అప్పులబాధతో రైతు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం : కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామానికి చెందిన అబ్బటి రాము(28) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాము తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గతకొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో అప్పులపాలయ్యాడు. గత సంవత్సరం రెండెకరాల భూమిని అమ్మి కొంత మేరకు అప్పులు చెల్లించాడు. ఇంకా సుమారు రూ.10 లక్షల వరకు అప్పులున్నాయి. దీంతో మనస్తాపం చెందిన రాము గురువారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన తండ్రి నర్సయ్య చికిత్స నిమిత్తం మెట్పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. రాము చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. అతడికి భార్య సుమ ఉంది.