ఆహార నియంత్రణ లేకపోవడంతోనే గుండెజబ్బులు
కర్నూలు(హాస్పిటల్): ఆహార నియంత్రణ లేకపోవడంతోనే యువకుల్లోనూ గుండెజబ్బులు అధికమవుతున్నాయని కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను బుధవారం తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు గుండెజబ్బులపై డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. గుండెజబ్బులపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని సూచించారు. గుండె పనితీరు, సమస్యలు, ఆహార అలవాట్లు, దురలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు, గుండెజబ్బుల నివారణ, గుండె జబ్బులకు చికిత్సా విధానం తదితర విషయాలపై అవగాహన కల్పించారు.