Kolkata girl
-
మూడు నెలలుగా చూస్తున్నా.. అతను రావడం లేదు
దొడ్డబళ్లాపురం : ప్రేమించానని రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకువచ్చిన ప్రియుడు ప్రియురాలిని అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోగా, ఎప్పటికయినా తన ప్రియుడు రాకపోతాడా అని ఆ యువతి గత మూడు నెలలుగా అదే చోట వేచి చూస్తున్న సంఘటన దేవనహళ్లి తాలూకా కారళ్లిలో వెలుగు చూసింది. కారళ్లి ప్రసిద్ధ నందికొండ వద్ద ఉంది. కారళ్లి గ్రామం పరిసరాల్లో గత మూడు నెలలుగా తిరుగుతున్న యువతి బేకరి, దుకాణాలు, బస్టాండులో సేదతీరుతూ, రోడ్డుకు అటూ, ఇటూ తిరుగుతూ, రాత్రి పూట స్థానిక బ్యాంకు ముందు పడుకుంటూ కాలం గడుపుతోంది. మొదట ఆమెను మానసిక అస్వస్థురాలుగా భావించిన గ్రామస్తులకు ఇటీవలే ఆమె విషాద ప్రేమ కథ తెలిసింది. కన్నడ భాష రాకపోవడంతో హిందీ తెలిసిన గ్రామస్తురాలయిన హసీనా అనే మహిళతో మాట్లాడించి వివరాలు తెలుసుకున్నారు. కోల్‌కతాకు చెందిన ఆ యువతిని అజయ్ అనే యువకుడు ప్రేమించాడు. ఇక్కడే నివసిద్దామని కారళ్లి వద్దకు తీసుకువచ్చి ఒక ఇంట్లో కొన్ని రోజులు ఉంచాడు. తరువాత కోల్‌కతా వెళ్లిపోదామని చెప్పి తీసికెళ్లి మార్గం మధ్యలో ఎక్కడో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ప్రియుడిపై ప్రేమను, నమ్మకాన్ని చంపుకోలేని యువతి ఎప్పటికయినా ప్రియుడు తనను వెదుక్కుంటూ ఇక్కడికే వస్తాడని ఆశతో కారళ్లి వద్దే వీధుల్లో నివసిస్తోంది. కథ విన్న గ్రామస్తులు ఆమె భద్రత కోసం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను బలవంతం మీద మహిళా సాంత్వన కేంద్రానికి తరలించి రక్షణ కల్పించారు. ఆ యువతి ప్రస్తుతం మానసికంగా బాగా కుంగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. -
రేప్‌పై తీవ్రంగా స్పందించిన సీఎం
గ్యాంగ్‌టక్: తమ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బాలికపై లైంగిక దాడి జరగడం పట్ల సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులతో స్నేహభావంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ నెల (మే) 15న సిక్కింలో ఓ ట్యాక్సీ డ్రైవర్ బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న 16 ఏళ్ల బాలిక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వచ్చారు. ఓ ట్యాక్సీ తీసుకొని ముగ్గురు స్నేహితులు ప్రయాణిస్తుండగా ఆ ప్రేమ్ రాయ్ అనే ట్యాక్సీ డ్రైవర్ స్నాక్స్ తోపాటు ఏదో డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపాడు. అది తాగిన ఆ ముగ్గురు మత్తులోకి జారకుంటుండగా ఒకరిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో మరో ఇద్దరు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని బలంగా కొట్టి కిందకు తోసి ఆ బాలికతో పారిపోయాడు. దీంతో ఆ ఇద్దరు ఏడ్చుకుంటూ ఇంట్లోవారికి బంధువులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ వార్త సిక్కింలో కలకలం రేపడంతో స్వయంగా ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటన చేశారు. ఆ నేరస్థుడిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని, బహిర్గతం చేయాలని, నలుగురిలో నిలబెట్టాలని సీఎం పోలీసులకు ఆదేశించారు.