'వైఫై మనల్ని చంపేస్తుంది'
లండన్: టెక్నాలజీ డెవలప్మెంట్ మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆస్కార్ విన్నింగ్ సింగర్ అడెలె ఆందోళన చెందుతోంది. మరో 25 ఏళ్లలో వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీ అందరి మరణానికి కారణమౌతుందని అంచనావెస్తుంది.
టెక్నాలజీ మనుషుల జీవితాలను డామినేట్ చేస్తుందని ఇది అంత మంచిది కాదని ఫీమేల్ ఫస్ట్తో మాట్లాడుతూ అడెలె వెల్లడించింది. ప్రజలు నిజానికి వారి ముందున్న క్షణాన్ని ఆస్వాదించకుండా.. ఫోటోలపైనే దృష్టి పెడుతున్నారని అంది. 'గతంలో నేను షో చేస్తున్న సమయంలో ఎవరివద్దా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉండేవి కావు. కాబట్టి నేను జనాల కోసం స్టేజిపైకి వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం ఫోన్ల కోసం వెళ్తున్నట్లుగా ఉంది' అని అడెలె అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి ఎవరూ చూడటం లేదని.. అందరూ ఫోన్లలోనే ఉంటున్నారని అంది. రాబోయే కాలంలో వైఫై మూలంగా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పుకొచ్చింది.