kistapadu
-
నాగరాజు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. గురువారం ఆయన కిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత రాయల చెరువు మీదగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్ పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదగా కిష్టపాడు చేరుకున్నారు. -
భాస్కర్ రెడ్డి హత్యకేసు; ఎస్సై , కానిస్టేబుళ్లపై బదిలీ వేటు
అనంతపురం:వైఎస్సార్ సీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు సీరియస్ గా స్పందించారు. పెద్దవడుగూరు ఎస్సై నీరంజన్ రెడ్డితో సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించి చార్జ్ మెమోను ఎస్పీ గురువారం జారీ చేశారు. పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.సొసైటీ కార్యాలయంలో విజయ్ భాస్కర్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. -
వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ భాస్కర్ రెడ్డిని టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు. పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న అతనిపై మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. సొసైటీ కార్యాలయంలో విజయ్ భాస్కర్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ, 20 మందికి గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఓ ఉత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పెద్దవడగూరు మండలం కిష్టపాడులో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్ల సహా 20మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. మరోవైపు ఘటనా స్థలానికి డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చేరుకోగా, వారిని గ్రామస్తులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీస్ జీపు ధ్వంసం అయ్యింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు.