'వడ్డీ వ్యాపారుల ఒత్తిడితోనే ఆత్మహత్యలు'
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన కిసాన్ బచావో దీక్షను కే రామచంద్రమూర్తి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యలపై సమాజం, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం మంచిదికాదన్నారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా రైతుల శ్రేయస్సు కోసం ముందడుగు వేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.