kimidi kalavenkatarao
-
టీడీపీలో ప్రకంపనలు.. కిమిడి నాగార్జున రాజీనామా
సాక్షి, విజయనగరం జిల్లా: చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు. చీపురుపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కరపత్రాలు, పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. బాబు, లోకేష్ అచ్చెన్నాయుడు మోసగాళ్లంటూ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళా వెంకట్రావుకు సహకరించేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. -
ఆ రైతులు ఇంకా....నీరు పేదలే..
‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ గ్రామాల్లో పంటపొలాలకు మడ్డువలస కాలువ ద్వారా సాగునీరు అందిస్తా. మాకు ఓటు వేసి గెలిపించండి. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను అధికారంలోకి రాగానే మొదటి పనిగా మీకు సాగునీరు అందిస్తా. నీరు వస్తే మీ పల్లెలు సస్యశ్యామలంగా మారిపోతాయి. అప్పుడు ఎవ్వరూ వలసలు వెళ్లవలసిన అవసరం లేకుండా చేస్తా.’ మీరు నన్ను నమ్మండి అంటూ 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన కిమిడి కళావెంకటరావు ఆ గ్రామాల ప్రజలకు హమీలు గుప్పించారు. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టి నేటికి ఐదేళ్లు పూర్తయినా ఇంతవరకు ఆ గ్రామాలకు చుక్క సాగునీరు అందలేదు. దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. మడ్డువలస ప్రాజెక్ట్ ద్వారా నీటిని విడిచిపెట్టి 13 ఏళ్లు కావస్తోంది. ప్రాజెక్ట్ పరిధిలో ఆయకట్టు కాలువల విస్తరణ జరిగి కూడా 13 ఏళ్లే కావస్తోంది. ఇంతవరకూ ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించకపోవడం ఓ సమస్య కాగా, కాలువల విస్తరణ జరగకపోవడం మరో సమస్య. సాక్షి, శ్రీకాకుళం: మండలంలోని పలు గ్రామాలకు మడ్డువలస ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందని పరిస్థి«తి ఉన్నా అధికారులు పట్టించు కోవడంలేదు. దేవరవలస, మంగమ్మపేట, వాండ్రంకి, బోట్లపేట తదితర గ్రామాల్లో కాలువ 56 అడుగులకు పైగా లోతులో ఉంది. ఇంజినీరింగ్ ప్లాన్లు ఈ ప్రాంతంలో ఆయకట్టుకు సాగునీరు అందించని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు నీరు రాక ఈ ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో ఆయకట్టు భూములకు ఆరుతడి అధారంగా సాగు మారింది. ఆయకట్టు పరిధిలో రైతులకు మాత్రం నీటి తీరువా చెల్లించడం తప్పడం లేదు. దీంతో మడ్డువలస విస్తరణతో పాటు సాగునీరు రావాలంటే ఆధునికీకరణ నిమిత్తం రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. ఆందోళనలో రైతులు మడ్డువలస ప్రధాన కుడికాలువ ద్వారా వాండ్రంగి పంట పొలాలకు సాగునీరు రావాలంటే 2009వ సంవత్సరంలో చేపట్టిన మొదటి అలైన్మెంట్ ద్వారా పనులు చేస్తేనే పంట పొలాలకు సాగునీరు అందుతుందని, లేకపొతే భూములన్నీ బీడుగా మారుతాయని మాజీ సర్పంచ్ బూరాడ వెంకటరమణ తెలిపారు. ఈ విషయంపై గతంలో రాష్ట్ర మంత్రి కళా వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 2009వ సంవత్సరంలో చేపట్టిన భూసేకరణ ప్రకారమే పనులు చేయాలని కోరారు. వాండ్రంగి గ్రామానికి మడ్డువలస ప్రధాన కుడి కాలువ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని ఎన్నికల ముందుకూడా ప్రజలకు హామీ ఇచ్చాన్నారని మంత్రికి గుర్తు చేశామన్నారు.అయినా నేటి వరకు మడ్డువలస సాగునీరు కోసం ఎలాంటి పనులు చేయలేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వెలిబుచ్చారు. గ్రామంలో సుమారు 9 వందల ఎకరాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఆయకట్టుకూ అందని నీరు మడ్డువలస ప్రధాన కుడికాలువ ద్వారా మండలంలో ప్రస్తుతం 5,200 ఎకరాలకు సాగునీటి కాలువ ఉంది. పలుచోట్ల పిల్ల కాలువలు లేకపోవడంతో ఈ ప్రధాన కాలువ నీరు కూడా ఆయకట్టుకు అందడంలేదు. రెండోవిడతలో మండలంలో 6,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కాలువను విస్తరించాల్సి ఉంది. మండలంలోని నాగులవలస గ్రామం వద్ద ప్రారంభమైన ఈ కాలువ 16 గ్రామాల మీదుగా నల్లిపేట చెరువు వరకూ ఉంది. ఈ కాలువ నుంచి ఖరీఫ్ ప్రారంభంలో సాగునీరు అందడం గగనం కాగా, వరి పంట కోత దశలో ఉన్న సమయంలో చివరి తడికి కూడా ఆయకట్టు రైతులకు కష్టాలే. నల్లిపేట నుంచి కప్పరాం, దేవరవలస, మంగమ్మపేట మీదుగా లావేరు మండలానికి కాలువను విస్తరించాల్సి ఉండగా మధ్యలోనే నిలిపివేశారు. -
టీడీపీలో వర్గపోరు..!
శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు- కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు వర్గాల మధ్య నలిగిపోతున్నాం...వచ్చే ఐదేళ్లలో టీడీపీకి భవిష్యత్ లేదు... పార్టీ కనుమరుగ వుతుంది... పార్టీని ఆ భగవంతుడే కాపాడాలి... అంటూ పార్టీ పాతపట్నం శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. పార్టీలోని విభేదాలను వెళ్లగక్కాయి. వివరాల్లోకి వెళితే కిమిడి వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్ పాతపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఇది ఇష్టంలేని కింజరాపు వర్గం పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనా యుడుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి, పాతపట్నంలో హల్చల్ చేయాలని కొంత కాలంగా పావులు కదుపుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య ముసలం మొదలైంది. కిమిడి, కింజరాపు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఐదుగురు సభ్యుల తో కూడిన సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో ఒక సభ్యుడైన మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు గైర్హాజరయ్యారు. కమిటీ సభ్యులు కొవగాపు, కలిశెట్టిలతో వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. వాస్తవంగా జిల్లాలో పార్టీనాయకుల మధ్య సమన్వయం కొరవడితే జిల్లా ఇన్చార్జి బండారు సత్యనారాయణమూర్తి, బొండా ఉమామహేశ్వర రావులు చక్కదిద్దుతారు. దీనికి భిన్నంగా కిమిడి లేకుండా, చంద్రబాబునాయుడుకి తెలియకుండా కింజరాపు వర్గం ఏక పక్షంగా సమావేశం ఏర్పాటుచే సింది. విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఫోన్లో కమిటీ సభ్యులకు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో చివరకు ఇన్చార్జిగా ఉన్న కొవగాపుతో కలిసి పని చేయాలని కలిశెట్టిని సూచించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడు చెప్పారు. అందుకే కలిశెట్టి సీరియస్‌గా భయటకు వెళ్లిపోయాడని తెలిపారు. దీనికి భిన్నంగా పాతపట్నం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదనంతరం నిర్ణయం వెలువడ నుందని కింజరాపు వర్గం బయటకు చెబుతోంది. కాపుసామాజిక వర్గాన్ని కాదంటే... శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం విషయంలో కింజరాపు వర్గం కాలు దువ్వుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ తమని కాదని వేరే వర్గం వైపు మొగ్గు చూపితే టీడీపీకి కాపు సామాజిక వర్గం దూరంగా ఉండడం ఖాయమని, ముఖ్యంగా కింజరాపు వర్గాన్ని రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరికలు ఇటీవల బహిరంగంగా రావడం గమనార్హం.