Koderma district
-
రైడింగ్‌కు వెళ్లిన 42 మంది పోలీసులకు క్వారంటైన్
రాంచీ : అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని సమాచారం అందుకొని రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు అనుకోకుండా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జూలై 4(శనివారం) అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని కోడెర్మా పోలీస్ స్టేషన్‌కు సమాచారమందింది. దీంతో డీఎప్సీ ఆధ్వర్యంలో జయ్ నగర్, చాంద్వారా పోలీస్ స్టేషన్‌కు చెందిన మొత్తం 42 మంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి అక్రమ మద్యం సరఫరా జరుగుతున్న ప్రదేశంలో రైడింగ్ నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా జైలుకు తరలించే ముందు పోలీసులు ఇద్దరు నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం వచ్చిన రిపోర్టులో తేలింది. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ పాజిటివ్ వచ్చిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసులను, మరొక నిందితుడిని దోమచాంచ్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా ఈ విషయమై కోడెర్మా డిప్యూటీ కమిషనర్ రమేశ్ గోలప్ స్పందిస్తూ.. 'రైడింగ్‌కు రెండు బృందాలుగా మొత్తం 42 మంది పోలీసులు వెళ్లారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ముందస్తుగా వారందరిని మేము ఏర్పాటు చేసుకున్న క్వారంటైన్ సెంటర్‌కు తరలించాం. ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారు. అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాం. కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నా వైరస్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం'అంటూ తెలిపారు. మరోవైపు ఇప్పటికే జయనగర్, చాంద్‌వారో పోలీస్ స్టేషన్లకు సాధారణ ప్రజలు రాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే గత నాలుగు రోజులగా ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌లో ఇప్పటివరకు 2,781 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది మృతి చెందారు -
ఆవు మాంసం వడ్డించారంటూ దాడి..
కోడెర్మా, జార్ఖండ్: పెళ్లి విందులో ఆవు మాంసాన్ని (బీఫ్) వడ్డించారంటూ ముస్లిం వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన కోడెర్మా జిల్లా దోమ్‌చాంచ్ తాలుకా, నవాడీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి జుమాన్ మియాన్ తన కొడుకు నిఖా సందర్భంగా బంధువులకు, స్నేహితులకు విందు ఇచ్చాడు. అయితే అతని ఇంటి వెనకాల ఆవు కాళ్లు, కొన్ని ఎముకలు దొరకడంతో, పెళ్లి వేడుకలో ఆవు మాంసం వడ్డించారని గ్రామస్తులు భావించారు. మూకుమ్మడిగా అతని ఇంటిపై దాడి చేసి జుమాన్ను తీవ్రంగా కొట్టారని పోలీసులు వెల్లడించారు. జుమాన్పై దాడితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ల ముందు గల వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం మత ఘర్షణలు తెలెత్తకుండా భారీ స్థాయిలో జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించింది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని కోడెర్మా ఎస్పీ శివాణి తివారి తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్ విధించామన్నారు.‘ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశాం. పరిస్థితి అదుపులోనే ఉంద’ని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆవు మాంసం వడ్డించిన మాట నిజమేనా..? అని విలేకరులు ప్రశ్నించగా.. గ్రామస్తుల ఆరోపణలకు కారణమైన ఆవు కాళ్లు, ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం, రిపోర్టు వచ్చాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా, ఇదే తరహా ఘటన జార్ఖండ్‌లో గతేడాది చోటుచేసుకుంది. రాంఘర్ పట్టణంలో గత జూన్ 29 న కారులో ఆవు మాంసాన్ని తరలిస్తున్నాడనే నెపంతో మటన్ వ్యాపారి అలీముద్దీన్ అన్సారీపై కొందరు దాడి చేశారు. అయితే పట్టుబడిన మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకై పంపగా.. రిపోర్టుల్లో అన్సారీ దగ్గర దొరికింది ఆవు మాంసమే అని తేలింది. దాంతో గోవధ శాలలు నిర్వహిస్తున్న11 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారందరికీ జీవితఖైదు విధిస్తూ రాంఘర్ కోర్టు తీర్పునిచ్చింది. -
అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య
జార్ఖండ్‌లో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక అత్మహత్య చేసుకుంది. కోడెర్మా జిల్లాలోని జయనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం ఈ బాలిక అత్యాచారానికి గురయింది. ఈ నెల 11న పాఠశాల నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలికను 24 ఏళ్ల యువకుడు బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడని కేసు నమోదయింది. నిందితుడిని తర్వాత రోజు అరెస్ట్ చేశారు.