Kodangal MLA Reventh Reddy
-
కొడంగల్‌లో వేడెక్కుతున్న రాజకీయం
అధికార పార్టీలో ఇంటిపోరు జిల్లా మొత్తానికి పాకింది. గతంలో తాండూరు, వికారాబాద్‌కే పరిమితమైన గ్రూపు రాజకీయాలు.. నెమ్మదిగా పరిగి, కొడంగల్‌కు విస్తరించాయి. ఈసారి బీఆర్ఎస్ టికెట్ తమకే ఇవ్వాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు. కాదు.. కూడదూ..అంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామనే సంకేతాలిస్తున్నారు. వికారాబాద్: కొడంగల్‌లో గులాబీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. మెల్లమెల్లగా కారులో చిచ్చు రగులుతోంది. అధికార పార్టీలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు.. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కార్యచరణ ప్రకటనతో బహిర్గతమైంది. దీంతో తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలకే పరిమితమైన ఇంటిపోరు కొడంగల్‌కు సైతం పాకినట్లయింది. త్వరలోనే మండలాల వారీగా తమ అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు గురునాథ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న మీటింగ్ ఏర్పాటుకు నిర్ణయించగా.. కేటీఆర్ నుంచి వచి్చన పిలుపు మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. గత సోమవారమే గురునాథ్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌తో భేటీ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల పాటు వేచిచూసి తమ నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. మా పరిస్థితి ఏంటి..? ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గురునాథ్‌రెడ్డి కొడంగల్ గడ్డపై ఓ వెలుగు వెలిగిన నేత. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి 7వేల ఓట్ల తేడాతో, 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి 15 వేల ఓట్లతో రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో కొడంగల్ గడ్డపై రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం ఫ్యామిలీ నుంచి నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వంటి హేమాహేమీలకు ప్రచార, గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో పాతుకుపోయే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా కొనసాగిన గురునాథ్‌రెడ్డి రాజకీయంగా వెనుకబాటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. టికెట్ ఇస్తేనే కొనసాగుతాం.. ఒక్క చాన్స్ అంటూ కొడంగల్‌లో అడుగుపెట్టిన నరేందర్‌రెడ్డి ఏకు మేకై కూర్చున్నారు.అధికార పార్టీ తరఫున ఈసారి కూడా ఆయనే బరిలో ఉంటారనే ఊహాగానాల నేపథ్యంలోబీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకునేందుకు గురునాథ్‌రెడ్డి మద్దతుదారులు రెడీ అవుతున్నారు. అప్పట్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నరేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చామని, ప్రతీసారి ఆయనే పోటీ చేస్తారంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈసారి తన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిని రంగంలో దింపాలని గురునాథ్‌రెడ్డి భావిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తేనే పార్టీలో కొనసాగుతామని, లేదంటే స్వతంత్రఅభ్యరి్థగా పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. 2018లో తాము నిస్వార్థంగా నరేందర్‌రెడ్డికి సపోర్ట్ చేశామని, ఇప్పుడు ఆయన తమకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ మాటను గౌరవించాం గత ఎన్నికల్లో నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పెద్దలు కేసీఆర్ చెప్పిన మాటను గౌరవించాం. నరేందర్‌రెడ్డి గెలుపుకోసం కృషిచేశాం. కొడంగల్‌లో కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టినం. ఆయన ఈ తూరిగూడ నాకే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మేమెట్ల ఒప్పుకుంటం. స్థానికులకే టికెట్ ఇవ్వాలని లోకల్ క్యాడర్ కోరుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఈసారి మాకే టికెట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ మేము ఎమ్మెల్యే బరిలో ఉంటాం. – గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ -
అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?
కొడంగల్: నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, వారి ఆశీర్వాదంతో తాను రాజకీయాల్లో ఎదుగుతున్నట్లు కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంతో పాటు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం కోస్గి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ, ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో చెల్లని రూపాయి కొడంగల్‌లో ఎలా చెల్లుతుందని పరోక్షంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలకు దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు అయూబ్‌ఖాన్ ఆత్మబలిదానమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, రాహుల్‌గాంధీకి అమేథి ఎలాగో.. తనకు కొడంగల్ నియోజకవర్గం అలాగే అని తెలిపారు. తాను చనిపోతే తన సమాధి కొడంగల్‌లోనే నిర్మిస్తారని భావోద్వేగంగా అన్నారు. తెలంగాణ సమాజాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ మొత్తం ఆ నలుగురి చేతుల్లో ఉందని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. రైతులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులు, కా>ర్మికులు, కర్షకులు, సకల జనులు, అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తిపోస్తున్నాయని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. కొంతమంది స్వార్థపరులు కాసుల కోసం కక్కుర్తి పడి అమ్ముడుపోతున్నారని, తానకు అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలు, నాయకులను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌లకు దమ్ముంటే కొడంగల్‌లో నిలబడి గెలవాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పతనానికి కొడంగల్ నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దోపిడీ దొంగలను తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులతో పాటు స్థానిక నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీరాంరెడ్డి, సుభాష్‌నాయక్, మహ్మద్ యూసూఫ్, నందారం ప్రశాంత్, ఏపూరు కృష్ణారెడ్డి, బీ వెంకట్‌రెడ్డి, వెంకటరాములు గౌడ్, నర్సింగ్‌బాన్‌సింగ్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సిద్దిపేట’వెంట 20మంది ఎమ్మెల్యేలు
* సీఎం పదవిని కాపాడుకోవడానికి చేరికలకు ప్రోత్సాహం * కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపాటు తాండూరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంలేదని.. ఉన్న 63 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది ‘సిద్దిపేట’ వైపు ఉన్నారని.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పరోక్షంగా హరీష్‌రావును ఉద్దేశించి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడారు. సీఎంకు సొం త పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకంలేకనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు వాళ్లను తీసుకొస్తున్నారన్నారు. ‘తీగల’ వంటి వారు వెళ్తే పార్టీకి ఏం కాదని, వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి వర్గంలో, నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. 2005 లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరితే.. అది ప్రజాస్వామ్యపద్ధతి కాదని, వారిపై అనర్హత వేటు వేయాలన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించా రు. విద్యుత్ కొరతకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. మహబూబ్‌నగర్‌ను నిర్లక్ష్యం చేస్తూ జూరాల,నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకువస్తానని చెబుతుం డటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ కాలం పనిచేయదని, టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలనే కేసీఆర్ కల నెరవేరదని అన్నారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి ఎలాంటి అ భ్యంతరం లేదన్నారు. అధికారంలోకి వస్తే తాను తెలంగాణ సీఎం అవుతానన్నది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. అందరికీ ఆశలు ఉంటా యి.. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. మంత్రులు డమ్మీలు అని, సీఎం నకిలీ మాటల నాయకుడు అని ఆయన తీవ్ర స్థాయిలో విరు చుకుపడ్డారు.