
సాక్షి, విజయనగరం జిల్లా: చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు.
చీపురుపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కరపత్రాలు, పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. బాబు, లోకేష్ అచ్చెన్నాయుడు మోసగాళ్లంటూ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళా వెంకట్రావుకు సహకరించేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.