అనంతపురం : అనంతపురం జిల్లాలో ఓ ఉత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పెద్దవడగూరు మండలం కిష్టపాడులో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్ల సహా 20మంది గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. మరోవైపు ఘటనా స్థలానికి డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చేరుకోగా, వారిని గ్రామస్తులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీస్ జీపు ధ్వంసం అయ్యింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ, 20 మందికి గాయాలు
Published Wed, Nov 5 2014 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement