింగ్ కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండో శిక్షణ తీసుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, హోం మంత్రి మైసూరారెడ్డిలకు భద్రతాధికారిగా పని చేశాను. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఎప్పుడు మన రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాకే అప్పగించేవారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. మూడు దేశాలు..మూడు పర్వతాలు పర్వాతారోహణం నా జీవితంలో భాగంగా మారిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేతృత్వంలో నాతో కలిపి ఆరుగురు సభ్యుల బృందం గత నెల విజయవాడ నుంచి బయలుదేరి వివిధ మార్గాల ద్వారా లుక్లాకు చేరుకున్నాం. అక్కడి నుంచి అందరిలా హెలికాప్టర్లో వెళ్లకుండా 70 కిలోమీటర్లు అదనంగా నడిచి మొత్తం 6 వేల మీటర్ల ఎవరెస్ట్ పర్వతాన్ని (బేస్ క్యాంప్ వరకూ) ఏడు రోజుల్లో అధిరోహించాను. నా వయసున్న భారతీయులెవరూ పర్వతారోహణ చేయలేదు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రమాదకరమైన టాంజానియా దేశంలోని కిలిమంజారోను ఎక్కినపుడు నా వయసు 62 ఏళ్లు. దీనికి ఏడాది ముందు యూరప్‌లోనే ఎత్తయిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించాను. దృఢ సంకల్పం వస్తుంది అత్యంత కష్టమైన పర్వతారోహణను అలవోకగా చేయడానికి కారణం చిన్నప్పటి నుంచీ శరీర దృఢత్వంపై పెట్టిన శ్రద్ధ, కఠోర శ్రమ, ఆహార అలవాట్లు. మానసికంగానూ బలంగా ఉండాలి. పర్వతారోహణలో ఎక్కడా సరైన ఆహారం దొరకదు. పైకెళుతున్నకొద్దీ ఒంట్లో శక్తి క్షీణిస్తుంది. మైనస్ 27 డిగ్రీల వద్ద అడుగు ముందుకు పడదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఏమాత్రం పట్టు జారినా లోయల్లో పడిపోతాం. శవం కూడా దొరకదు. చాలా మంది యువకులే మధ్యలో వెనక్కి వచ్చేస్తుంటారు. ముందుకెళ్లడమే తప్ప వెనక్కి వెళ్లాలన్న ఆలోచనే నాకు రాదు. పర్వతారోహణ వల్ల విశాల దృక్పథం పెరుగుతుంది. ఓర్పు, సహనం వంటి లక్షణాలు అలవడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో జీవితంలో ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. -
‘కిలిమంజారో’పై సీఎం జగన్ ఫొటో ప్రదర్శన
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు. కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను ప్రదర్శించి శంకరయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థలో శంకరయ్య స్పోర్ట్స్ కోచ్‌గా పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలోని మారుమూల తండా దాపుపల్లికి చెందిన శీలం ఈశ్వరయ్య డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
బలరాముడికి మరో ఆహ్వానం
కొడంగల్ రూరల్ వికారాబాద్ : ఇటీవల మార్చి 18వ తేదీన ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సాధించిన బలరాం రాథోడ్‌కు ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీన రష్యా దేశంలోని అతి ఎత్తైన ఎల్బ్రుస్ పర్వతం అధిరోహించడానికి ఆహ్వానం అందిందని బలరాం రాథోడ్ తెలిపారు. బొంరాస్‌పేట మండలం చిల్ముల్ మైలారం అనుబంధ గ్రామం సత్తార్కుంట తాండాకు చెందిన బలరాం రాథోడ్ 2017 నవంబర్ 16 నుండి డిశంబర్ 5వ తేదీ వరకు హిమాలయ మౌంటెన్ డార్జిలింగ్‌లో సముద్ర మట్టం నుండి 16,600 అడుగుల ఎత్తులోని రేణాక్ పర్వతం అధిరోహించి ‘ఏ’ గ్రేడ్ సర్టిఫెట్ అందుకున్నాడు. డిగ్రీ బీఎస్సీ (బీజెడ్సీ) పూర్తి చేసుకున్న బలరాం రాథోడ్ గతంలో రన్నింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ‘ఏ’ (ఆల్ఫా) గ్రేడ్ సర్టిఫికెట్ పొందిన బలరాం రాథోడ్ ప్రపంచంలోని ఏ పర్వతమైనా అధిరోహించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్చి 18వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీ నుండి రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన భువనగిరిలో రాక్ క్లైంబింగ్ సెలక్షన్స్ నిర్వహించారని అందులో తనతోపాటు మరో 5 మందిని సెలక్ట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం భవనగిరిలో కోచ్ మాస్టర్ శేఖర్, మాస్టర్ పరమేష్కుమార్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూ కొత్త వారికి శిక్షణ అందిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు రూ.4 లక్షలకుపైగా ఖర్చు చేసుకుంటూ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించానని, ప్రస్తుతం దాతలు సహాయం చేసి రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాన్ని అధిరోహించేందుకు తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు రూప్లానాయక్ మేస్త్రీ పనులు చేసుకుంటూ అన్న రమేష్ రాథోడ్ ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ తనను ప్రోత్సహిస్తున్నారని, ఎల్బ్రుస్ పర్వతాన్ని ఎక్కడానికి దాతలు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని బలరాం రాథోడ్ కోరుతున్నారు. -
కిలిమంజారోపై ‘సప్తపది’
► కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ విద్యార్థులు ► శిఖరాగ్రంపై 100 అడుగుల జాతీయ పతాకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యం త ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని సోమవారం అధిరోహించారు. వీరిలో పలు వురు గిరిజన, బీసీ ఆశ్రమ పాఠశాలల విద్యా ర్థులుండటం విశేషం. శిఖరాగ్రాన 100 అడు గుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, గిరిజన వీరు డు కుమ్రం భీంల చిత్రపటాలను ప్రదర్శిం చారు. ఈ బృందంలో వనపర్తి సాంఘిక సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదువు తున్న సబావత్ సునీత కూడా ఉండటం విశేషం! ఆమెతో పాటు నాయిని మల్లేశ్ (ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల), ఆనంద్‌కుమార్, శ్రీకుమార్, అరుణ్ కుమార్ (నల్లగొండ), చరణ్‌రాజ్ (నాగర్‌కర్నూలు వాసి, కింగ్‌కోఠీ బీసీ సంక్షేమ హాస్టల్ డిగ్రీ విద్యార్థి), రాఘవేంద్ర (మహబూబ్‌నగర్) బృందంలో ఉన్నారు. ఏపీ నుంచి సత్యారావు (డిగ్రీ విద్యార్థి, బంగారుపాళెం, విశాఖపట్నం), రఘునీథ్ (మౌంటెనీరింగ్ గైడ్, తాడేపల్లి, గుంటూరు) ఈ బృందంలో ఉన్నారు. తమిళనాడు నుంచి నలుగురు, పశ్చిమ బంగ, మహారాష్ట్రల నుంచి ఒక్కొ క్కరు కూడా బృందంలో ఉన్నారు. మొత్తం 15 మందితో కూడిన భారత బృందం ఈ నెల 10న పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. పర్వతారోహకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో సోమవారం సాయంత్రానికల్లా 5,895 మీటర్లు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరి విజయపతాక ఎగురవేసింది. ఆనంద్‌కుమార్ 2014లో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పర్వతారోహ ణను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థు లను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అభినందించారు. సీఎం కేసీఆర్ చొరవే ఈ విజయానికి కారణ మన్నారు. గిరిజన విద్యార్ధులకు అత్యుత్తమ విద్య, అవకాశాలను కల్పిస్తున్న సీఎంకు, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.