రేప్పై తీవ్రంగా స్పందించిన సీఎం | Chamling regrets rape of Kolkata girl, calls for curbing crime | Sakshi
Sakshi News home page

రేప్పై తీవ్రంగా స్పందించిన సీఎం

Published Tue, May 17 2016 7:34 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

రేప్పై తీవ్రంగా స్పందించిన సీఎం - Sakshi

రేప్పై తీవ్రంగా స్పందించిన సీఎం

గ్యాంగ్టక్: తమ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బాలికపై లైంగిక దాడి జరగడం పట్ల సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులతో స్నేహభావంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ నెల (మే) 15న సిక్కింలో ఓ ట్యాక్సీ డ్రైవర్ బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న 16 ఏళ్ల బాలిక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వచ్చారు.

ఓ ట్యాక్సీ తీసుకొని ముగ్గురు స్నేహితులు ప్రయాణిస్తుండగా ఆ ప్రేమ్ రాయ్ అనే ట్యాక్సీ డ్రైవర్ స్నాక్స్ తోపాటు ఏదో డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపాడు. అది తాగిన ఆ ముగ్గురు మత్తులోకి జారకుంటుండగా ఒకరిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో మరో ఇద్దరు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని బలంగా కొట్టి కిందకు తోసి ఆ బాలికతో పారిపోయాడు.

దీంతో ఆ ఇద్దరు ఏడ్చుకుంటూ ఇంట్లోవారికి బంధువులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ వార్త సిక్కింలో కలకలం రేపడంతో స్వయంగా ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటన చేశారు. ఆ నేరస్థుడిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని, బహిర్గతం చేయాలని, నలుగురిలో నిలబెట్టాలని సీఎం పోలీసులకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement