Komatireddy Venkatreddi
-
బ్యాలెట్ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి
నల్లగొండ: వచ్చే పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొం డలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో పెద్దఎత్తున ట్యాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాతో పాటు బహిరంగం గా చర్చించుకుంటున్న విషయం తెలిసిందేనని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో 84 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నల్లగొండ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వేలల్లో తేడా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు నిర్వహించినా గట్టి పోటీ ఉంటుందని తేలిందని, కానీ టీఆర్ఎస్ వాళ్లంతా 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచారంటే.. ట్యాంపరింగ్ జరి గినట్లు అనుమానం కలుగుతోందన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవని, అలాంటిది ఆయన 50 వేల మెజార్టీతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రజ ల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, ఆయన కూడా 50 వేల మెజార్టీతో గెలిచారంటే అనుమానం మరింత పెరుగుతోందన్నారు. కొండా సురేఖ, డీకే అరుణ తప్పక గెలుస్తారని సర్వేల్లో తేలితే ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పెట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు. వీటిపై ఇప్పటికే పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్మాల్ చేసి గెలిచారనే అనుమానం తమకు కలుగుతోందని, అందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి సహకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, బండమీది అంజయ్య, భిక్షంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి భవన్ దాటని ముఖ్యమంత్రి
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ దాటి బయటికి రావడంలేదని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ పార్కును మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు కూడా సీఎం బయటికి వచ్చి నివాళులు అర్పించడానికి తీరికలేదని ఆరోపించారు. అంబేద్కర్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలు నివాళులు అర్పిస్తుంటే కేసీఆర్ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్‌లోనే ఉంటున్నాడని విమర్శించారు. అంబేద్కర్‌కు నివాళులు అర్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ అందరికీ దార్శనికుడని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మందడి శ్రీని వాస్‌రెడ్డి, నాయకులు అల్లి సుభాష్‌యాదవ్, సట్టు శంకర్, ఇబ్ర హిం, లతీప్, గుండ్లపల్లి బంగారయ్య, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారు తిప్పర్తి : దేశంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని, వాటిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో సుప్రీంకోర్టు సవరణలను చేయాలని చూస్తుందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేయడంలో విఫలం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సంపత్‌రెడ్డి, కిన్నెర అంజి, లొడంగి వెంకటేశ్వర్లు, భిక్షం, ఆదిమాలం ప్రశాంత్, బద్దం సుధీర్, అబ్దుల్ రహీం, శౌరి, గుర్రం శ్రీనివాసరెడ్డి, కిన్నెర రవి పాల్గొన్నారు. -
అన్యాయంపై ప్రజాప్రతినిధిగా మాట్లాడా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన నియోజకవర్గానికి చెందిన మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీసీసీబీలో నిధుల దుర్వినియోగం విషయమై 21 మంది ఉద్యోగులపై చర్య తీసుకోవాలని సదరు బ్యాంకు ఆదేశించిందన్నారు. అయితే.. నంబర్ 9 గా ఉన్న ఉద్యోగి లక్ష్మిని ఆరు నెలలు సస్పెండ్ చేశారని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో విచారణ చేసి తొలగించినా తమకు అభ్యంతరం ఉండేది కాదన్నారు. సస్పెండ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఏడాది నుంచి తాను 50 సార్లు బ్యాంకు సీఈవోను సంప్రదించానని, ఆమె కూడా చాలా మందికి తన బాధను మొర పెట్టుకుందన్నారు. ఆమె వికలాంగురాలని, భర్త ఆరోగ్యం కూడా సరిగా లేదని, రూ.50 లక్షలు అతని వైద్యం కోసం ఖర్చు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కుటుంబమంతా ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో తన వద్దకు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపైనే తాను ఫోన్లో అడిగితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు సంపత్‌రెడ్డి, సీఈవో కలసి రికార్డు చేశారని, మాట్లాడుతున్న సందర్భంలో దొర్లిన పదాన్ని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలు తన బంధువు కాదని.. సామాన్య వ్యక్తని, అందుకే ఆమెకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడానని వీరేశం వివరణ ఇచ్చారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తోడ్పాటును అందిస్తానన్నారు. విలేకరుల సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సొరంగం పూర్తయితే జన్మధన్యం
కనగల్ (నల్లగొండ) : శ్రీశైలం సొరంగమార్గం పూర్తయితే జన్మధన్యమవుతుందని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తేలకంటిగూడెంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఒత్తిడి చేసి శ్రీశైలం సొరంగం నిర్మాణానికి రూ. 3 వేల కోట్లు మంజూరు చేయించినట్లు తెలి పారు. సొరంగం పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. గ్రావిటీ ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందుతుందన్నారు. రూ.7 వందల కోట్లతో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. తన నాలుగు పర్యాయాల ఎమ్మెల్యే పదవీకాలంలో సుమారు మొత్తంగా రూ. 4 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి మంజూరు చేయించడం మామూలు విషయం కాదన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తేలకంటిగూడెం నుంచి తిమ్మన్నగూడెం వరకు రూ. 1కోటి 20 లక్షలతో బీటీ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో వంద శాతం మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. తేలకంటిగూడెం ఎంపీటీసీ కాంగ్రెస్‌లో చేరిక సీపీఎం పార్టీకి చెందిన తేలకంటిగూడెం ఎంపీటీసీ బోగరి మణెమ్మరామకోటి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరా రు. ఎంపీటీసీకి పార్టీ కండువా కప్పి కాం గ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి పార్టీలో చేరిన ఎంపీటీసీకి ఆయన స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పా లన సాగుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. పూటకో మాట చెప్పుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ భారతి వెంకటేశం, స్థానిక సర్పం చ్ బిల్లపాటి లక్ష్మమ్మ, ఎంపీటీసీ బోగరి మణెమ్మ, నాయకులు జి.భిక్షం యాదవ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బిల్లపాటి మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. చిట్యాల : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ యువత కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. . కార్యక్రమంలో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మం డల అ«ధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, సర్పంచ్ కందిమళ్ల శశిపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కందిమల్ల జైపాల్‌రెడ్డి, ఏర్పుల మైసయ్య, తొట్లపల్లి సురేష్‌గౌడ్, జడల ఆదిమల్లయ్య, రవి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
అది పనికిమాలిన సభ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ: ‘వరంగల్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆవిర్భావ సభ ‘ప్రగతి నివేదన సభ’ కాదని అదొక పనికిమాలిన సభ’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాదను కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలని సీఎం కేసీఆర్ తిట్టడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. సీఎం అయిన తర్వాత కేసీఆర్ అధికార దాహంతో మరింత రెచ్చిపోతు న్నారని విమర్శించారు. -
బంగారు తెలంగాణే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నది నా ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచిన మూడు, నాలుగు నెలల్లో తొలి ప్రాధాన్యత కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. నియోజకవర్గంలో తొలి విడత శాటిలైట్ టౌన్షిప్ పేరుతో ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపడతా.జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా . నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ పార్కు ఏర్పాటు, ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు పంపిణీ చేస్తా. మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ భూములు సేకరించి శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయిస్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి ప్రత్యేక రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. కానీ సీఎం పదవి కంటే కూడా ఈ ప్రాంత ప్రజల బాగోగులు చూసుకోవడం ముఖ్యం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తా. రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయిస్తా. బీసీలు, ముస్లింలు, మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కృషి, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయిస్తా. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచేందుకు పాటుపడతా. రైతులకు 9 గంటల పాటు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా చేయిస్తా. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తా. -
రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ
అన్నెపర్తి (నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్ :జిల్లా కేంద్రంలో రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.150 కోట్లతో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం అన్నెపర్తి బెటాలియన్ వద్ద రూ.15 కోట్లతో చేపట్టిన కృష్ణా తాగునీటి పనులకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధిలో పునరంకితమవుతామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం పానగల్లు నుంచి నార్కట్‌పల్లి వరకు ప్రత్యేక కృష్ణా పైప్‌లైన్ వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో శ్రీశైలం సొరంగమార్గం, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టుల మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో నార్కట్‌పల్లి మండలంలోని ఆమ్మనబోలు వరకు తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ కోసం తనతోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ఎంతో పోరాటం చేశారన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునేందుకు సీఎంతో సహ సీమాంధ్ర మంత్రులు ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారని, ఈ ప్రాంత మంత్రులు క్యాబినేట్ నోట్ పెట్టే విధంగా ఒత్తిడి చేయాలన్నారు. సీఎంను తెలంగాణ మంత్రులు నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ ఒక పక్క అభివృద్ధి, మరో వైపు తెలంగాణ ఉద్యమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య,జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ ఎదుళ్ల పుష్పలత, కమాండెంట్ బాబుజీరావు, రేగట్టె నర్సింహారెడ్డి, నాయకులు ఉట్కూరి వెంకట్‌రెడ్డి, తుమ్మల లింగస్వామి యాదవ్, భిక్షంగౌడ్, బోధనపు వెంకట్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.